News
News
వీడియోలు ఆటలు
X

AP EdCET: ఏపీ ఎడ్‌సెట్‌-2023 పరీక్ష వాయిదా, దరఖాస్తు గడువు పొడిగింపు!

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 20న జరపాల్సిన పరీక్షను జూన్ 3వ వారంలో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా రిజిస్ట్రేషన్ గడువును ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా మే 15 వరకు పొడిగించారు.

FOLLOW US: 
Share:

ఆంధ్రప్రదేశ్‌‌లోని బీఈడీ, బీఈడీ (స్పెషల్‌) కోర్సుల్లో 2023-24 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించి 'ఏపీ ఎడ్‌సెట్‌-2023' పరీక్షను ఏపీ ఉన్నత విద్యామండలి వాయిదావేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 20న జరపాల్సిన పరీక్షను జూన్ 3వ వారంలో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా ఏపీ ఎడ్‌సెట్‌ రిజిస్ట్రేషన్ గడువును ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా మే 15 వరకు పొడిగించారు.

అభ్యర్థులు రూ.1000 ఆలస్య రుసుముతో మే 22 వరకు, రూ.2000 ఆలస్య రుసుముతో మే 29 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులకు మే 26 నుంచి 30 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పిస్తారు. ఈ ఏడాది తిరుపతి-శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఎడ్‌సెట్ పరీక్ష బాధ్యతను చేపట్టింది. ఏపీ ఎడ్‌సెట్ 2023 పరీక్ష హాల్‌టికెట్లను జూన్ 2 నుంచి అందుబాటులో ఉంచనున్నారు. జూన్ మూడోవారంలో పరీక్ష నిర్వహించనున్నారు.

వివరాలు..

* ఏపీఎడ్‌సెట్ - 2022

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో బీఏ/బీఎస్సీ/బీఎస్సీ(హోంసైన్స్)/బీకామ్/బీసీఏ/బీబీఎం అర్హత (లేదా) 55 శాతం మార్కులతో బీఈ/బీటెక్ అర్హత ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.

వయోపరిమితి: 01.07.2023 నాటికి 19 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎలాంటి గరిష్ఠ వయోపరిమితిలేదు.

దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజుగా ఓసీ అభ్యర్థులు రూ.650, బీసీ అభ్యర్థులు రూ.500, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.450 చెల్లించాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.

పరీక్ష విధానం..

* మొత్తం 150 మార్కులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. పరీక్ష సమయం 120 నిమిషాలు. 

* పరీక్షలో మొత్తం మూడు విభాగాలు (పార్ట్-ఎ, పార్ట్-బి, పార్ట్-సి) ఉంటాయి. వీటిలో పార్ట్-ఎ: జనరల్ ఇంగ్లిష్ 25 ప్రశ్నలు-25 మార్కులు, పార్ట్-బి: జనరల్ నాలెడ్జ్ 15 ప్రశ్నలు-15 మార్కులు, టెక్నికల్ ఆప్టిట్యూడ్ 10 ప్రశ్నలు-10 మార్కులు ఉంటాయి. ఇక పార్ట్-సిలో మెథడాలజీ 100 ప్రశ్నలు-100 మార్కులు ఉంటాయి. మెథడాలజీలో అభ్యర్థులు ఎంపికచేసుకునే సబ్జె్క్టు నుంచి ప్రశ్నలు వస్తాయి.

* మెథడాలజీలోలో మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్సెస్, బయోలాజికల్ సైన్సెస్, సోషల్ స్టడీస్ (జియోగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్), ఇంగ్లిష్ సబ్జె్క్టులు ఉంటాయి.

ముఖ్యమైన తేదీలు...

* నోటిఫికేషన్ వెల్లడి: 22-03-2023.

* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24-03-2023.

* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 23-04-2023. (15.05.2023 వరకు పొడిగించారు)

* రూ.1000 ఆలస్యరుసుముతో దరఖాస్తుకు చివరితేది: 22-05-2023.

* దరఖాస్తుల సవరణకు అవకాశం: 26.05.2023  - 30.05.2023.

* రూ.2000 ఆలస్యరుసుముతో దరఖాస్తుకు చివరితేది: 29-05-2023.

* హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 02.06.2023 నుంచి.

* ఏపీ ఎడ్‌సెట్ పరీక్ష తేది: జూన్ మూడో వారంలో.

Notifiction

Online Application 

Also Read:

ఏపీఈసెట్‌ - 2023 ప్రవేశ పరీక్ష వాయిదా!
బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సులకు సంబంధించి ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే ఇంజినీరింగ్ఉమ్మడి ప్రవేశపరీక్ష (ఏపీఈసెట్-2023) వాయిదా పడింది. మే 5న నిర్వహించవలసిన ఈ పరీక్షను జూన్20కు వాయిదా వేసినట్లు ఏపీ ఈసెట్ ఛైర్మన్, జేఎన్‌టీయూకే ఉపకులపతి ఆచార్య జీవీఆర్ ప్రసాదరాజు వెల్లడించారు. పాలిటెక్నిక్ ఆఖరి సంవత్సరం పరీక్షలు పూర్తికాకపోవడంతో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ బోర్డు అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పూర్తివివరాలను వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని, సందేహాలకు 85004 04562 నంబరులో సంప్రదించాలని కన్వీనర్ ఆచార్య ఎ.కృష్ణమోహన్ తెలిపారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

డీఈఈసెట్-2023 నోటిఫికేషన్‌ విడుదల, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ!
తెలంగాణలో ప్రాథమిక ఉపాధ్యాయ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే 'డీఈఈసెట్‌-2023' (డీఎడ్‌) నోటిఫికేషన్‌ ఏప్రిల్ 21న విడుదలైంది. రెండేళ్ల కాలపరిమతితో ఉండే డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 22న ప్రారంభమైంది. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు రూ.500 దరఖాస్తు ఫీజు చెల్లించి ఏప్రిల్ 22 నుంచి మే 22 వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. 
ప్రవేశ ప్రకటన, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..

ఫైన్‌ ఆర్ట్స్, డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశాలకు 'ఏడీసెట్‌-2023' నోటిఫికేషన్ వెల్లడి, వివరాలు ఇలా!
కడపలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్‌ & ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ వివిధ ఫైన్‌ ఆర్ట్స్, డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఈ మేరకు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి 'ఆర్ట్‌ & డిజైన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏడీసెట్‌)-2023' నోటిఫికేషన్‌‌ను ఏపీ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష ద్వారా డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీలో నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌(బీఎఫ్‌ఏ), బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ (బీడిజైన్‌ ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏప్రిల్ 21న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాాగా.. మే 20 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 25 Apr 2023 12:27 PM (IST) Tags: APEdCET-2023 Application APEdCET-2023 Notifcation APEdCET-2023 Exam Pattern APEdCET-2023 Exam Dates

సంబంధిత కథనాలు

AP SSC Exams: నేటి నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరుకానున్న 2 లక్షలకుపైగా విద్యార్థులు!

AP SSC Exams: నేటి నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరుకానున్న 2 లక్షలకుపైగా విద్యార్థులు!

VIDYADHAN: పేద విద్యార్థులకు సహకారం - ‘విద్యాధన్’ ఉపకారం! ఎంపిక, స్కాలర్‌షిప్ వివరాలు ఇలా!

VIDYADHAN: పేద విద్యార్థులకు సహకారం - ‘విద్యాధన్’ ఉపకారం! ఎంపిక, స్కాలర్‌షిప్ వివరాలు ఇలా!

CBSE Exams: సీబీఎస్‌ఈ 10, 12 తరగతి సప్లిమెంటరీ పరీక్షల డేట్‌ షీట్స్‌ విడుదల! ఏ పరీక్ష ఎప్పుడంటే?

CBSE Exams: సీబీఎస్‌ఈ 10, 12 తరగతి సప్లిమెంటరీ పరీక్షల డేట్‌ షీట్స్‌ విడుదల! ఏ పరీక్ష ఎప్పుడంటే?

CMAT Result 2023: సీమ్యాట్-2023 ఫలితాలు విడుదల, స్కోరు కార్డు ఇలా పొందండి!

CMAT Result 2023: సీమ్యాట్-2023 ఫలితాలు విడుదల, స్కోరు కార్డు ఇలా పొందండి!

APFU: ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీలో డిప్లొమా ప్రోగ్రాం, ప్రవేశం ఇలా!

APFU: ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీలో డిప్లొమా ప్రోగ్రాం, ప్రవేశం ఇలా!

టాప్ స్టోరీస్

Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Chandrababu :  టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

24 శాతం వడ్డీకి కోట్లాది రూపాయలు అప్పు చేసి ‘బాహుబలి’ తీశాం: రానా

24 శాతం వడ్డీకి కోట్లాది రూపాయలు అప్పు చేసి ‘బాహుబలి’ తీశాం: రానా