EAPCET: ఈఏపీసెట్ వెబ్‌ఆప్షన్ల నమోదు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
ఏపీలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగమైన వెబ్ఆప్షన్ల నమోదు గడువును మరోసారి అధికారులు పొడిగించారు.
ఏపీలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగమైన వెబ్ఆప్షన్ల నమోదు గడువును మరోసారి అధికారులు పొడిగించారు. ఈఏపీసెట్(ఎంపీసీ స్ట్రీమ్) వెబ్ ఆప్షన్ల నమోదకు ఆగస్టు 14 వరకు అవకాశంకల్పిస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా మరో ఎనిమిది రోజులు అవకాశం కల్పించామని తెలిపారు. వెబ్‌ఆప్షన్లు మార్చులుకోరేవారు ఆగస్టు 16న మార్చుకోవచ్చని సూచించారు. అభ్యర్థులకు ఆగస్టు 23న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 23 నుంచి 31లోపు సంబంధిత కళాశాలల్లో నిర్ణీత ట్యూషన్ ఫీజు చెల్లి్ంచి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 31 నుంచే తరగతులు ప్రారంభంకానున్నాయి.
వెబ్ఆప్షన్ల నమోదు కోసం క్లిక్ చేయండి..
కొత్త షెడ్యూలు ఇలా..
➥ వెబ్ఆప్షన్ల నమోదు ప్రక్రియ: 07.08.2023 - 14.08.2023
➥ వెబ్ఆప్షన్ల మార్పునకు అవకాశం: 16.08.2023
➥ అభ్యర్థులకు సీట్ల కేటాయింపు: 23.08.2023
➥ సంబంధిత కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్: 23.08.2023 - 31.08.2023
➥ ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభం: 31.08.2023
92 కళాశాలలకు రూ.43 వేలే ఫీజులు..
ఏపీలోని ప్రైవేట్ కళాశాలల్లో ఇంజినీరింగ్ కోర్సుల ఫీజులు నిర్ణయిస్తూ ప్రభుత్వం ఆగస్టు 6న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 2023-24 సంవత్సరానికి కనీస ఫీజు రూ.43 వేలు, గరిష్ఠం రూ.77 వేలుగా నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 220 ఇంజినీరింగ్ కళాశాలలకు ఫీజులు నిర్ణయించగా 92 కళాశాలల్లో కనిష్ఠ ఫీజు రూ.43 వేలుగా ఉంది. గత నాలుగేళ్లుగా కనీస ఫీజు రూ.35 వేలు ఉండగా హైకోర్టు ఆదేశాలతో రూ.8 వేలు పెరిగింది. అయితే ఫీజుల భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం ఎక్కువ కళాశాలకు కనిష్ఠ ఫీజునే నిర్ణయించిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఓ ఇంజినీరింగ్ కళాశాలకు గతేడాది రూ.60 వేల పైగా ఫీజుండగా.. ఈ ఏడాది రూ.43 వేలకు కుదించడం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది.
కన్వీనర్ సీట్లకు ఫీజుల నిర్ణయం..
ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో 35 శాతం ఉన్న కన్వీనర్ కోటా సీట్లకు ఫీజులు నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఎస్‌ఆర్‌ఎం, విట్, మోహన్‌బాబు యూనివర్సిటీల్లో రూ.70 వేలు, సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో రూ.50 వేలు, భారతీయ ఇంజినీరింగ్ సైన్స్, టెక్నాలజీ ఇన్నోవేషన్ యూనివర్సీటీలో రూ.40 వేలుగా నిర్ణయించింది. ఎంబీఏ (రెండేళ్లు)కు రూ.70 వేలు, బీఏ, బీకాం, బీఎస్సీ (మూడేళ్లు)లకు కనిష్ఠంగా రూ.30 వేలు, గరిష్ఠంగా రూ.70 వేలుతో పాటు బీబీఏ ఫీజును రూ.25 వేలుగా పేర్కొంది.
ALSO READ:
తిరుపతి స్విమ్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు, వివరాలు ఇలా!
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(స్విమ్స్ యూనివర్సిటీ) 2022-23 విద్యా సంవత్సరానికి గాను పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్/ తెలంగాణకు చెందిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సంబంధిత విభాగంలో బీఎస్సీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
కాళోజీ హెల్త్ వర్సిటీలో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కోర్సు, డిగ్రీ అర్హత చాలు
తెలంగాణలో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఎంపీహెచ్) కోర్సులో ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లను భర్తీ చేస్తారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 1 నుంచి 13 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. కంప్యూటర్ ఆధారిత ప్రవేశపరీక్షను ఆగస్టు 27న నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 2న ఫలితాలు వెల్లడించనున్నారు.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..