News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

APRJC CET - 2023: ఏపీఆర్‌జేసీ సెట్-2023 ప్రవేశాల నోటిఫికేషన్‌ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లను మే 12 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మే 20న మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.

FOLLOW US: 
Share:

ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహణలో ఉన్న జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది. ఏపీఆర్‌జేసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష - 2023కు ఏప్రిల్‌ 4 నుంచి 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లను మే 12 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మే 20న మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ఫలితాలను జూన్‌ 8న ప్రకటిస్తారు. అనంతరం ఇంటర్‌లో కోర్సుల వారీగా సీట్లను భర్తీ చేసేందుకు తొలి విడత కౌన్సిలింగ్‌ జూన్‌ 12 నుంచి 16 వరకు; జూన్‌ 19 నుంచి 21 వరకు రెండో విడత; జూన్‌ 26 నుంచి 28 వరకు మూడో విడత కౌన్సెలింగ్‌ జరగనుంది. 

వివరాలు...

* ఏపీఆర్‌జేసీ సెట్-2023 

సీట్ల సంఖ్య: 1149. వీటిలో ఆంధ్రా రీజియన్‌లో 637 సీట్లు, రాయలసీమ రీజియన్‌లో 443 సీట్లు ఉన్నాయి. ఇక మైనార్టీ జూనియర్ కళాశాలల్లో 69 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

అర్హత: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు: రూ.300.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ద్వారా.

పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో 150 ప్రశ్నలు అడుగుతారు. మల్టీపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. పదోతరగతి స్థాయిలోనే ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండున్నర గంటలు. ఇంగ్లిష్-తెలుగు, ఇంగ్లిష్-ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష ఉంటుంది. ఓఎంఆర్ విధానంలో పరీక్ష ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. 

ముఖ్యమైన తేదీలు..

* నోటిఫికేషన్ వెల్లడి: 04.04.2023.

* ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 04.04.2023.

*  ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపునకు చివరితేది: 24.04.2023 

*  హాల్‌టికెట్ల విడుదల: 12.05.2023

*  పరీక్ష తేది: 20.05.2023. (2.30 PM to 5 PM)

*  ఫలితాల వెల్లడి: 08.06.2023.

Notificaion

APRJC CET - 2023 PROSPECTUS

Online Application

Website

Also Read:

SRTRI: నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి శిక్షణ, ఆపై ఉద్యోగాలు!
తెలంగాణ‌లోని గ్రామీణ నిరుద్యోగ యువతకు వివిధ కోర్సులో ఉచిత నైపుణ్య శిక్షణ కోసం యాదాద్రి భువనగిరి జిల్లా జలాల్‌పూర్ గ్రామంలోని స్వామి రామానందతీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్ దరఖాస్తులు కోరుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకమైన 'దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన' కింద ఈ శిక్షణ కొనసాగనుంది. ఈ నైపుణ్య కోర్సులకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉండి.. 8వ తరగతి, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు ఉచిత నివాస, భోజన వసతులు కల్పిస్తారు. ఈ శిక్షణ కోర్సుల్లో ప్రవేశాలు కోరేవారు ఒరిజినల్ సర్టిఫికేట్లతో ఏప్రిల్ 10న సంస్థలో హాజరుకావాల్సి ఉంటుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

సైనిక పాఠశాలలో ఆరో తరగతి, ఇంటర్ ప్రవేశ ప్రకటన విడుదల-పరీక్ష ఎప్పుడంటే?
ఎన్‌డీఏ, ఎస్‌ఎస్‌బీ తదితర సైనిక దళాల్లో అధికారుల నియామకాల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం వరంగల్ జిల్లా అశోక్ నగర్‌లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ సైనిక పాఠశాలను బాలుర కోసం ప్రత్యేకంగా ప్రారంభించింది. పాఠశాలలో సైనిక శిక్షణే ప్రధానాంశంగా ఉంటుంది. ఇందుకు సంబంధించి హైదరాబాద్‌లోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్)... 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి వరంగల్ జిల్లా అశోక్ నగర్‌లో బాలుర సైనిక స్కూల్ ఆరో తరగతి (సీబీఎస్‌ఈ సిలబస్), ఇంటర్మీడియట్(ఎంపీసీ- సీబీఎస్ఈ సిలబస్)లో ప్రవేశాలకి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 05 Apr 2023 12:30 PM (IST) Tags: APRJC CET - 2023 APRJC CET - 2023 Notification APRJC CET - 2023 Application APRJC CET - 2023 Exam Date APRJC AAdmissions

ఇవి కూడా చూడండి

CTET 2023 Results: సీటెట్‌ (జులై) - 2023 ఫలితాలు విడుదల, రిజల్ట్స్‌ కోసం డైరెక్ట్ లింక్

CTET 2023 Results: సీటెట్‌ (జులై) - 2023 ఫలితాలు విడుదల, రిజల్ట్స్‌ కోసం డైరెక్ట్ లింక్

AP ECET: ఏపీఈసెట్‌ ఫార్మసీ కౌన్సెలింగ్‌ ప్రారంభం, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

AP ECET: ఏపీఈసెట్‌ ఫార్మసీ కౌన్సెలింగ్‌ ప్రారంభం, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

ANGRAU Admissions: ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీలో ప్రవేశాలకు 27 నుంచి వెబ్‌ ఆప్షన్లు

ANGRAU Admissions: ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీలో ప్రవేశాలకు 27 నుంచి వెబ్‌ ఆప్షన్లు

Scholarships: సంతూర్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ 2023-24, చివరితేది ఎప్పుడంటే?

Scholarships: సంతూర్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ 2023-24, చివరితేది ఎప్పుడంటే?

NITW: వరంగల్‌ నిట్‌లో బీఎస్సీ- బీఈడీ ఇంటిగ్రేటెడ్‌ కోర్సు, అర్హతలివే

NITW: వరంగల్‌ నిట్‌లో బీఎస్సీ- బీఈడీ ఇంటిగ్రేటెడ్‌ కోర్సు, అర్హతలివే

టాప్ స్టోరీస్

YS Sharmila: ఈ 30లోపు నిర్ణయం, లేకపోతే ఒంటరిగానే పోటీ - పార్టీ విలీనంపై షర్మిల ప్రకటన

YS Sharmila: ఈ 30లోపు నిర్ణయం, లేకపోతే ఒంటరిగానే పోటీ - పార్టీ విలీనంపై షర్మిల ప్రకటన

AIADMK Breaks With BJP: ఎన్డీఏ కూటమికి అన్నాడీఎంకే గుడ్ బై - అన్నాదురైపై బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలతో కీలక నిర్ణయం

AIADMK Breaks With BJP: ఎన్డీఏ కూటమికి అన్నాడీఎంకే గుడ్ బై - అన్నాదురైపై బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలతో కీలక నిర్ణయం

చాలామంది నన్ను ఉంచుకుంటా అన్నారు, కానీ పెళ్లి చేసుకుంటా అనలేదు: జయలలిత

చాలామంది నన్ను ఉంచుకుంటా అన్నారు, కానీ పెళ్లి చేసుకుంటా అనలేదు: జయలలిత

Women Cricket Team Wins Gold: మన అమ్మాయిలు బంగారం - ఏసియన్ గేమ్స్ క్రికెట్ ఫైనల్‌లో లంకను ఓడించిన భారత్

Women Cricket Team Wins Gold: మన అమ్మాయిలు బంగారం - ఏసియన్ గేమ్స్ క్రికెట్ ఫైనల్‌లో లంకను ఓడించిన భారత్