అన్వేషించండి

AP SSC Exams: 'పది' పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు, నిమిషం ఆలస్యమైనా 'నో' ఎంట్రీ - అయితే?

ఏపీలో ఏప్రిల్ 3 నుంచి ప్రారంభంకానున్న పదోతరగతి పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఏప్రిల్ 3 నుండి 18 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉ. 9:30 గం. నుంచి మ. 12:45 గం వరకు పరీక్షల నిర్వహిస్తారు

ఏపీలో ఏప్రిల్ 3 నుంచి ప్రారంభంకానున్న పదోతరగతి పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఏప్రిల్ 3 నుండి 18 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9:30 గంటల నుంచి  మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రత్యేక కారణం ఉంటే తప్ప పదోతరగతి పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. హాల్‌టికెట్ ఆధారంగా విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.  అయితే ఈ సారి ఏడు ప్రాంతీయ భాషలలో రాయనున్నారు. విద్యార్థులు రాష్ట్ర భాషా వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ తెలుగు, ఇంగ్లిష్, కన్నడ, తమిళం, హిందీ, ఉర్దూ, ఒడియా భాషల్లో పరీక్షలు రాయనున్నారు. 

పదోతరగతి హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

పరీక్షలకు 6.64 లక్షల మంది..
ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు మొత్తం 6,64,152 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 6,09,070 మంది ఉన్నారు. పరీక్షలు రాసేవారిలో బాలురు - 3,11,329, బాలికలు- 2,97,741 మంది ఉన్నారు. ఇక సప్లిమెంటరీ విద్యార్థులు 53,410 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. వీరితోపాటు ప్రైవేటు విద్యార్థులు 1524 మంది, ప్రైవేటు సప్లిమెంటరీ విద్యార్థులు - 147 మంది పరీక్షలు రాయనున్నారు. 

3449 పరీక్ష కేంద్రాలు..
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 3449 పరీక్ష కేంద్రాల్లో పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. వీటిలో 682 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో అత్యధికంగా విద్యార్థులుండగా,, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, బాపట్లలో అత్యల్పంగా ఉన్నారు. పరీక్షలను పర్యవేక్షించేందుకు, మాల్ ప్రాక్టీస్ ను నిరోధించడానికి 156 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 682 సిట్టింగ్ స్క్వాడ్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. అదనంగా 104 పరీక్షా కేంద్రాలలో CCTV కెమెరాలు అమర్చారు.

సైన్స్ పేపర్ 'ఒక్కటే'..
గతేడాది వరకు ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక పేపర్, బయాలజీకి మరో పేపర్ ఉండేది. ప్రస్తుతం సామాన్యశాస్త్రంలో భౌతిక, రసాయన, జీవశాస్త్రాలకు కలిపి ఒకే ప్రశ్నాపత్రం ఉంటుంది. జీవశాస్త్రాన్ని ప్రశ్నాపత్రంలోనే ప్రత్యేక సెక్షన్‌గా విభజిస్తారు. భౌతిక, రసాయనశాస్త్రాల్లో 12, జీవశాస్త్రంలో 10 అధ్యాయాలున్నాయి. ఇవికాకుండా పర్యావరణ విద్య సబ్జెక్టులో చిన్నచిన్న పాఠాలు 22 వరకున్నాయి. ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదల చేసిన బ్లూప్రింట్ ప్రకారం జీవశాస్త్రం నుంచి 17 ప్రశ్నలు, భౌతిక, రసాయన శాస్త్రాలనుంచి 16 ప్రశ్నలు ఇస్తారు. నాలుగో సెక్షన్‌లో ఇచ్చే ఎనిమిది మార్కుల ప్రశ్నలు అయిదింటికి తప్ప ఎక్కడా ఛాయిస్ లేదు. సాంఘిక శాస్త్రంలోనూ భూగోళం, చరిత్ర, ఆర్థిక, పౌరశాస్త్రాల్లో కలిపి 22 అధ్యాయాలున్నాయి. గతంలో 11 పేపర్ల విధానం ఉన్నప్పుడు ఒక రోజు పరీక్ష బాగా రాయకపోతే మరో రోజు ఎక్కువ మార్కులు తెచ్చుకునేందుకు అవకాశం ఉండేది.

విద్యార్థులకు అలర్ట్..

➥ విద్యార్థులు సమాధానాలు రాసేందుకు మొదట 24 పేజీల బుక్‌లెట్ ఇస్తారు. అదనంగా సమాధాన పత్రాలు అవసరమైతే 12 పేజీల బుక్‌లెట్ ఇస్తారు. 

➥ సైన్స్ పరీక్షకు మాత్రం ఫిజిక్స్-కెమిస్ట్రీ జవాబులు రాసేందుకు 12 పేజీల బుక్‌లెట్, బయాలజీకి మరో 12 పేజీల బుక్‌లెట్ విడివిడిగా ఇస్తారు.

➥ బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నాపత్రం ఉంటుంది.

➥ గతేడాది ప్రశ్నపత్రాలు వాట్సాప్‌ల్లో వచ్చినందున ఈసారి ఎవరూ పరీక్ష గదుల్లోకి ఫోన్ తీసుకెళ్లకూడదనే నిబంధనను విధించారు.

కొత్త విధానం ప్రకారం పది పరీక్షల మాదిరి ప్రశ్నపత్రాలు, బ్లూప్రింట్‌, ప్రశ్నల వారీగా వెయిటేజీ వివరాలను బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌లో ఇప్పటికే అందుబాటులో ఉంచింది. మరోవైపు 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకెడమిక్ క్యాలెండర్ ప్రకారం.. 1 నుంచి 9 తరగతులకు సమ్మెటివ్ 2 పరీక్షలు ఏప్రిల్ 27తో ముగియనున్నాయి. 

మాదిరి పశ్నాపత్రాలు, బ్లూప్రింట్స్ లింక్ కోసం క్లిక్ చేయండి.. 

ఏపీ పదోతరగతి పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

పరీక్షల షెడ్యూలు ఇలా..

పరీక్ష తేదీ పేపరు
ఏప్రిల్ 3 ఫస్ట్ లాంగ్వేజ్
ఏప్రిల్ 6 సెకండ్ లాంగ్వేజ్
ఏప్రిల్ 8 ఇంగ్లిష్
ఏప్రిల్ 10 మ్యాథమెటిక్స్
ఏప్రిల్ 13 సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ)
ఏప్రిల్ 15 సోషల్ స్టడీస్
ఏప్రిల్ 17 కాంపోజిట్ కోర్సు
ఏప్రిల్ 18 ఒకేషనల్ కోర్సు
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget