అన్వేషించండి

AP TET July 2024: ఏపీటెట్‌(జులై)-2024 నోటిఫికేషన్‌ విడుదల, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?

AP TET Notification 2024: ఏపీలో మరోసారి టెట్ నోటిఫికేషన్ వెలువడింది. గత ప్రభుత్వం ఫిబ్రవరిలో టెట్ నిర్వహించగా.. కొత్త ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటన నేపథ్యంలో మరోసారి టెట్ నిర్వహించనుంది.

AP TET (JULY)-2024 Notification: ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ త్వరలోనే వెలువడనుంది.  అయితే డీఎస్సీ‌తోపాటు టెట్ కూడా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు మొదట టెట్ నిర్వహించి, ఆ తర్వాత డీఎస్సీ నిర్వహణకు సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా జులై 1న 'ఏపీటెట్ 2024 జులై సెషన్' నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు జులై 3 నుంచి 16 మధ్య ఫీజు చెల్లించడానికి అవకావం కల్పించారు. అయితే జులై 4 నుంచి 17 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆగస్టులోనే టెట్ పరీక్ష నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఆన్‌లైన్ విధానంలోనే టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. టెట్ పరీక్షకు డీఎస్సీకి మధ్య కనీసం నెలరోజులు వ్యవధి ఉండే విధంగా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఏపీటెట్ నోటిఫికేషన్, ఇన్‌ఫర్మేషన్ బులిటిన్, షెడ్యూలు, సిలబస్‌‌తపాటు పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు, విధివిధానాలు జులై 2 లేదా 3 నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. 

Website 

టెట్ అర్హతలు..

ఏపీటెట్‌కు సంబంధించి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధించాలనుకునేవారు పేపర్-1 (ఎ & బి), 6 నుంచి 8వ తరగతుల వరకు బోధించాలనుకునేవారు పేపర్-2(ఎ & బి) రాయాల్సి ఉంటుంది.

🔰 పేపర్-1 ఎ (1 - 5వ తరగతులకు)

➥ కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్‌తోపాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్‌ఈడీ) అర్హత ఉండాలి. (లేదా)

➥ కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతో ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్‌ఈడీ) అర్హత ఉండాలి. (లేదా)

➥ కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతో నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఎల్‌ఈడీ) అర్హత ఉండాలి. (లేదా)

➥ కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతో రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (స్పెషల్ ఎడ్యుకేషన్) అర్హత ఉండాలి. (లేదా)

➥ ఏదైనా డిగ్రీతోపాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్‌ఈడీ) అర్హత ఉండాలి. (లేదా)

➥ ఏదైనా డిగ్రీతోపాటు 50 శాతం మార్కులతో బ్యాచిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) అర్హత ఉండాలి. (లేదా)

➥ కనీసం 55 శాతం మార్కులతో పీజీ డిగ్రీతోపాటు  బీఈడీ లేదా ఎంఈడీ అర్హత ఉండాలి. 

➥ ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 5 శాతం మార్కులు మినహాయింపు వర్తిస్తుంది.

🔰 పేపర్-1 బి (1 - 5వ తరగతులు) స్పెషల్ స్కూల్స్ 

➥ ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతో రెండేళ్ల డీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్ - ఏదైనా డిజెబిలిటీ) అర్హత ఉండాలి. (లేదా)

➥ ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతో ఏడాది డిప్లొమా(స్పెషల్ ఎడ్యుకేషన్ - ఏదైనా డిజెబిలిటీ) అర్హత ఉండాలి. (లేదా)

➥ డిప్లొమా (కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్)తోపాటు ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ (స్పెషన్ నీడ్స్) అర్హత ఉండాలి. (లేదా)

➥ పీజీ డిప్లొమా (కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్)తోపాటు ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ (స్పెషన్ నీడ్స్) అర్హత ఉండాలి. (లేదా)

➥ డిప్లొమా (మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్)తోపాటు ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ (స్పెషన్ నీడ్స్) అర్హత ఉండాలి. (లేదా)

➥ జూనియర్ డిప్లొమా (టీచింగ్-డెఫ్) అర్హత ఉండాలి. (లేదా)

➥ ప్రైమరీ లెవల్ టీచర్ ట్రైనింగ్ కోర్సు (విజువల్ ఇంపేర్‌మెంట్)

➥ డిప్లొమా (ఒకేషనల్ రిహాబిలిటేషన్-మెంటల్ రిహాబిలిటేషన్)/ డిప్లొమా (ఒకేషనల్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్‌మెంట్-మెంటల్ రిటార్డేషన్)తోపాటు ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ (స్పెషన్ నీడ్స్) అర్హత ఉండాలి. (లేదా)

➥ డిప్లొమా (హియరింగ్ లాంగ్వేజ్ & స్పీచ్‌తోపాటు ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ (స్పెషన్ నీడ్స్) అర్హత ఉండాలి. (లేదా)

➥ ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతో RCI గుర్తింపు పొందిన ఏడాది కోర్సు కలిగి ఉండాలి. దీంతోపాటు ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ (స్పెషన్ నీడ్స్) అర్హత ఉండాలి.

🔰  పేపర్-2 ఎ (6 - 8వ తరగతులు)

మ్యాథమెటిక్స్-ఫిజికల్ సైన్స్/బయోలాజికల్ సైన్స్/ సోషల్ స్టడీస్/ లాంగ్వేజ్ టీచర్లు 

➥ 50 శాతం మార్కులతో డిగ్రీ లేదా పీజీతోపాటు బీఈడీ ఉండాలి. (లేదా)

➥ 45 శాతం మార్కులతో డిగ్రీతోపాటు ఏడాది బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అర్హత కలిగి ఉండాలి.  (లేదా)

➥ 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతోపాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఎల్‌ఈడీ) అర్హత ఉండాలి. (లేదా)

➥ 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతోపాటు నాలుగేళ్ల బీఏ/బీఎస్సీ లేదా బీఏఈడీ/బీఎస్‌ఈఈడీ. (లేదా)

➥ 50 శాతం మార్కులతో డిగ్రీతోపాటు ఏడాది బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) అర్హత కలిగి ఉండాలి. (లేదా)

➥ 55 శాతం మార్కులతో పీజీ డిగ్రీతోపాటు మూడేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ-ఎంఈడీ అర్హత కలిగి ఉండాలి. (లేదా)

➥ ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 40 శాతం మార్కులు మినహాయింపు వర్తిస్తుంది.

🔰  లాంగ్వేజ్ టీచర్స్..
లాంగ్వేజ్ టీచర్స్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టుతో డిగ్రీ ఉండాలి. (లేదా) బ్యాచిలర్ ఆఫ్ ఒరియంటెల్ లాంగ్వేజ్ (లేదా) గ్రాడ్యేయేషన్ (లిటరేచర్) (లేదా)  సంబంధిత లాంగ్వేజ్‌లో పీజీ డిగ్రీతోపాటు లాంగ్వేజ్ పండిట్ సర్టిఫికేట్/బీఈడీ(సంబంధిత లాంగ్వేజ్‌) కలిగి ఉండాలి. 

🔰 పేపర్-2 బి (6 - 8వ తరగతులు) స్పెషల్ స్కూల్స్

➥ డిగ్రీతోపాటు బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) అర్హత ఉండాలి. (లేదా)

➥ డిగ్రీతోపాటు బీఈడీ(జనరల్)తోపాటు ఏడాది డిప్లొమా(స్పెషల్ ఎడ్యుకేషన్) అర్హత ఉండాలి. (లేదా)

➥ డిగ్రీతోపాటు బీఈడీ(జనరల్)తోపాటు రెండేళ్ల డిప్లొమా(స్పెషల్ ఎడ్యుకేషన్) అర్హత ఉండాలి. (లేదా)

➥ డిగ్రీతోపాటు బీఈడీ(జనరల్)తోపాటు రెండేళ్ల పీజీ డిప్లొమా(స్పెషల్ ఎడ్యుకేషన్/ స్పెషల్ ఎడ్యుకేషన్ మెంటల్ రిటార్డేషన్/మల్లిపుల్ డిజెబిలిటి-ఫిజికల్, న్యూరోలాజికల్/లోకోమోటర్ ఇంపేర్‌మెంట్ & సెరిబ్రల్ పాల్సీ) అర్హత ఉండాలి. 

➥ సెకండరీ లెవల్ టీచర్ ట్రైనింగ్ కోర్సు (విజువల్ ఇంపేర్‌మెంట్)/ సీనియర్ డిప్లొమా టీచింగ్(డెఫ్) అర్హత ఉండాలి. (లేదా)

➥ బీఏబీఈడీ (విజువల్ ఇంపేర్‌మెంట్) లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. 

ఏపీటెట్ పరీక్ష విధానం (AP TET 2024 Exam Pattern):

* పేపర్-1(ఎ): మొత్తం 150 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఛైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 (తెలుగు/ఉర్దూ/హిందీ/కర్ణాటక/తమిళం/ఒడియా)-30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వే్జ్-2(ఇంగ్లిష్)-30 ప్రశ్నలు-30 మార్కులు, మ్యాథమెటిక్స్-30 ప్రశ్నలు-30 మార్కులు, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్-30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి.

* పేపర్-1(బి): మొత్తం 150 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఛైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి (స్పెషల్ ఎడ్యుకేషన్)-30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 (తెలుగు/ఉర్దూ/హిందీ/కర్ణాటక/తమిళం/ఒడియా)-30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వే్జ్-2(ఇంగ్లిష్)-30 ప్రశ్నలు-30 మార్కులు, మ్యాథమెటిక్స్-30 ప్రశ్నలు-30 మార్కులు, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్-30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి.

* పేపర్-2(ఎ): మొత్తం 150 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఛైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి-30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1(తెలుగు/ఉర్దూ/హిందీ/కర్ణాటక/తమిళం/ఒడియా/సంస్కృతం)-30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వే్జ్-2(ఇంగ్లిష్)-30 ప్రశ్నలు-30 మార్కులు, మ్యాథమెటిక్స్ & సైన్స్/సోషల్ స్టడీస్/లాంగ్వేజ్-1(తెలుగు/ఇంగ్లిష్/ఉర్దూ/హిందీ/కర్ణాటక/తమిళం/ఒడియా/సంస్కృతం)-60 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి.

* పేపర్-2(బి): మొత్తం 150 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఛైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి (స్పెషల్ ఎడ్యుకేషన్)-30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 (తెలుగు/ఉర్దూ/హిందీ/కర్ణాటక/తమిళం/ఒడియా)-30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వే్జ్-2(ఇంగ్లిష్)-30 ప్రశ్నలు-30 మార్కులు, మ్యాథమెటిక్స్-30 ప్రశ్నలు-30 మార్కులు, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్-30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

తెలంగాణ పంచాయతీ ఎన్నికల సమరం: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక వ్యూహాలు..గ్రామాల్లో విజయం ఎవరిదో?
తెలంగాణ పంచాయతీ ఎన్నికల సమరం: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక వ్యూహాలు..గ్రామాల్లో విజయం ఎవరిదో?
Vaikunta Dwara Darshan Tokens Registration: తిరుమలేశుడి భక్తులకు గుడ్ న్యూస్- వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం 
తిరుమలేశుడి భక్తులకు గుడ్ న్యూస్- వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం 
US Shooting: వైట్ హౌస్ దగ్గర ఆప్ఘన్‌ యువకుడి కాల్పులు! ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులకు గాయాలు!
వైట్ హౌస్ దగ్గర ఆప్ఘన్‌ యువకుడి కాల్పులు! ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులకు గాయాలు!
Andhra King Taluka OTT : రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ - ఎందులో చూడొచ్చంటే?
రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ - ఎందులో చూడొచ్చంటే?
Advertisement

వీడియోలు

Gambhir Comments on Head Coach Position | గంభీర్ సెన్సేషనల్ స్టేట్‌మెంట్
World Test Championship Points Table | టెస్టు ఛాంపియన్‌షిప్ లో భారత్ స్థానం ఇదే
Reason for Team India Failure | భారత్ ఓటమికి కారణాలు ఇవే !
Rohit Sharma First Place in ICC ODI Rankings | అగ్రస్థానంలో
South Africa whitewashed India | రెండో టెస్ట్ ఓడిపోయిన టీమ్ ఇండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ పంచాయతీ ఎన్నికల సమరం: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక వ్యూహాలు..గ్రామాల్లో విజయం ఎవరిదో?
తెలంగాణ పంచాయతీ ఎన్నికల సమరం: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక వ్యూహాలు..గ్రామాల్లో విజయం ఎవరిదో?
Vaikunta Dwara Darshan Tokens Registration: తిరుమలేశుడి భక్తులకు గుడ్ న్యూస్- వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం 
తిరుమలేశుడి భక్తులకు గుడ్ న్యూస్- వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం 
US Shooting: వైట్ హౌస్ దగ్గర ఆప్ఘన్‌ యువకుడి కాల్పులు! ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులకు గాయాలు!
వైట్ హౌస్ దగ్గర ఆప్ఘన్‌ యువకుడి కాల్పులు! ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులకు గాయాలు!
Andhra King Taluka OTT : రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ - ఎందులో చూడొచ్చంటే?
రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ - ఎందులో చూడొచ్చంటే?
Smriti Mandhana–Palash Muchhal Wedding Row: స్మృతి మంధాన పెళ్లిపై మేరీ డి'కోస్టా సంచలన పోస్టు! పలాష్ ముచ్చల్‌తో సంబంధంపై క్లారిటీ!
స్మృతి మంధాన పెళ్లిపై మేరీ డి'కోస్టా సంచలన పోస్టు! పలాష్ ముచ్చల్‌తో సంబంధంపై క్లారిటీ!
South Central Railway : ఇంటి నుంచే దేశం నలుమూలలకు పార్శిల్ పంపేయొచ్చు- కొత్త సర్వీస్ ప్రారంభించనున్న దక్షిణ మధ్య రైల్వే
ఇంటి నుంచే దేశం నలుమూలలకు పార్శిల్ పంపేయొచ్చు- కొత్త సర్వీస్ ప్రారంభించనున్న దక్షిణ మధ్య రైల్వే
India Wedding Season: 44 రోజుల్లో 46 లక్షల వివాహాలు... ఎక్కువ పెళ్లిళ్లు ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయో తెలుసా?
44 రోజుల్లో 46 లక్షల వివాహాలు... ఎక్కువ పెళ్లిళ్లు ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయో తెలుసా?
Raju Weds Rambai : హార్ట్ టచింగ్ 'రాజు వెడ్స్ రాంబాయి' - ఈ థియేటర్లలో ఫ్రీగా చూడొచ్చు
హార్ట్ టచింగ్ 'రాజు వెడ్స్ రాంబాయి' - ఈ థియేటర్లలో ఫ్రీగా చూడొచ్చు
Embed widget