AP EAMCET 2022: ఏపీఈఏపీ సెట్ స్పెషల్ రౌండ్ సీట్ల కేటాయింపు ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే!
స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్‌లో పాల్గొన్న అభ్యర్థులు ఏపీ ఈఏపీసెట్ హాల్‌టికెట్ నెంబర్, పుట్టినతేది వివరాలు నమోదుచేసి సీట్ల కేటాయింపు పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఏపీ ఈఏపీసెట్ స్పెషల్ రౌండ్ సీట్ అలాట్ మెంట్ ఫలితాలను ఏపీ ఉన్నత విద్యామండలి నవంబరు 11న విడుదల చేసింది. సీట్ల కేటాయింపు వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్‌లో పాల్గొన్న అభ్యర్థులు ఏపీ ఈఏపీసెట్ హాల్‌టికెట్ నెంబర్, పుట్టినతేది వివరాలు నమోదుచేసి సీట్ల కేటాయింపు పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కళాశాలలవారీగా కూడా సీట్ల కేటాయింపు వివరాలను అధికారులు విడుదల చేశారు. కళాశాలపేరు, కోర్సు వివరాలు నమోదుచేసి సీట్ల వివరాలు ధ్రువీకరించుకోవచ్చు.
సీట్ల కేటాయింపు ఫలితాలు ఇలా చూసుకోండి..
Step 1: అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. - eapcetsche.aptonline.in.
Step 2: అక్కడ హోంపేజీలో కనిపించే 'AP EAMCET 2022 seat allotment' లింక్ మీద క్లిక్ చేయాలి.
Step 3: అభ్యర్థులు ఏపీ ఈఏపీసెట్ హాల్‌టికెట్ నెంబర్, పుట్టినతేది వివరాలు నమోదు చేసి 'Submit' బటన్‌పై క్లిక్ చేయాలి.
Step 4: సీటు కేటాయింపు వివరాలు కంప్యూటర్ తెరపై కనిపిస్తాయి.
Step 5: అలాట్ మెంట్ ఫలితాలు చెక్ చేసుకోవాలి.
Step 6: అలాట్ మెంట్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకొని, భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.
సీట్ల కేటాయింపు వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏపీఈఏపీసెట్ స్పెషల్ రౌండ్ ప్రవేశాల కోసం నవంబరు 5న నోటిఫికేషన్ విడుదల చేశారు. నవంబరు 7, 8 తేదీల్లో ఫీజు చెల్లించడానికి అవకాశం కల్పించారు. ఫీజు చెల్లించిన అభ్యర్థులకు నవంబరు 8, 9 తేదీల్లో ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించారు. అదే సమయంలో అభ్యర్థులు నవంబరు 7 నుంచి 9 వరకు ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. వీరికి నవంబరు 9న ఆప్షన్లలో మార్పునకు అవకాశం ఇచ్చారు. తదనంతరం నవంబరు 11న సీట్లను కేటాయించారు. సీట్లు పొందిన అభ్యర్థులు నవంబరు 14లోగా సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
:: Also Read ::
GEST-2023: ఎన్టీఆర్ ట్రస్ట్ స్కాలర్‌షిప్ టెస్ట్, దరఖాస్తు ఇలా!
ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థినులకు ఉపకారవేతనం అందించనున్నట్లు ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వరి తెలిపారు. దీనికి ఈ ఏడాది డిసెంబరు 4న 'గర్ల్స్ ఎడ్యుకేషన్ స్కాలర్‌షిప్ టెస్ట్ (జీఈఎస్‌టీ -2023)' పేరుతో పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పదోతరగతి చదివే బాలికలు ఈ పరీక్ష రాయడానికి అర్హులని.. మొదటి పది ర్యాంకులు సాధించిన వారికి నెలకు రూ.5 వేలు, తర్వాతి 15 ర్యాంకులు సాధించినవారికి నెలకు రూ.3 వేల చొప్పున ఇంటర్ పూర్తయ్యేవరకూ ఉపకారవేతనం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థినులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా నవంబరు 11 నుంచి 30 వరకు దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 76600 02627/28 నంబర్లను సంప్రదించాలని ఆమె సూచించారు.
స్కాలర్‌షిప్ నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
స్వదేశం నుంచే 'విదేశీ విద్య'- కార్యాచరణ సిద్ధం చేసిన యూజీసీ!
విదేశాల్లో విద్యాభ్యాసం కోరుకునే విద్యార్థులకు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గుడ్ న్యూస్ తెలిపింది. భారతీయ విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదవడం ఆనవాయితీ.. అయితే ఇప్పుడు విదేశీ విద్యనే భారతీయ విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది యూజీసీ. ఈ మేరకు భారత్‌కు చెందిన విద్యా సంస్థలతో కలిసి పనిచేసేందుకు 49 విదేశీ విశ్వవిద్యాలయాలు ముందుకొచ్చాయి. త్వరలో ఆయా యూనివర్సిటీలు టై-అప్ కానున్నాయని యూజీసీ హెచ్ ఎం జగదీశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..