AP LAWCET: డిసెంబరు 3 నుంచి 'ఏపీ లాసెట్-2022' కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?
ఏపీలోని న్యాయకళాశాలల్లో లాసెట్ ద్వారా మూడేళ్ల, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం డిసెంబరు 3 నుంచి 10 వరకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
ఏపీలోని న్యాయకళాశాలల్లో లాసెట్ ద్వారా మూడేళ్ల, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం డిసెంబరు 3 నుంచి 10 వరకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబరు 4 నుండి 12 వరకు ఆన్‌లైన్‌లో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. డిసెంబరు 12న స్పెషల్ కేటగిరి అభ్యర్ధుల సరిఫికెట్లను ఫిజికల్‌గా నాగార్జున యూనివర్శిటీ క్యాంపస్‌లో నిర్వహిస్తారు. సర్టిఫికేటల్ల పరిశీలన పూర్తయిన అభ్యర్థులు డిసెంబరు 13 నుండి 15 వరకు వెబ్ ఆప్షన్లను నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకున్నవారికి డిసెంబరు 16న వెబ్ అప్షన్స్ మార్చుకునే అవకాశం ఇస్తారు. డిసెంబరు 19న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందినవారు డిసెంబరు 19 నుండి 23 వరకు సంబంధిత కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. డిసెంబరు 21 నుంచే తరగతులు ప్రారంభంకానున్నాయి.
లాసెట్ 3 ఏళ్ల కోర్సుకు 90.81శాతం, లాసెట్ 5 ఏళ్ల కోర్సుకు 79.51శాతం ఉత్తీర్ణత సాధించగా.. రెండేళ్ల పీజీ ఎల్ సెట్లో 97.24 శాతం ఉత్తీర్ణత సాధించారు. లాసెట్‌లో మహిళలకే అత్యధిక ర్యాంకులు రావడం విశేషం. మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఐదేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం జులై 13న ప్రవేశపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏపీ లాసెట్, పీజీఎల్‌సెట్- 2022 ఉమ్మడి ప్రవేశ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 15 వేల 709 మంది రిజిస్టర్ చేసుకోగా.. 13 వేల 180 మంది హాజరై పరీక్ష రాశారు. 2 వేల 529 మంది గైర్హాజరు కాగా.. హాజరు శాతం 83.9 శాతం నమోదైంది.
ఆంధ్రప్రదేశ్ లాసెట్, పీజీఎల్‌సెట్ 2022 పరీక్ష కోసం అభ్యర్థుల నుంచి మే 13 నుంచి దరఖాస్తులు స్వీకరించారు. శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ పరీక్షల నిర్వహణ బాధ్యతను చేపట్టింది. ఎల్‌ఎల్‌బీ (LLB) 3, 5 సంవత్సరాలు, ఎల్‌ఎల్‌ఎం (LLM) రెండు సంవత్సరాల కోర్సుల్లో ప్రవేశాల కోసం లాసెట్, పీజీఎల్‌సెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలను జులై 13న మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.30 వరకు నిర్వహించారు. పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా, కౌన్సెలింగ్‌కు హాజరైన అభ్యర్థుల ఆప్షన్ల మేరకు సంబంధిత కళాశాలల్లో సీట్లు కేటాయిస్తారు.
Also Read:
'గేట్' అభ్యర్థులకు 'గ్రేట్' న్యూస్, పెరిగిన పరీక్ష కేంద్రాలు - ఆ జిల్లాల్లోనూ సెంటర్లు!
తెలంగాణలో 'గేట్-2023' పరీక్ష కేంద్రాల సంఖ్య పెరిగింది. కొత్తగా 4 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో గేట్ పరీక్ష కేంద్రాల సంఖ్య 7 నుంచి 11కు పెరిగిందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఈ మేరకు నవంబరు 26న ట్విట్టర్ ద్వారా ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా మెదక్, నల్గొండ, అదిలాబాద్, కొత్తగూడెంలలోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మహిళా గురుకులాల్లో వ్యవసాయ డిగ్రీ కోర్సు, వివరాలివే!
మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని గురుకుల వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు ఉంటాయి. నవంబరు 25న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా, డిసెంబరు 5 దరఖాస్తుకు చివరితేదిగా నిర్ణయించారు.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..