అన్వేషించండి

MJPTBCWREIS: మహిళా గురుకులాల్లో వ్యవసాయ డిగ్రీ కోర్సు, వివరాలివే!

గురుకుల వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని గురుకుల వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు ఉంటాయి. నవంబరు 25న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా, డిసెంబరు 5 దరఖాస్తుకు చివరితేదిగా నిర్ణయించారు.

కోర్సు వివరాలు:

* బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సు

కోర్సు వ్యవధి: 4 సంవత్సరాలు.

సీట్ల సంఖ్య: 240

సీట్ల కేటాయింపు: బీసీ అభ్యర్థులకు 75%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 5%, జనరల్/ఈబీసీలకు 2%, అనాథలకు 3% సీట్లు కేటాయించారు. టీఎస్ ఎంసెట్-2022 ర్యాంకు ద్వారా 85%, పీజేటీఎస్ ఏయూ అగ్రిసెట్-2022 ర్యాంకు ద్వారా 15% సీట్లు భర్తీ కానున్నాయి.

1) బీసీ గురుకుల మహిళా వ్యవసాయ కళాశాల - వనపర్తి: 120 సీట్లు

2) బీసీ గురుకుల మహిళా వ్యవసాయ కళాశాల - కరీంనగర్: 120 సీట్లు

అర్హత: తెలంగాణ రాష్ట్ర మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థి తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000, పట్టణ ప్రాంతాల్లో రూ.2,00,000 మించకూడదు. ఫిజికల్ సైన్సెస్, బయలాజికల్ సైన్సెస్ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా (అగ్రికల్చర్/ సీడ్ టెక్నాలజీ/ ఆర్గానిక్ అగ్రికల్చర్) ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు తెలంగాణ ఎంసెట్-2022 లేదా పీజేటీఎస్ఏయూ అగ్రిసెట్-2022లో అర్హత సాధించాలి.

వయోపరిమితి: 31.12.2022 నాటికి 17 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ ఈఐఎస్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఎంపిక విధానం: మెరిట్, అర్హతల ఆధారంగా. 

దరఖాస్తు రుసుము: రూ.900.

ముఖ్యమైన తేదీలు..

🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:  05.12.2022.

🔰 దరఖాస్తుల సవరణ తేదీలు: 06 - 07.12.2022.

🔰 మెరిట్ జాబితా వెల్లడి: 10.12.2022.

Notification

Online Application 

Also Read:

దేశంలో 66 శాతం పాఠశాలల్లో 'నో' ఇంటర్నెట్, అధ్వాన్న స్థితిలో బీహార్, మిజోరం రాష్ట్రాలు - తెలంగాణలో పరిస్థితి ఇలా!
భారతదేశంలో దాదాపు 66% పాఠశాలలకు ఇంటర్నెట్ సదుపాయం లేదు. బీహార్, మిజోరాం రాష్ట్రాలు ఈ కోవలో మొదటి రెండు స్థానాల్లో నిలుస్తున్నాయి. బీహార్‌లో 92%, మిజోరంలో 90% పాఠశాలల్లోని విద్యార్థులు ఇంటర్నెట్ మాటే ఎరుగరు. ఇక ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ మరియు కాశ్మీర్, మధ్యప్రదేశ్, మణిపూర్, పశ్చిమ బెంగాల్, మేఘాలయ, ఒడిశా, తెలంగాణ, త్రిపుర రాష్ట్రాల్లో 80-85% పాఠశాలలకు ఇంటర్నెట్ సదుపాయం లేదు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

'గేట్' అభ్యర్థులకు 'గ్రేట్' న్యూస్, పెరిగిన పరీక్ష కేంద్రాలు - ఆ జిల్లాల్లోనూ సెంటర్లు!
తెలంగాణలో  'గేట్-2023' పరీక్ష కేంద్రాల సంఖ్య పెరిగింది. కొత్తగా 4 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో గేట్ పరీక్ష కేంద్రాల సంఖ్య 7 నుంచి 11కు పెరిగిందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఈ మేరకు నవంబరు 26న ట్విట్టర్ ద్వారా ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా మెదక్, నల్గొండ, అదిలాబాద్, కొత్తగూడెంలలోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Jhansi Hospital Fire: ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Jhansi Hospital Fire: ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
Minister Atchennaidu: జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Most Ordered Item On Swiggy: కండోమ్ కాదు బిర్యానీ కూడా కాదు - స్విగ్గీలో ఎక్కువ ఆర్డర్ చేసే వస్తువు ఏదో తెలుసా ?
కండోమ్ కాదు బిర్యానీ కూడా కాదు - స్విగ్గీలో ఎక్కువ ఆర్డర్ చేసే వస్తువు ఏదో తెలుసా ?
Nayanthara Dhanush Issue:ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
Embed widget