AP CETS 2025: ఏపీలో ప్రవేశ పరీక్షల తేదీలు వెల్లడి, ఎప్‌సెట్ సహా ఇతర పరీక్షల తేదీలు ఇలా
AP CETS: ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఇంజనీరింగ్, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే EAPCET - 2025 పరీక్ష షెడ్యూల్‌ను ఏపీ ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది.

AP CETS 2025 Schedule: ఆంధ్రప్రదేశ్‌లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ఫిబ్రవరి 12న ప్రకటించింది. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్‌లో పరీక్షల షెడ్యూలును విడుదల చేశారు. రాష్ట్రంలో మే 2 నుంచి జూన్ 25 మధ్య పలు ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 2 నుంచి 5 మధ్య ఏపీఆర్‌సెట్ (APRCET) పరీక్షలు; మే 6న ఏపీఈసెట్ (AP ECET); మే 7న ఏపీ ఐసెట్ (APICET); మే 19 నుంచి 27 మధ్య ఏపీఈఏపీసెట్ (AP EAPCET) పరీక్షలు నిర్వహించనున్నారు. వీటిలో అగ్రికల్చర్, ఫార్మా విభాగాలకు మే 19, 20 తేదీల్లో, ఇంజినీరింగ్ విభాగానికి మే 21 నుంచి 27 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. మే 25న లాసెట్/పీజీఎల్‌సెట్ (AP LAWCET/PGLCET), పీజీఈసెట్ (PGECET) పరీక్షలను జూన్ 5 నుంచి 7 వరకు, ఎడ్‌సెట్ (AP EDCET) పరీక్షలను జూన్ 8న, పీజీసెట్ (AP PGCET) పరీక్షలు జూన్ 9 నుంచి 13 వరకు జరుగనున్నాయి.
మంత్రి లోకేశ్ దిశానిర్దేశం..
ఈ సందర్భంగా విద్యార్థులకు మంత్రి లోకేశ్ ఎక్స్ వేదికగా దిశానిర్దేశంచేశారు. 'విద్యార్థులంతా దృఢ సంకల్పతో ముందుకు సాగాల్సిన సమయమిది. కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ల షెడ్యూలును ఉన్నత విద్యామండలి ప్రకటించింది. అందువల్ల ఈ పరీక్షలపై దృష్టి కేంద్రీకరించి.. బాగా ప్రిపేర్ అవ్వండి. పరీక్షల్లో రాణించేందుకు మీ వంతు కృషిచేయండి. ఈ ప్రయాణంలో మీరంతా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నా అని లోకేశ్ ట్వీట్ చేశారు.
ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూలు..
క్ర.సం. | పరీక్ష పేరు | పరీక్ష తేదీ |
1. | ఏపీఈఏపీసెట్ (అగ్రికల్చర్, ఫార్మా) | 19.05.2025, 20.05.2025 తేదీల్లో |
2. | ఏపీఈఏపీసెట్ (ఇంజినీరింగ్) | 21.05.2025 నుంచి 27.05.2025 వరకు. |
3. | ఏపీ ఐసెట్ | 07.05.2025. |
4. | ఏపీ ఆర్‌సెట్ | 02.05.2025 నుంచి 05.05.2025 వరకు. |
5. | ఏపీ ఈసెట్ | 06.05.2025. |
6. | ఏపీ లాసెట్ | 25.05.2025. |
7. | ఏపీ పీజీఈసెట్ | 05.06.2025 నుంచి 07.06.2025 వరకు. |
8. | ఏపీ ఎడ్‌సెట్ | 08.06.2025. |
9. | ఏపీపీజీసెట్ | 09.06.2025 నుంచి 13.06.2025 వరకు. |
10 | ఏపీపీఈసెట్ | 25.06.2025. |
ALSO READ:
తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు, ఏ ఎగ్జామ్ ఎప్పుడంటే?
తెలంగాణలో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల (కామన్ ఎంట్రెన్స్ టెస్టులు) షెడ్యూలును ఉన్నత విద్యామండలి జనవరి 15న ప్రకటించింది. అయితే ఆయా పరీక్షల నిర్వహణకు సంబంధించి.. దరఖాస్తు చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఫీజు ఇతర వివరాలతో కూడిన వివరణాత్మక నోటిఫికేషన్లను సంబంధిత సెట్ కన్వీనర్లు ప్రకటిస్తారు. వేర్వేరుగా నోటిఫికేషన్లు వెలువడతాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఏప్రిల్ 29 నుంచి జూన్ 19 మధ్య ఎంట్రెన్స్ టెస్టులు నిర్వహించనున్నారు. ఈ షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు టీజీఈఏపీసెట్ (TG EAPCET 2025) పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు; మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం పరీక్షలు నిర్వహించనున్నారు. జేఎన్‌టీయూ హైదరాబాద్ పరీక్షల నిర్వహణ బాధ్యతను చేపట్టంది. ఈఏపీసెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ బి. డీన్ కుమార్ వ్యవహిరించనున్నారు.
తెలంగాణ ప్రవేశ పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

