అన్వేషించండి

E-Schools: ఏపీలో 'ఈ–పాఠశాల' ఎంతో ప్రత్యేకం, విద్యార్థులకు డిజిటల్ పాఠాలు!

ఏపీ ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు పాఠశాల విద్యకు కొత్త ఊపిరులు పోస్తున్నాయి. బైజూస్‌ ద్వారా స్మార్ట్‌ ఫో­న్లలో, ట్యాబ్‌ల ద్వారా ఈ–కంటెంట్‌ అంది­స్తున్న ప్రభుత్వం త్వరలో ఈ–పాఠశాలను ప్రవే­శపెడుతోంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో చేపడుతున్న సంస్కరణలు పాఠశాల విద్యకు కొత్త ఊపిరులు అందిస్తోంది. ఇప్పటికే బైజూస్‌ ద్వారా స్మార్ట్‌ ఫో­న్లలో, ట్యాబ్‌ల ద్వారా ఈ–కంటెంట్‌ అంది­స్తున్న ప్రభుత్వం త్వరలో ఈ–పాఠశాలను ప్రవే­శపెడుతోంది. ఇందులో భాగంగా ఎస్‌సీ­ఈ­ఆర్‌టీ ద్వారా 4వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఈ–కంటెంట్‌ను అందించనుంది. ఇందుకోసం పాఠశాల విద్యాశాఖ ప్రత్యేకంగా ఈ–పాఠశాల యాప్‌ను రూపొందిస్తోంది. ఈ కొత్త విధానం వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెళ్లు, కింది తరగతుల్లో స్మార్ట్‌ టీవీల ద్వారా ప్రభుత్వం డిజిటల్‌ విద్యాబోధన అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ తరగతులకు అవసరమైన ఈ–కంటెంట్‌ను పూర్తి స్థాయిలో రూపొందించడానికి పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. ఎస్‌సీఈఆర్‌టీ ద్వారా 4వ తరగతి నుంచి ఈ–కంటెంట్‌ను సిద్ధం చేయిస్తోంది. 

Also Read:  ఏపీఆర్‌జేసీ సెట్-2023 ప్రవేశాల నోటిఫికేషన్‌ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

విద్యార్థులకు సౌలభ్యంగా..
విద్యార్థుల సౌలభ్యం కోసం లాంగ్వేజెస్, నాన్‌ లాంగ్వేజెస్‌.. ఇలా అన్ని సబ్జెక్టుల్లోనూ ఈ–కంటెంట్‌ను రూపొందించే పనిలో ఎస్‌సీఈఆర్‌టీ నిమగ్నమైంది. ప్ర­స్తుతం 4వ తరగతి నుంచి నాన్‌ లాంగ్వేజెస్‌ సబ్జెక్టులకు బైజూస్‌ సంస్థ ద్వారా కంటెంట్‌ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి ప్రత్యామ్నా­యంగా ఎస్‌సీఈఆర్‌టీ అదే తరహాలో ఈ–కం­టెంట్‌ను సిద్ధం చేయిస్తోంది. నాన్‌ లాంగ్వేజెస్‌ సబ్జెక్టులకు మాత్రమే కాకుండా లాంగ్వేజెస్‌ సబ్జెక్టుల్లో కూడా రూపొందిస్తోంది. పాఠ్యప్రణాళికలను రూపొందించేది ఎస్‌­సీ­ఈఆర్‌టీయే కాబట్టి భవిష్యత్తులో బైజూస్‌ సంస్థ ఉన్నా, లేకున్నా విద్యార్థులకు ఇబ్బంది రాకుండా ప్రభుత్వం ఎస్‌సీఈఆర్‌టీ ద్వారా ఈ– కంటెంట్‌ను సిద్ధం చేయిస్తోంది. దీన్ని ఏపీ ఈ–పాఠశాల, యూట్యూబ్, దీక్షా ప్లాట్‌­ఫారం, ఐఎఫ్‌బీ ప్లాట్‌ఫారం, పీఎం ఈ–విద్య (డీటీహెచ్‌ చానెల్‌)లో అందుబా­­టులో ఉంచుతారు. ఈ నేపథ్యంలో ఒకే రక­మైన కంటెంట్‌ ఉండేలా.. ఒకేలా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తు­తం ఎవ­రికి నచ్చినట్లు వారు ఈ–కంటెంట్‌ను రూ­పొందించి యూ­ట్యూ­బ్‌లో పెడుతున్నారు. దీనివల్ల విద్యా­ర్థులు కొంత సంశయానికి లోనవు­తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ­మే అన్ని అధికారిక చానెళ్లలో ఎన్‌సీఈ­ఆర్‌టీ, ఎస్‌సీఈఆర్‌టీ రూపొందించిన ఈ–కంటెంట్‌ను అందుబాటులో ఉంచనుంది. 

Also Read: నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి శిక్షణ, ఆపై ఉద్యోగాలు!

అన్ని సబ్జెక్టులు అందుబాటులో..
ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో 4 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యా­ర్థు­లకు బైజూస్‌ కంటెంట్‌ అందుబాటులో ఉంది. అయితే ఇది కేవలం మ్యాథ్స్, సైన్స్, సోషల్‌ స్టడీస్‌‌కు మాత్రమే పరిమి­తమైంది. విద్యార్థులు స్మార్ట్‌ ఫోన్ల ద్వారా ఈ–కంటెంట్‌ను అభ్యసించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అలాగే 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందించింది. వీరు 10వ తరగతి వరకు ఈ–కంటెంట్‌ పాఠ్యాంశాలను ట్యాబుల్లోనే చదువుకోవచ్చు. అయి­తే బైజూస్‌ ద్వారా లాంగ్వేజ్‌ సబ్జెక్టులకు ఈ–కంటెంట్‌ లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యా, పరిశోధన శిక్షణ మండలి (ఎస్‌ఈసీ­ఆర్‌టీ) ద్వారా తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్ సబ్జెక్టులకు కూడా ప్రభుత్వం ఈ–కంటెంట్‌ను సిద్ధం చేయిస్తోంది. ఇందులో భాగంగా ముందు 8వ తరగతిలో లాంగ్వేజ్‌ సబ్జెక్టులకు ఈ–కంటెంట్‌ను రూపొందిస్తున్నారు. ఇప్ప­టికే ఈ ప్రక్రియను చేపట్టిన ఎస్‌సీఈఆర్‌టీ మరో రెండు నెలల్లో దీన్ని పూర్తి చేయనుంది. ఆ తర్వాత వరుసగా 9, 7, 6 తరగతులకు రూపొందిస్తారు. 10వ తరగతికి 2024–25లో సిలబస్‌ మారుస్తా­మని.. ఆ తర్వాత ఈ–కంటెంట్‌ను రూపొందిస్తామని ఎస్‌సీఈఆర్‌టీ అధికారులు వివరించారు. వచ్చే ఏడాది నాటికి 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఈ–కంటెంట్‌ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. 

Also Read: ఏపీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు, నోటిఫికేషన్ వెల్లడి - పరీక్ష ఎప్పుడంటే?

ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌కు అనుగుణంగా..
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ విధానాన్ని ప్రవే­శపెడుతున్నందున ఎన్‌సీఈఆర్‌టీ సిల­బస్‌కు అనుగుణంగా రాష్ట్రంలోనూ పా­ఠ్యాంశాలు ఉండేలా ఎస్‌సీఈఆర్‌టీ చ­ర్యలు చేపట్టింది. కేవలం మన రాష్ట్రా­నికి సంబంధించిన అంశాలనే విద్యార్థి నేర్చుకుంటే భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ పోటీ పరీక్షల్లో వెను­క­బడే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం నీట్, జేఈఈ వంటి పరీక్షలన్నీ ఎన్‌సీ­ఈఆర్‌టీ సిలబస్‌ ఆధారంగానే జరు­గు­తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యా­ర్థులు అలాంటి పరీక్షల్లోనూ మంచి విజయాలు సాధించేలా ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ను ఈ–కంటెంట్‌ రూపకల్ప­నలో యథాతథంగా అనుసరిస్తు­న్నా­రు. జాతీయ కరిక్యులమ్‌ను అనుసరించి జాతీయ అంశాలను బోధించేట­ప్పుడు మన రాష్ట్ర అంశాలను ఆసరా­గా చేసుకొని చెప్పేలా టీచర్లకు సూచనలు సైతం చేశారు.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
TTD Board Chairman :  అర గంటలో మారిన స్వరం- భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ 
అర గంటలో మారిన స్వరం- భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ 
PM Modi Podcast :  నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు  - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
Fun Bucket Bhargava:  ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Prathyusha Challa Case | అతుల్ సుభాష్ కేసును గుర్తు చేస్తున్న మరో కేసు | ABP DesamPawan Kalyan vs YS Jagan | జగన్, పవన్ ఎదురెదురు పడిన ఘటన..తీవ్ర ఉద్రిక్తత | ABP DesamYanam Fruit and Flower Show | పుష్ప అంట్లే ఫ్లవర్ అనుకుంటివా...కాదు యానాం ఫ్లవర్ | ABP DesamFun Bucker Bhargav 20Years Sentence | సంచలన తీర్పు ఇచ్చిన విశాఖ పోక్సో కోర్టు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
TTD Board Chairman :  అర గంటలో మారిన స్వరం- భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ 
అర గంటలో మారిన స్వరం- భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ 
PM Modi Podcast :  నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు  - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
Fun Bucket Bhargava:  ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
Ashwin In Politics: రాజకీయ చదరంగంలోకి అశ్విన్..!!l తమిళ పాలిటికల్‌ ఎంట్రీ కోసమే హిందీ వ్యతిరేక వ్యాఖ్యలా!
రాజకీయ చదరంగంలోకి అశ్విన్..!!l తమిళ పాలిటికల్‌ ఎంట్రీ కోసమే హిందీ వ్యతిరేక వ్యాఖ్యలా!
Telangana News: తెలంగాణలో చేనేత కార్మికులకు గుడ్ న్యూస్- అభ‌య‌హ‌స్తం ప‌థ‌కం మార్గదర్శకాలు జారీ
తెలంగాణలో చేనేత కార్మికులకు గుడ్ న్యూస్- అభ‌య‌హ‌స్తం ప‌థ‌కం మార్గదర్శకాలు జారీ
Pawan Kalyan Tour In Pithapuram: క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
NTR Nagar:  జగన్‌కు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం - సెంటు స్థలాల కాలనీలకు కొత్త పేరు ఖరారు!
జగన్‌కు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం - సెంటు స్థలాల కాలనీలకు కొత్త పేరు ఖరారు!
Embed widget