News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

ఇంటర్‌ సప్లిమెంటరీ విద్యార్థులకు మరో అవకాశం, సీఎస్‌ఏబీ కీలక నిర్ణయం!

జేఈఈ మెయిన్స్‌, అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించినా.. ఇంటర్‌లో 75 శాతం మార్కులు రానివారికి ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశం లభించదు. ఇలాంటివారి కోసం జోసా కౌన్సెలింగ్‌ నిర్వహణకు అధికారులు ఓ అవకాశం కల్పించారు

FOLLOW US: 
Share:

జేఈఈ మెయిన్స్‌, అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించినా.. ఇంటర్మీడియట్‌లో 75 శాతం మార్కులు రానివారికి ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశం లభించదు. ఇలాంటివారి కోసం జోసా కౌన్సెలింగ్‌ నిర్వహణకు అధికారులు ఓ అవకాశం కల్పించారు. దేశవ్యాప్తంగా ఇంటర్మీడియట్‌, ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణులై, 75 శాతంలోపు మార్కులు వచ్చినవారు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రాసి మార్కులు పెంచుకుంటే ఐఐటీ, ఎన్‌ఐటీల్లో సీటు లభిస్తుంది.

జోసా కౌన్సెలింగ్‌కు హాజరైనప్పుడుగానీ, ప్రవేశాల సందర్భంలో గానీ  మార్కుల జాబితా సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్‌ పరీక్షల సమయంలో అనారోగ్యం, ఇతర కారణాలతో సరిగా పరీక్ష రాయలేక తక్కువ మార్కులు పొందిన ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం ఈ అవకాశం కల్పించామని సెంట్రల్‌ సీట్‌ అలొకేషన్‌ బోర్డు(సీఎస్‌ఏబీ)-2023 ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.ఉమామహేశ్వర్‌రావు తెలిపారు. ఇలాంటి వారి కోసం ప్రత్యేకంగా స్పెషల్‌ రౌండ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నామని, ఈ విషయమై వివిధ రాష్ట్రాల ఇంటర్‌ బోర్డు అధికారులతోనూ చర్చిస్తున్నామని వివరించారు.

దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో బీటెక్, బ్యాచ్‌లర్ ఆఫ్ సైన్స్(బీఎస్సీ), అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ తొలి విడత సీట్ల కేటాయింపు మొదలైంది. తొలి రౌండ్ కేటాయింపు ప్రక్రియ జులై 4 సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ రౌండ్‌లో సీట్లు పొందిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ఐఐటీ గువాహటి పేర్కొంది.

ఇక రెండో విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ జులై 6 నుంచి ప్రారంభం కానుంది. మొత్తం ఆరు రౌండ్లలో సీట్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఈ సీట్ల కేటాయింపునకు సంబంధించిన వివరాలను వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ జేఈఈ మెయిన్ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్‌ను ఎంటర్ చేయడం ద్వారా సీట్ల కేటాయింపు వివరాలు తెలుసుకోవచ్చు.

సీట్ల కేటాయింపు వివరాల కోసం క్లిక్ చేయండి..

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం 6 రౌండ్ల కౌన్సెలింగ్ తర్వాత ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర సంస్థల్లో సీట్లు ఖాళీగా ఉంటే జులై 26 నుంచి 31 వరకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. సీట్లు పొందిన జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు రూ.40,000; ఇతరులు రూ.20,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈసారి మొత్తం 114 విద్యాసంస్థలు కౌన్సెలింగ్‌లో పాల్గొననున్నాయి. అందులో 23 ఐఐటీలు, 32 ఎన్‌ఐటీలు, 26 ట్రిపుల్‌ఐటీలు, మరో 38 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి.

JoSAA Counselling ఇలా..

♦ 1వ రౌండ్‌ : జూన్ 30 నుంచి జులై 5 వరకు

♦ 2వ రౌండ్‌: జులై 6 నుంచి జులై 11 వరకు

♦ 3వ రౌండ్‌: జులై 12 నుంచి జులై 15 వరకు

♦ 4వ రౌండ్‌: జులై 16 నుంచి జులై 20 వరకు

♦ 5వ రౌండ్‌: జులై 21 నుంచి జులై 25 వరకు

♦ 6వ రౌండ్‌ (చివరి): జులై 26 నుంచి  జులై 28 వరకు నిర్వహిస్తారు. 
 
6 రౌండ్ల సీట్ల కేటాయింపు తేదీలు ఇవే:

♦ 1వ రౌండ్‌ సీట్ల కేటాయింపు: జూన్ 30న

♦ 2వ రౌండ్‌: జులై 6న

♦ 3వ రౌండ్‌: జులై 12న

♦ 4వ రౌండ్‌: జులై 16న

♦ 5వ రౌండ్‌: జులై 21న

♦ 6వ రౌండ్‌ (చివరి): జులై 26న

జోసా 2023-కౌన్సెలింగ్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ALSO READ:

ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయంలో బీఎస్సీ ప్రోగ్రామ్‌‌లో ప్రవేశాలు
గుంటూరు లాంలోని ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 2023-24 విద్యా సంవత్సరానికి బీఎస్సీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్మీడియట్(బైపీసీ/ ఎంపీసీ/ ఎంబైపీసీ) లేదా మూడేళ్ల డిప్లొమా(హోమ్ సైన్స్‌) కోర్సు ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల విద్యార్థులు తమ దరఖాస్తులను జులై 17 వరకు సంబంధిత చిరునామాకు పంపించాలి. ఇంటర్‌ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ సీట్ల భర్తీకి ఎన్‌సెట్‌ నోటిఫికేషన్ వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!
ఇంటర్‌ విద్యార్హతతో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సులో ప్రవేశాలకు 2023-24 విద్యా సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(NCET) పేరిట జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆసక్తి ఉన్నవారు జూన్ 27 నుంచి జులై 19 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పరీక్షల తేదీలను ఎన్టీఏ తర్వాత ప్రకటించనుంది.
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 07 Jul 2023 02:17 PM (IST) Tags: JEE Advanced Education News in Telugu Inter supplementary Students JOSSA Counselling

ఇవి కూడా చూడండి

TS SET: టీఎస్‌ సెట్‌ - 2023 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డుల డౌన్‌లోడ్ లింక్ ఇదే

TS SET: టీఎస్‌ సెట్‌ - 2023 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డుల డౌన్‌లోడ్ లింక్ ఇదే

GATE Schedule: గేట్ - 2024 పరీక్షల షెడ్యూల్ విడుదల, పేపర్లవారీగా తేదీలివే

GATE Schedule: గేట్ - 2024 పరీక్షల షెడ్యూల్ విడుదల, పేపర్లవారీగా తేదీలివే

CPGET: పీజీ సీట్లు సగానికి పైగా ఖాళీ, అయినా ప్రవేశాలు గతేడాది కంటే ఎక్కువే!

CPGET: పీజీ సీట్లు సగానికి పైగా ఖాళీ, అయినా ప్రవేశాలు గతేడాది కంటే ఎక్కువే!

AP Inter Fees: ‘ఇంటర్‌’ పరీక్ష ఫీజు చెల్లించడానికి నేడే ఆఖరు, ఆలస్య రుసుముతో ఎప్పటివరకు అవకాశమంటే?

AP Inter Fees: ‘ఇంటర్‌’ పరీక్ష ఫీజు చెల్లించడానికి నేడే ఆఖరు, ఆలస్య రుసుముతో ఎప్పటివరకు అవకాశమంటే?

TOSS Results: ఓపెన్ టెన్త్, ఇంటర్ ఫలితాలు వెల్లడి, ప్రత్యేక ప్రవేశాల గడువు పొడిగింపు

TOSS Results: ఓపెన్ టెన్త్, ఇంటర్ ఫలితాలు వెల్లడి, ప్రత్యేక ప్రవేశాల గడువు పొడిగింపు

టాప్ స్టోరీస్

Traffic Restrictions in Hyderabad: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

Traffic Restrictions in Hyderabad: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

Hi Nanna Movie Review - హాయ్ నాన్న రివ్యూ: నాని, మృణాల్ సినిమా హిట్టా? ఫట్టా?

Hi Nanna Movie Review - హాయ్ నాన్న రివ్యూ: నాని, మృణాల్ సినిమా హిట్టా? ఫట్టా?

SI Exam Results: ఎస్‌ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల, ఫైనల్ ఆన్సర్ 'కీ' అందుబాటులో

SI Exam Results: ఎస్‌ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల, ఫైనల్ ఆన్సర్ 'కీ' అందుబాటులో

Pushpa Actor Arrest: ‘పుష్ప’ నటుడు కేశవ అరెస్టు, యువతి సూసైడ్‌తో కేసు నమోదు

Pushpa Actor Arrest: ‘పుష్ప’ నటుడు కేశవ అరెస్టు, యువతి సూసైడ్‌తో కేసు నమోదు