By: ABP Desam | Updated at : 09 May 2023 02:35 PM (IST)
Edited By: omeprakash
ఏపీఈఏపీసెట్ 2023 హాల్‌టికెట్లు
ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న 'ఏపీ ఈఏపీసెట్' 2023 పరీక్ష హాల్‌టికెట్లను మే 9న అధికారులు విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబరు, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేది వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్‌తోపాటు ఏదైనా ఒరిజినల్ గుర్తింపుకార్డును వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. విద్యార్థులు కాలేజీ ఐడీ కార్డు, ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఓటర్ ఐడీలలో ఏదో ఒక ఒరిజినల్ కార్డును వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. జిరాక్స్, స్కాన్డ్ కాపీలను అనుమతించరు.
ఈఏపీసెట్‌కు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,37,422 దరఖాస్తులు రాగా.. వీటిలో ఇంజినీరింగ్ విభాగానికి 2,37,055; అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు 99,388, రెండు విభాగాలకు 979 దరఖాస్తులు వచ్చాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 15 నుంచి 19 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. అదేవిధంగా మే 22, 23 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లో విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే 08554-23411, 232248 ఫోను నంబర్ల ద్వారా హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు.
హాల్‌టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
➥ ఏపీఈఏపీసెట్-2023 హాల్‌టికెట్ల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి- https://eamcet.tsche.ac.in/
➥ అక్కడ హోంపేజీలో కనిపించే 'Download Hall Ticket (E & AM)' లింక్ మీద క్లిక్ చేయాలి.
➥ క్లిక్ చేయగానే వచ్చే పేజీలో విద్యార్థులు తమ ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబరు, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేది వివరాలు నమోదుచేయాలి.
➥ అవసరమైన అన్ని వివరాలు నమోదుచేశాకా 'Get Hallticket' బటన్ మీద క్లిక్ చేయాలి.
➥ విద్యార్థి పరీక్ష తేదీ, కేంద్రం వివరాలతో కూడిన హాల్‌టికెట్ కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.
➥ హాల్‌టికెట్‌ను ఏ4 సైజు పేజీలో మాత్రమే ప్రింట్ తీసుకోవాలి, కలర్ ప్రింట్ తీసుకోవడం ఉత్తమం.
➥ ప్రింట్ తీసుకొని పరీక్ష అవసరాలతోపాటు, ఇతర సందర్భాల్లో అవసరానికి భద్రపరచుకోవాలి.
ఏపీఈఏపీసెట్ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
AP PG CET: ఏపీ పీజీ సెట్-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!
NEET UG 2023: వెబ్‌సైట్‌లో నీట్ యూజీ రెస్పాన్స్ షీట్లు, త్వరలోనే ఆన్సర్ కీ!
JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ప్రారంభం, తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది రాస్తున్నారంటే?
NMMS RESULTS: ఏపీ ఎన్ఎంఎంఎస్-2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
ఎన్టీఆర్ హైస్కూల్లో ఉచిత విద్యకు దరఖాస్తుల ఆహ్వానం, ఎంపిక ఇలా!
Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్
Telangana As Number 1: జయహో తెలంగాణ, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హర్షం
Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ
Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?