News
News
X

AISSEE-2023 Result: అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష 2023 ఫలితాలు విడుదల

దేశంలోని 33 సైనిక స్కూళ్లలో 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 9వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన 'ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్-2023'  (AISSEE-2023) ఫలితాలు వెలువడ్డాయి.

FOLLOW US: 
Share:

దేశంలోని 33 సైనిక స్కూళ్లలో 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 9వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన 'ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్-2023'  (AISSEE-2023) ఫలితాలు వెలువడ్డాయి. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జనవరి 8న పెన్ పేపర్ (ఓఎంఆర్ షీట్) విధానంలో నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఎన్‌జీవోలు/ప్రైవేట్ పాఠశాలలు/ రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పనిచేసే 18 కొత్త సైనిక పాఠశాలలకు సంబంధించి 6వ తరగతి ప్రవేశాలు సైతం ఏఐఎస్‌ఎస్‌ఈఈ-2023 ద్వారా జరుగుతాయి. పరీక్షకు హాజరైన విద్యార్థులు ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌లో తమ అప్లికేషన్ నెంబర్, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి  ఫలితాలు చూసుకోవచ్చు.

రాతపరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు త్వరలో ప్రారంభం కానున్న ఈ-కౌన్సెలింగ్‌కు  దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం వీరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఫిజికల్ టెస్టులు, మెడికల్ టెస్టులు నిర్వహించి సంబంధిత సైనిక పాఠశాలలో ప్రవేశం కల్పిస్తారు.

AISSEE-2023 Result Direct Link

☀ అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష (AISSEE -2023)

సీట్ల సంఖ్య: 4786

సీట్ల కేటాయింపు: మొత్తం సీట్లలో 6వ తరగతికి 4404 సీట్లు, 9వ తరగతికి 382 సీట్లు కేటాయించారు. 6వ తరగతికి కేటాయించిన సీట్లో ప్రభుత్వ పరిధిలో 2894, ప్రైవేటు పరిధిలో 1510 సీట్లు ఉన్నాయి. ఏ రాష్ట్రంలోనైతే సైనిక స్కూల్ ఉంటుందో అక్కడ అందుబాటులో ఉన్న మొత్తం సీట్లలో ఆ రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన విద్యార్థులకు 67 శాతం, ఇతర రాష్ట్రాల వారికి 33 శాతం సీట్లు కేటాయిస్తారు. అందులో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం ఇతర కులాలకు చెందిన విద్యార్థులకు 27 శాతం రిజర్వేషన్ ఉంటుంది. మిగిలిన 50.50 శాతం సీట్లలో 25 శాతం ఎక్స్-సర్వీస్‌మెన్ ఉద్యోగుల పిల్లలకు, మిగతా 25 శాతం ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు కేటాయిస్తారు. ఈ కోటాలో ఒకే రాష్ట్రానికి మూడు కంటే ఎక్కువ సీట్లు కేటాయించడానికి వీల్లేదు. 

పరీక్ష ఇలా సాగింది..

➥ పెన్ పేపర్ (ఓఎంఆర్ షీట్) విధానంలో రాతపరీక్ష నిర్వహించారు. రాతపరీక్షలో సాధించే మార్కుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. ఆబ్జె్క్టివ్ విధానంలోనే ప్రశ్నలు అడిగారు. 

➥ 6వ తరగతి ప్రవేశాలు కోరే విద్యార్థులకు మొత్తం 300 మార్కులకు పరీక్ష నిర్వహించారు. పరీక్షలో మొత్తం 125 ప్రశ్నలు ఇచ్చారు. వీటిలో మ్యాథమెటిక్స్ నుంచి 50 ప్రశ్నలు- ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు; ఇక ఇంటెలిజెన్స్, లాంగ్వేజ్, జనరల్ నాలెడ్జ్ సబ్జెక్టుల నుంచి 25 ప్రశ్నల చొప్పున ఉన్నాయి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు. పరీక్ష సమయం 2.30 గంటలు (180 నిమిషాలు).

➥ 9వ తరగతిలో ప్రవేశాలు కోరే విద్యార్థులకు 400 మార్కులకు రాత పరీక్ష నిర్వహించారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఇచ్చారు. వీటిలో మ్యాథమెటిక్స్ నుంచి 50 ప్రశ్నలు-ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు; ఇంటెలిజెన్స్, ఇంగ్లిష్, జనరల్ సైన్స్, సోషల్ సైన్స్ సజ్జెక్టుల నుంచి 25 ప్రశ్నలు-ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం మూడు గంటలు. 

➥ 9వ తరగతి విద్యార్థులు ఇంగ్లిష్ మాధ్యమంలో; 6వ తరగతి విద్యార్థులు ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష నిర్వహించారు.

Also Read:

టీఎస్‌పీఎస్సీ- ఆర్ఐఎంసీలో ఎనిమిదో త‌ర‌గ‌తి ప్రవేశాలు, అర్హతలివే!
ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ(ఆర్ఐఎంసీ)లో జనవరి- 2024 టర్మ్ ఎనిమిదోవ తరగతి ప్రవేశాలకు తెలంగాణకు చెందిన బాలురు, బాలికల నుంచి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) దరఖాస్తులు కోరుతోంది. జనవరి 2024 నాటికి ఏడో తరగతి చదువుతున్న లేదా ఎడో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. రాత పరీక్ష, వైవా వోస్, వైద్య పరీక్షల ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది.  ఏప్రిల్ 15 వరకు దరఖాస్తుచేసుకోవచ్చు. జూన్ 3వ తేదీన పరీక్ష నిర్వహిస్తారు.
ప్రవేశ వివరాల కోసం క్లిక్ చేయండి..

ఏపీపీఎస్సీ- ఆర్‌ఐఎంసీలో 8వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌, వివరాలు ఇలా!
డెహ్రాడూన్‌‌లోని రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజ్‌(ఆర్‌ఐఎంసీ)లో ఎనిమిదో తరగతి(2024 జనవరి సెషన్) ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. స్థానిక బాలురు, బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, వైవా, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. సరైన అర్హతలున్న విద్యార్థులు ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. వీరికి జూన్ 3న ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు.
ప్రవేశ వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 25 Feb 2023 03:08 PM (IST) Tags: Sainik School Score Card AISSEE Score Card link AISSEE Score Card 2023 AISSEE Score Card AISSEE 2023 Score Card

సంబంధిత కథనాలు

ఏపీ ప్రెస్‌ అకాడమీ జర్నలిజం డిప్లొమా కోర్సు - అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇలా!

ఏపీ ప్రెస్‌ అకాడమీ జర్నలిజం డిప్లొమా కోర్సు - అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇలా!

ఏప్రిల్‌ 3 నుంచి ఒంటి పూట బడులు, ఆ పాఠశాలలకు రెండు పూటలా సెలవులు!

ఏప్రిల్‌ 3 నుంచి ఒంటి పూట బడులు, ఆ పాఠశాలలకు రెండు పూటలా సెలవులు!

Medical Seats: కొత్తగా పది మెడికల్‌ పీజీ సీట్లు, కాకతీయ మెడికల్ కాలేజీకి కేటాయింపు!

Medical Seats: కొత్తగా పది మెడికల్‌ పీజీ సీట్లు, కాకతీయ మెడికల్ కాలేజీకి కేటాయింపు!

AP Inter Evaluation: ఏప్రిల్ 1 నుంచి ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం! జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

AP Inter Evaluation: ఏప్రిల్ 1 నుంచి ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం! జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

TS EAMCET: టీఎస్ఎంసెట్‌ - 2023 షెడ్యూల్‌లో మార్పులు, కొత్త తేదీలివే!

TS EAMCET: టీఎస్ఎంసెట్‌ - 2023 షెడ్యూల్‌లో మార్పులు, కొత్త తేదీలివే!

టాప్ స్టోరీస్

Nellore Adala : టీడీపీకి అభ్యర్థులు లేకనే ఫిరాయింపులు - నెల్లూరు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ లాజిక్ వేరే...

Nellore Adala : టీడీపీకి అభ్యర్థులు లేకనే ఫిరాయింపులు - నెల్లూరు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ లాజిక్ వేరే...

BRSలో చేరిన మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు, తన జీవితమంతా పోరాటాలేనన్న కేసీఆర్

BRSలో చేరిన మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు, తన జీవితమంతా పోరాటాలేనన్న కేసీఆర్

AP News : ప్రొబేషన్ కోసం పడిగాపులు - ఏపీలో 17వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎన్ని కష్టాలో ...

AP News  :  ప్రొబేషన్ కోసం పడిగాపులు - ఏపీలో 17వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎన్ని కష్టాలో ...

PBKS Vs KKR: కోల్‌కతాపై పంజాబ్ భారీ స్కోరు - భానుక రాజపక్స మెరుపు ఇన్నింగ్స్!

PBKS Vs KKR: కోల్‌కతాపై పంజాబ్ భారీ స్కోరు - భానుక రాజపక్స మెరుపు ఇన్నింగ్స్!