News
News
వీడియోలు ఆటలు
X

TS SSC Exams: తెలంగాణలో రేపట్నుంచి 'టెన్త్ క్లాస్' ఎగ్జామ్స్, విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం!

ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 4,94,620 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. వీరికోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,652 పరీక్షా కేంద్రాలను విద్యాశాఖ ఏర్పాటు చేసింది.

FOLLOW US: 
Share:

తెలంగాణలో పదోతరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఏప్రిల్ 3 నుంచి ప్రారంభంకానున్న పరీక్షలకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టింది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఏప్రిల్ 13 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. విద్యార్థులు పరీక్షా సమయానికి గంట ముందు నుంచే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఎండల తీవ్రతల నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులు హాల్‌టికెట్‌ చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు. 

ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 4,94,620 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. వీరికోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,652 పరీక్షా కేంద్రాలను విద్యాశాఖ ఏర్పాటు చేసింది. పరీక్షలను ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు 3 గంట పాటు పరీక్ష నిర్వహించనున్నారు. అయితే సైన్స్‌, కాంపోజిట్‌ పేపర్లకు మాత్రం 20 నిమిషాలు అదనపు సమయాన్నిస్తారు. ఇక పేపర్‌ లీకేజీని అరికట్టడంలో భాగంగా పరీక్షాకేంద్రాల్లో సెల్‌ఫోన్లపై నిషేధం విధించారు. ఈ ఏడాది 11,456 పాఠశాలలకు చెందిన విద్యార్థులకు పరీక్షలు రాయబోతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 144 సిట్టింగ్‌ స్కాడ్‌లను రంగంలోకి దింపారు.

ఈ విద్యా సంవత్సరంలో 6 పేపర్లకే పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షా కేంద్రాలు తెలుసుకోవడానికి ‘సెంటర్‌ లోకేషన్‌’ యాప్‌ను రూపొందించారు. విద్యార్థులు సివిల్‌ డ్రెస్సులోనే పరీక్షలకు హాజరుకావాలని అధికారులు పేర్కొన్నారు. పరీక్షలు సజావుగా సాగేందుకు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధిస్తున్నారు. ఈ కేంద్రాలకు సమీపంలో ఉన్న జిరాక్స్‌, స్టేషనరీ దుకాణాలను మూసివేయించనున్నారు. విద్యార్థులు www.bseteleangana.bov.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌ టికెట్లను పరీక్షకు అనుమతించనున్నట్లు అధికారులు సూచించారు.

AP SSC Exams: 'పది' పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు, నిమిషం ఆలస్యమైనా 'నో' ఎంట్రీ - అయితే?
ఏపీలో ఏప్రిల్ 3 నుంచి ప్రారంభంకానున్న పదోతరగతి పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఏప్రిల్ 3 నుండి 18 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9:30 గంటల నుంచి  మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రత్యేక కారణం ఉంటే తప్ప పదోతరగతి పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. హాల్‌టికెట్ ఆధారంగా విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.  అయితే ఈ సారి ఏడు ప్రాంతీయ భాషలలో రాయనున్నారు. విద్యార్థులు రాష్ట్ర భాషా వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ తెలుగు, ఇంగ్లిష్, కన్నడ, తమిళం, హిందీ, ఉర్దూ, ఒడియా భాషల్లో పరీక్షలు రాయనున్నారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

ఇంటర్ అకడమిక్ ​క్యాలెండర్​ విడుదల, ఈ ఏడాది వచ్చే సెలవులివే!
తెలంగాణలో జూనియర్ కళాశాలల అకడమిక్ ​క్యాలెండర్​ని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని జూనియర్​ కళాశాలలు జూన్​ 1న ప్రారంభమవుతాయిన బోర్డు అధికారులు ఏప్రిల్ 1న వెల్లడించారు. జూన్ 1 నుంచే తరగతులు కూడా ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ మేరకు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక విద్యా క్యాలెండర్ బోర్డు వెలువరించింది. ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం.. జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 19 నుంచి 25 వరకు దసరా సెలవులు, 2024, జనవరి 13 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. కాగా, ఇంటర్మీడియట్ విద్య కోసం ఈ ఏడాది మొత్తం 227 పని దినాలు ఉంటాయని బోర్డు తెలిపింది.  ఇక ఫిబ్రవరి రెండో వారం నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. థియరీ పరీక్షలను మార్చి మొదటివారం నుంచి నిర్వహిస్తారు. ఏప్రిల్ 1 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు.
ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 02 Apr 2023 06:51 PM (IST) Tags: TS SSC Exams Education News in Telugu Telangana Tenth Class Exams TS Tenth Class Exams

సంబంధిత కథనాలు

TS ICET: జూన్‌ 4న తెలంగాణ ఐసెట్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

TS ICET: జూన్‌ 4న తెలంగాణ ఐసెట్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

NLSIU Courses: ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ-బెంగళూరులో పీజీ, పీజీ డిప్లొమా కోర్సులు!

NLSIU Courses: ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ-బెంగళూరులో పీజీ, పీజీ డిప్లొమా కోర్సులు!

పీజీ వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్, స్టైపెండ్‌ పెంచిన సర్కార్‌ - ఎంత శాతమంటే?

పీజీ వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్, స్టైపెండ్‌ పెంచిన సర్కార్‌ - ఎంత శాతమంటే?

CUET UG Admit Card: సీయూఈటీ యూజీ అడ్మిట్‌ కార్డులు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

CUET UG Admit Card: సీయూఈటీ యూజీ అడ్మిట్‌ కార్డులు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

NITW MBA Admissions: నిట్‌ వరంగల్‌లో ఎంబీఏ ప్రోగ్రామ్, ప్రవేశం ఇలా!

NITW MBA Admissions: నిట్‌ వరంగల్‌లో ఎంబీఏ ప్రోగ్రామ్, ప్రవేశం ఇలా!

టాప్ స్టోరీస్

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!