అన్వేషించండి

Sankranti Holidays: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఈసారి 10 రోజుల సంక్రాంతి సెలవులు, ప్రభుత్వం ఆదేశాలు జారీ

Sankranthi Holidays in AP: ఏపీలో సంక్రాంతి సెలవులపై నెలకొన్న సందిగ్ధతకు ఎట్టకేలకు తెరపడింది. ప్రభుత్వం, ప్రైవేటు పాఠశాలలకు జనవరి 9 నుంచి 18 వరకూ సంక్రాంతి సెలవులను నిర్ణయించారు.

AP Sanktanthi Holidays: ఏపీలో సంక్రాంతి సెలవులపై నెలకొన్న సందిగ్ధతకు ఎట్టకేలకు తెరపడింది. అకాడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం ప్రభుత్వం, ప్రైవేటు పాఠశాలలకు జనవరి 9 నుంచి 18 వరకూ సంక్రాంతి సెలవులను నిర్ణయించారు. జనవరి19న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జిల్లా విద్యా శాఖాధికారులు ఆదేశాలిచ్చారు. సెలవుల్లో తరగతులను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ముందుగా జనవరి 16 వరకు సెలవులు ఉంటాయని భావించినా.. స్కూళ్లు, కాలేజీలకు మరో రెండు రోజుల పాటు అదనంగా సెలవులు ఇచ్చారు. ఇదిలా ఉండగా.. ఉపాధ్యాయ సంఘాలు మాత్రం జనవరి 11 నుంచి 21 వరకు సెలవులు ఇవ్వాలని కోరుతున్నాయి. పండుగ అయిపోయిన వెంటనే పిల్లలు పాఠశాలలకు రారని, అందుకే రెండు రోజులు వెనక్కి ఇచ్చి, జనవరి 22న ప్రారంభించాలని విన్నవించాయి. జనవరి 25న ఆదివారం, జనవరి 26న రిపబ్లిక్‌ డే రావడంతో మరోసారి వరుస సెలవులు రానున్నాయి. మొత్తంగా చూస్తే జనవరి 2024 జనవరి నెలలో దాదాపు 11 నుంచి 13 రోజులు పాటు సెలవులు ఉంటాయి.

ఇంటర్ కాలేజీలకు నాలుగు రోజులే..
రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీలకు ఈసారి నాలుగు రోజులపాటు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. జనవరి 13 నుంచి 16 వరకు సెలవులు ఇవ్వనున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 11 నుంచి 17 వరకు ఇంటర్ కళాశాలలకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. అయితే వారంరోజులకు బదులుగా కేవలం నాలుగు రోజులు మాత్రమే సెలవులు ఉండే అవకాశం ఉంది

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది(2024) సాధారణ సెలవుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు నవంబరు 30న అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. జాతీయ సెలవులు, పండుగలు కలిపి ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ఏడాది మొత్తం 20 రోజులను సాధారణ సెలవులు, మరో 17 రోజులు ఐచ్ఛిక సెలవులుగా(Optional Holidays) ప్రకటించింది. జనవరి 15, 16ను సాధారణ సెలవుల జాబితాలో చేర్చింది. భోగి, అంబేడ్కర్ జయంతి ఆదివారం, దుర్గాష్టమి రెండో శనివారం వచ్చాయని తెలిపింది. ఏప్రిల్ 9న ఉగాది సెలవుగా ప్రకటించింది. 

ప్రభుత్వం విడుదల చేసిన ప్రకారం.. జనవరి 15న మకర సంక్రాంతి, 16న కనుమ పండుగ సెలవులను ప్రకటించింది. జనవరి 26న రిపబ్లిక్‌ డే, మార్చి 3న మహా శివరాత్రి, మార్చి 25న హోళీ, మార్చి 29న గుడ్‌ ఫ్రై డే సెలవులుంటాయని ప్రకటిస్తున్నట్లు ఉత్తర్వులో స్ఫష్టం చేశారు. ఏప్రిల్‌ 5న బాబు జగ్జీవన్‌రాం జయంతి, 9న ఉగాది, 11న రంజాన్‌, 17న శ్రీరామ నవమి, జూన్‌ 17న బక్రీద్‌ సెలవులుంటాయని తెలియజేసింది. జూలై 17న మొహర్రం, ఆగస్టు 15 ఇండిపెండెన్స్‌ డే, 26 శ్రీ కృష్ణాష్టమి, సెప్టెంబర్‌ 7న వినాయక చవితి సెలవులు, 16న ఈద్‌-ఉల్‌-ఉన్‌-నబీ పండుగల సందర్భంగా సెలవులను అమలు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అక్టోబర్‌ 2న గాంధీ జయంతి, అక్టోబర్‌ 11న దుర్గాష్టమి, 31న దీపావళి, డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ సెలవులు ఉంటాయని వెల్లడించింది . వీటితో పాటు మరో 17 ఐచ్ఛిక సెలవుల తేదీలను ప్రకటించింది .

ఆదివారాలు, రెండో శనివారాలకు అదనంగా ప్రభుత్వ కార్యాలయాలకు ఇచ్చే ఇతర సెలవులతో కూడి జాబితాను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. పండుగలు, వేడుకలు, ఇతర సందర్భాలు ఇందులో ఉన్నాయి. వీటిని ప్రభుత్వ సంస్ధలు, కార్పోరేషన్లతో పాటు ప్రభుత్వం కింద పని చేసే అన్ని సంస్ధలు, ఉద్యోగులకు వర్తింప చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ముస్లింల పండుగలైన రంజాన్, బక్రీద్, మొహర్రం, మిలాద్ ఉన్ నబీలకు కూడా ఇందులోనే సెలవులు ప్రకటించినప్పటికీ ఏదైనా మార్పు ఉంటే అప్పుడు మార్చుకునేందుకు వీలు కల్పించింది.

తెలంగాణలో సెలువులు ఇలా..
తెలంగాణలోని పాఠశాలలకు సంక్రాంతి పండుగ సెలవులను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో.. జనవరి 12 నుంచి 17 వరకు సెలవులు (Sankranthi Holidays) ఉంటాయని ప్రభుత్వం బుధవారం (జనవరి 3) ఒక ప్రకటనలో తెలిపింది. కాగా జనవరి 13న 2వ శనివారం కాగా.. జనవరి 14న భోగి, జనవరి 15న సంక్రాంతి, జనవరి 16న కనుమ పండుగలు ఉన్నాయి. మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయని పేర్కొంది.  సంక్రాంతి సెలువులు జనవరి 12 నుంచి ప్రారంభం కానున్నాయి.. జనవరి 13న రెండో శనివారం, తర్వాత జనవరి 14న ఆదివారం భోగి పండుగ కాగా.. జనవరి 15న సోమవారం సంక్రాంతి పర్వదిన వస్తోంది. ఇక,  జనవరి16న కనుమ పండగ ఉంది. కాగా, జనవరి 17న ప్రభుత్వం పాఠశాలలకు అదనంగా సెలవు ఇచ్చింది. దీంతో ఆరు రోజుల పాటు స్కూల్స్‌కు హాలీడేస్ వస్తున్నాయి.

జూనియర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు..
తెలంగాణలో జూనియర్ కాలేజీలకు (Telangana Inter Colleges) సంక్రాంతి సెలవులను ఇంటర్ బోర్డు (TS Inter Board) ప్రకటించింది. ఈమేరకు జనవరి 6న అధికారిక ప్రకటన జారీచేసింది. ఈసారి మొత్తం ఇంటర్ కాలేజీలకు 4 రోజులపాటు సంక్రాంతి సెలవులు (Sankranthi Holidays) ఇవ్వనున్నట్లు తెలిపింది.
పూర్తివివరాలకోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget