అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

AP CETs: ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల - ఏ పరీక్ష ఎప్పుడంటే?

AP CETS: ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఇంజనీరింగ్, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే EAPCET - 2024 పరీక్ష షెడ్యూల్‌ను ఏపీ ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది.

AP SETs Exams Schedule: ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఏడాదికి సంబంధించిన వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షల (కామన్ ఎంట్రెన్స్ టెస్ట్- CET) షెడ్యూలును రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఫిబ్రవరి 14న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి మే 13 నుండి 19 వరకు ఏపీ ఈఏపీసెట్ (EAPCET) పరీక్ష నిర్వహించనున్నారు. ఇక ఇంజినీరింగ్ లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈసెట్ (ECET) పరీక్షను మే 8న నిర్వహించనున్నారు. అదేవిధంగా మే 6న ఐసెట్ (ICET), మే 29 నుండి 31 వరకు పీజీఈసెట్ (PGECET) పరీక్ష నిర్వహిస్తారు. ఇక జూన్ 8న ఎడ్‌సెట్ (EDCET), జూన్ 9న లాసెట్‌(LAWCET), జూన్‌ 3 నుండి 7 మధ్య పీజీసెట్ (PGCET) పరీక్షలు నిర్వహించనున్నారు. అదేవిధంగా జూన్‌ 13న ఏడీసెట్ (ADCET) పరీక్ష నిర్వహించనున్నారు. పీఈసెట్ (PECET ) పరీక్ష తేదీ వెల్లడించాల్సి ఉంది. అయితే ఏదైనా కారణాల రీత్యా ఈ తేదీల్లో కొంత మార్పులు ఉండే అవకాశం కూడా ఉందని ఉన్నత విద్యా మండలి తెలిపింది. 

ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూలు..

➥ ఏపీఈఏపీసెట్ (AP EAPCET)-2024 పరీక్ష: 13.05.2024 - 19.05.2024.

➥ ఏపీ ఈసెట్ (AP ECET)-2024: 08.05.2024. 

➥ ఏపీ ఐసెట్ (AP ICET)-2024: 06.05.2024.

➥ ఏపీ పీజీఈసెట్ (AP PGCET)-2024: 29.05.2024 - 31.05.2024.

➥ ఏపీఎడ్‌సెట్ (AP EDCET)-2024: 08.06.2024.

➥ ఏపీ లాసెట్‌ (AP LAWCET)-2024: 09.06.2024.

➥ ఏపీ పీజీసెట్‌ (AP PGCET)-2024: 03.06.2024 - 07.06.2024.

➥ ఏడీసెట్ (ADCET)-2024: 13.06.2024. 

➥ ఏపీపీఈసెట్ (AP PECET)-2024 పరీక్ష తేదీ ప్రకటించాల్సి ఉంది.

AP CETs: ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల - ఏ పరీక్ష ఎప్పుడంటే?

ALSO READ:

తెలంగాణ ఉమ్మడి పరీక్షల షెడ్యూలు ఇలా..

తెలంగాణలో వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షల షెడ్యూలు జనవరి 25న విడుదలైన సంగతి తెలిసిందే. ఎంసెట్‌తోపాటు ఈసెట్‌, లాసెట్‌, పీజీసెట్‌, ఐసెట్‌, ఎడ్‌సెట్‌, పీజీఈ సెట్‌కు సంబంధించిన కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టులకు సంబంధించిన పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. టీఎస్ ఎంసెట్ పేరును 'టీఎస్ ఈఏపీసెట్'గా మారుస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.  ప్రకటించిన షెడ్యూలు ప్రకారం..  మే 6 ఈసెట్, మే 9 నుంచి 13 వరకు ఈఏపీసెట్ (ఎంసెట్) పరీక్ష నిర్వహించనున్నారు. ఇక మే 23న ఎడ్‌సెట్, జూన్ 3న లాసెట్, జూన్ 4,5 తేదీల్లో ఐసెట్, జూన్ 6 నుంచి 8 వరకు పీజీఈసెట్, జూన్ 10 నుంచి 13 వరకు పీఈసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఫీజు ఇతర వివరాలతో కూడిన వివరణాత్మక నోటిఫికేషన్‌ను సంబంధిత సెట్ కన్వీనర్లు ప్రకటిస్తారు. టీఎస్​ఈఏపీసెట్, పీజీఈసెట్‌లను జేఎన్టీయూహెచ్‌కు, ఐసెట్ కాకతీయకు, ఈసెట్, లాసెట్‌లను ఉస్మానియాకు, ఎడ్‌సెట్ మహాత్మాగాంధీ వర్సిటీకి, పీఈసెట్‌ను శాతవాహన వర్సిటీకి కేటాయించింది. ఈఏపీసెట్ కన్వీనర్​గా ప్రొఫెసర్ దీన్ కుమార్​ను, ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీరాం వెంకటేశ్​ను ఈసెట్ కన్వీనర్​గా, ఓయూ లీగల్ సెల్ డైరెక్టర్​ విజయలక్ష్మిని లాసెట్ కన్వీనర్​గా నియమించారు. పీజీఈసెట్ కన్వీనర్ గా అరుణ కుమారి, ఐసెట్ కన్వీనర్‌గా నరసింహాచారి. పీఈసెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ రాజేశ్ కుమార్, టీఎస్ ఎడ్‌సెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ మృణాళిని నియమితులయ్యారు.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Sonia Akula Engagement: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Sonia Akula Engagement: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
AR Rahman Legal Notice: వారికి ఏఆర్ రెహమాన్ లీగల్ నోటీసులు, కంటెంట్ తొలగించాలని 24 గంటలు డెడ్‌లైన్
వారికి ఏఆర్ రెహమాన్ లీగల్ నోటీసులు, కంటెంట్ తొలగించాలని 24 గంటలు డెడ్‌లైన్
Weather Update: బంగాళాఖాతంలో అల్ప పీడనం, ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు - తెలంగాణలో చలికి గజగజ
బంగాళాఖాతంలో అల్ప పీడనం, ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు - తెలంగాణలో చలికి గజగజ
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Embed widget