అన్వేషించండి

AP JVVD: జగనన్న విదేశీ విద్యాదీవెనకు దరఖాస్తుల ఆహ్వానం, చివరితేది ఎప్పుడంటే?

పీహెచ్‌డీ, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు ఏడాదివారీగా లేదా సెమిస్టర్‌ వారీగా కోర్సు పూర్తయ్యేంత వరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపు ఉంటుంది. ఏడాదికి రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ ఇది వర్తిస్తుంది.

జగనన్న విదేశీ విద్యాదీవెన కింద ఆర్థిక సహాయం పొందేందుకు అర్హులైన విద్యార్థుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పథకం కింద ప్రపంచంలో టాప్‌ 200లోపు క్యూఎస్‌ వరల్డ్‌ ర్యాంకుల్లో ఉన్న విదేశీ విశ్వవిద్యాలయాలు/విద్యా సంస్థల్లో పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్‌ అభ్యసించాలనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు విద్యార్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. ఈ వర్గాలకు చెందిన 35 ఏళ్లలోపువారు జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోవచ్చు. 100లోపు ర్యాంకున్న యూనివర్సిటీలకు పూర్తిగా ఉచితం, 101 నుంచి 200 ర్యాంకుగల యూనివర్సిటీలలో రూ.50 లక్షల ఫీజు గానీ, ఆ యూనివర్సిటీ ఫీజులో 50 శాతం గాని ఏది తక్కువైతే ఆ ఫీజును చెల్లించనున్నారు.

Website

డిగ్రీ, పీజీ, ఇంటర్మీడియట్ కోర్సుల్లో 60% మార్కులు లేదా తత్సమాన గ్రేడును కలిగి ఉండాలని, ఎంబీబీఎస్ కోర్సులకు నీట్ పరీక్షలో అర్హత తప్పనిసరి అని ఒక ప్రకటనలో వెల్లడించింది. వార్షికాదాయం రూ.8 లక్షల లోపు, వయసు 35 ఏళ్లకు మించరాదని పేర్కొంది. ఆసక్తి గల విద్యార్థులు వెబ్‌సైట్‌ ద్వారా సెప్టెంబర్ 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 

Also Read: MAT 2022 Notification: మేనేజ్‌మెంట్ కోర్సులకు సరైన మార్గం ‘మ్యాట్’

జగనన్న విదేశీ విద్యాదీవెన మార్గదర్శకాలు ఇవే..

  • ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రకులాలవారికీ ఈ పథకం వర్తిస్తుంది. క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలోని మొదటి 200 యూనివర్శిటీల్లో సీటు సాధించిన వారి ఖర్చును ప్రభుత్వమే భరించనుంది. మొదటి 100 ర్యాంకింగ్స్‌లో ఉన్న యూనివర్శిటీల్లో సీటు సాధిస్తే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఉంటుంది. 

  • 100పైబడి 200 ర్యాంకింగ్స్‌లో ఉన్న యూనివర్శిటీల్లో సాధిస్తే రూ.50లక్షలు వరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించనుంది. నాలుగు వాయిదాల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి ఫీజు రియింబర్స్‌మెంట్‌ జమ చేస్తారు. ల్యాండింగ్‌ పర్మిట్‌ లేదా ఐ–94 ఇమ్మిగ్రేషన్‌ కార్డు సాధించగానే మొదటి వాయిదా చెల్లిస్తారు. ఫస్ట్‌సెమిస్టర్‌ లేదా టర్మ్‌ ఫలితాలు రాగానే రెండో వాయిదా చెల్లింపు ఉంటుంది. రెండో సెమిస్టర్‌ ఫలితాలు రాగానే మూడో వాయిదా చెల్లింపు, నాలుగో సెమిస్టర్‌ లేదా ఫైనల్‌ ఫలితాలు రాగానే నాలుగో వాయిదా చెల్లింపు చేస్తారు.

  • పీహెచ్‌డీ, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు ఏడాదివారీగా లేదా సెమిస్టర్‌ వారీగా కోర్సు పూర్తయ్యేంత వరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపు ఉంటుంది. ఏడాదికి రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ ఇది వర్తిస్తుంది. టాప్‌ 200 యూనివర్శిటీల్లో ఎన్ని సీట్లు సాధిస్తే అందరికీ జగనన్న విదేశీ దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

Also Read:  ఓయూ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ విడుదల - సబ్జెక్టులు, పూర్తి వివరాలు!

అర్హతలు.
* 35 ఏళ్లలోపు ఉన్న వారందరూ అర్హులుగా గుర్తిస్తారు.
* ఏపీలో స్థానికుడై ఉండాలి. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తింపు.
* ప్రతి ఏటా సెప్టెంబరు–డిసెంబరు, జనవరి–మే మధ్య అర్హుల గుర్తింపుకోసం నోటిఫికేషన్‌
* రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీతో ఎంపిక.

 

జగనన్న విదేశీ విద్యాదీవెన గైడ్‌లైన్స్


జగనన్న విద్యాదీవెన జీవో

జగనన్న విద్యాదీవెన అర్హత యూనివర్సిటీలు

 

 

మరిన్ని ఉద్యోగ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget