APEAPCET 2022 Counselling: నేటి నుంచి 'ఫార్మసీ' కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?
ఏపీఈఏపీసెట్-2022 పరీక్షలో అర్హత సాధించిన ఎంపీసీ విభాగం విద్యార్థులు డిసెంబరు 2, 3 తేదీల్లో ప్రాసెసింగ్ ఫీజ చెల్లించి, ఆన్‌లైన్‌లో సర్టిఫికేట్ల పరిశీలన చేయించుకోవాల్సి ఉంటుంది.
ఏపీఈఏపీ సెట్-2022 ఎంపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు బీఫార్మసీ/ఫార్మా-డి కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ డిసెంబరు 2 నుంచి ప్రారంభంకానుంది. ఈ మేరకు కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను అధికారులు విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో కౌన్సెలింగ్ షెడ్యూలును అందుబాటులో ఉంచారు.
ఏపీఈఏపీసెట్-2022 పరీక్షలో అర్హత సాధించిన ఎంపీసీ విభాగం విద్యార్థులు డిసెంబరు 2, 3 తేదీల్లో ప్రాసెసింగ్ ఫీజ చెల్లించి, ఆన్‌లైన్‌లో సర్టిఫికేట్ల పరిశీలన చేయించుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన విద్యార్థులు డిసెంబరు 3, 4 తేదీల్లో వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. వీరికి డిసెంబరు 4న వెబ్‌ఆప్షన్లు మార్చుకోవడానికి అవకాశం కల్పిస్తారు. వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకున్న వారికి డిసెంబరు 6న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందినవారు డిసెంబరు 7-9 మధ్య సంబంధిత కళాశాల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. కళాశాలల్లో ఒరిజినల్ ధ్రవపత్రాల పరిశీలన అనంతరం సీట్ల కేటాయింపును ధ్రువీకరిస్తారు. ట్యూషన్ ఫీజు చెల్లించి సీటు అలాట్‌మెంట్ లెటర్‌ను తీసుకోవాలి.
ఈ సర్టిపికేట్లు అవసరం..
➥ ఏపీఈఏపీసెట్-2022 ర్యాంక్ కార్డ్
➥ ఏపీఈఏపీసెట్-2022 హాల్ టికెట్
➥ ఆధార్ కార్డ్
➥S.S.C లేదా అందుకు సమానమైన మార్కుల మెమో
➥ ఇంటర్మీడియట్ లేదా అందుకు సమానమైన మెమో-కమ్-పాస్ సర్టిఫికేట్
➥ ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (T.C)
➥ 01-01-2022న లేదా ఆ తర్వాత జారీ చేసిన ఇన్ కమ్ సర్టిఫికేట్ (వర్తిస్తే)
➥ తహసీల్దార్ జారీ చేసిన EWS ఇన్‌కమ్ సర్టిఫికేట్, 2022-23 సంవత్సరానికి చెల్లుబాటు అయ్యేది. (వర్తిస్తే)
➥ అధికారులు జారీ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్
➥ అభ్యర్థికి ఇన్‌స్టిట్యూషల్ ఎడ్యుకేషన్ లేనిపక్షంలో అర్హత పరీక్షకు ముందు 7 సంవత్సరాల కాలానికి సంబంధించిన రెసిడెన్స్ సర్టిఫికేట్
➥ స్థానికేతర అభ్యర్థులకు సంబంధించి, అన్‌రిజర్వ్‌డ్ సీట్ల కింద కేటాయింపు కోసం వారిని పరిగణనలోకి తీసుకోవాలంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ లేదా ఎంప్లాయర్ సర్టిఫికేట్, మైనారిటీ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది.
ఈ ఏడాది జులై 4 నుంచి 12 వరకు ఏపీఈఏపీసెట్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ ఈఏపీసెట్-2022 సెట్ నిర్వహించారు. పరీక్ష కోసం మొత్తం 3,01,172 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా 2,82,496 మంది పరీక్ష రాశారు. పరీక్ష రాసినవారిలో ఇంజినీరింగ్‌లో 89.12 శాతం, అగ్రికల్చర్‌లో 95.06 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
Also Read:
డిసెంబరు 3 నుంచి 'ఏపీ లాసెట్-2022' కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?
ఏపీలోని న్యాయకళాశాలల్లో లాసెట్ ద్వారా మూడేళ్ల, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం డిసెంబరు 3 నుంచి 10 వరకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబరు 4 నుండి 12 వరకు ఆన్‌లైన్‌లో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. డిసెంబరు 12న స్పెషల్ కేటగిరి అభ్యర్ధుల సరిఫికెట్లను ఫిజికల్‌గా నాగార్జున యూనివర్శిటీ క్యాంపస్‌లో నిర్వహిస్తారు. సర్టిఫికేటల్ల పరిశీలన పూర్తయిన అభ్యర్థులు డిసెంబరు 13 నుండి 15 వరకు వెబ్ ఆప్షన్లను నమోదుచేసుకోవాల్సి ఉంటుంది.
కౌన్సెలింగ్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మహిళా గురుకులాల్లో వ్యవసాయ డిగ్రీ కోర్సు, వివరాలివే!
మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని గురుకుల వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు ఉంటాయి. నవంబరు 25న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా, డిసెంబరు 5 దరఖాస్తుకు చివరితేదిగా నిర్ణయించారు.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..