అన్వేషించండి

videshi vidyaa deevena scheme: ‘జ‌గ‌న‌న్న విదేశీ విద్యాదీవెన’ ప‌థ‌కం మార్గద‌ర్శకాలు విడుద‌ల‌

విదేశాల్లో ఉన్నత చ‌దువులు చ‌దివేందుకు ఆర్థిక సాయాన్ని అందించే ఉద్దేశ్యంతో ఈ ప‌థ‌కం రూపొందించ‌బ‌డింది. ఈ ప‌థ‌కం కింద అర్హులైన విద్యార్థుల నుండి ద‌ర‌ఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే..

విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు ఆర్థిక సాయానికి ఉద్దేశించిన జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం అమలుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆర్థిక సాయాన్ని పొందిన విద్యార్థులు.. ఏదైనా కారణంతో కోర్సును మధ్యలో ఆపేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సొమ్ము మొత్తం తిరిగి కట్టాల్సిందేనని స్పష్టం చేసింది. దీనికి కట్టుబడి ఉంటానని సదరు విద్యార్థి రూ.100 స్టాంపు పేపరు మీద రాసి ఇవ్వాలి. వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉన్న వారికే పథకం వర్తిస్తుంది. 
Website

స్థానిక సచివాలయంలో తీసుకున్న ఆదాయ పత్రాన్ని కలెక్టరు ధ్రువీకరించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులు ఎవరైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ఇలాంటి పథకాల్లో ఇప్పటికే లబ్ధి పొందలేదని ధ్రువీకరణ ఇవ్వాలి. ఇప్పటికే విదేశాల్లో చదువుకుంటున్న వారికి ఈ పథకం వర్తించదు.

Also Read: జగనన్న విదేశీ విద్యాదీవెనకు దరఖాస్తుల ఆహ్వానం, చివరితేది ఎప్పుడంటే?

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులు విదేశాల్లో పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్ కోర్సులు అభ్యసించేందుకు ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువస్తోంది. 100లోపు ర్యాంకు ఉన్న విశ్వవిద్యాలయాల్లో సీటు సంపాదిస్తే 100% ఫీజును, 100 నుంచి 200 వరకు ర్యాంకు ఉన్న విశ్వవిద్యాలయాల్లో సీటు వస్తే రూ.50 లక్షలు/50 శాతం ఫీజును ప్రభుత్వం చెల్లిస్తుంది.

Also Read:  ఓయూ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ విడుదల - సబ్జెక్టులు, పూర్తి వివరాలు!

అర్హతలు..
* 35 ఏళ్లలోపు ఉన్న వారందరూ అర్హులుగా గుర్తిస్తారు.
* ఏపీలో స్థానికుడై ఉండాలి. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తింపు.
* ప్రతి ఏటా సెప్టెంబరు–డిసెంబరు, జనవరి–మే మధ్య అర్హుల గుర్తింపుకోసం నోటిఫికేషన్‌
* రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీతో ఎంపిక.

200 ర్యాంకుల్లో ఉన్నవాటికే.. 
క్యూఎస్ ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ ప్రకారం మొదటి 200 ర్యాంకుల్లో నిలిచిన విశ్వవిద్యాలయాల్లో ర్యాంకు సాధించిన వారికే ప్రభుత్వం ఈ పథకాన్ని వర్తింప చేయనుంది. 100 నుంచి 200 ర్యాంకు ఉన్న విశ్వవిద్యాలయాల్లో సీటు సంపాదిస్తే రూ.50 లక్షలు/50% ఫీజును చెల్లించనుంది. మొదటి 200 ర్యాంకుల్లో 32 దేశాలకు చెందిన విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.

కేంద్రం 500 ర్యాంకుల వరకు అనుమతి..
కేంద్ర ప్రభుత్వం జాతీయ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం కింద ఎస్సీ విద్యార్థులకు 500 వరకు ర్యాంకులు పొందిన విశ్వవిద్యాలయాల్లో అవకాశం కల్పిస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 200 ర్యాంకుల్లోని విశ్వవిద్యాలయాల వరకే పరిమితం చేసింది.

కోర్సు ఆపేస్తే సొమ్ము తిరిగి కట్టాల్సిందే!
విదేశాల్లో ఉన్నత చ‌దువులు చ‌దివేందుకు ఆర్థిక సాయాన్ని అందించే ఉద్దేశ్యంతో ఈ ప‌థ‌కం రూపొందించ‌బ‌డింది. ఈ ప‌థ‌కం కింద అర్హులైన విద్యార్థుల నుండి ద‌ర‌ఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఆర్ధిక సాయాన్ని పొందిన విద్యార్థులు.. ఏదైనా కార‌ణం చేత కోర్సును మ‌ధ్యలో ఆపేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సొమ్ము మొత్తం తిరిగి చెల్లించాల్సి ఉంటుంద‌ని స్పష్టం చేసింది.

జగనన్న విదేశీ విద్యాదీవెన గైడ్‌లైన్స్

జగనన్న విద్యాదీవెన జీవో

జగనన్న విద్యాదీవెన అర్హత యూనివర్సిటీలు


మరిన్ని ఉద్యోగ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
High Court On Tuni Missing Case: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
Polavaram Project: పోలవరం పనులపై అంతర్జాతీయ నిపుణులు సంతృప్తి.. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణంపై ఆరా!
పోలవరం పనులపై అంతర్జాతీయ నిపుణులు సంతృప్తి.. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణంపై ఆరా!
AP Sarpanch Elections Schedule: ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి

వీడియోలు

Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
1000-Year History of Bathukamma | వెయ్యేళ్ల చరిత్ర కలిగిన బతుకమ్మ పండుగ.. ఎప్పుడు, ఎలా మొదలైంది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
High Court On Tuni Missing Case: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
Polavaram Project: పోలవరం పనులపై అంతర్జాతీయ నిపుణులు సంతృప్తి.. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణంపై ఆరా!
పోలవరం పనులపై అంతర్జాతీయ నిపుణులు సంతృప్తి.. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణంపై ఆరా!
AP Sarpanch Elections Schedule: ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
IND VS WI Series Alive Drama: విండీస్ విశ్వరూపం.. పోరాడి ఓడిన భారత్, ఆక‌ట్టుకున్న సంజూ, తిల‌క్, నితీశ్, హోప్ మెరుపు శతకం, పాల్ పాంచ్ ప‌టాకా,  సిరీస్ సమం
విండీస్ విశ్వరూపం.. పోరాడి ఓడిన భారత్, ఆక‌ట్టుకున్న సంజూ, తిల‌క్, నితీశ్, హోప్ మెరుపు శతకం, పాల్ పాంచ్ ప‌టాకా,  సిరీస్ సమం
Modi Cabinet Expansion: కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ హఠాత్ రాజీనామా - మోదీ కేబినెట్ విస్తరణకు వేళాయెనా?
కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ హఠాత్ రాజీనామా - మోదీ కేబినెట్ విస్తరణకు వేళాయెనా?
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
Embed widget