Communication Skills: కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపరచడానికి ఈ 10 చిట్కాలు పాటించండి
Communication Skills: ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం ఈ 10 చిట్కాలు పాటించండి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Communication Skills: ఏం చదువుకున్నాం, ఏ ఉద్యోగం చేస్తున్నాం, ఏ రంగంలో ఉన్నాం అనేదాంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ తప్పకుండా ఉండాల్సిన నైపుణ్యం కమ్యూనికేషన్. మీ అభిప్రాయాలను, ఆలోచనలను, ఐడియాలను, భావాలను పంచుకోవడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యం. మీ మనసులో ఏముందో, ఏం అనుకుంటున్నారో స్పష్టంగా, సమర్థవంతంగా చెప్పగలగడం ఓ కళ. దానినే కమ్యూనికేషన్ స్కిల్ అంటారు. సూటిగా, స్పష్టంగా, అవసరమైనప్పుడు కళాత్మకంగా మన భావాలు, ఆలోచనలు, ఆదేశాలు అయినా చెప్పగలగాలి. వ్యాపారాలు నిర్వహించే వారు కస్టమర్లతో ప్రభావవంతంగా మాట్లాడటానికి, ఉద్యోగాల్లో ఉన్న వారు ఉన్నతోద్యోగులతో తమ పనితీరు గురించి ఎఫెక్టివ్ గా చెప్పడానికి కమ్యూనికేషన్ స్కిల్ చాలా కీలకం. ఉద్యోగ వృత్తిలో కొంత మంది టీమ్ ను ముందుండి నడిపించే నాయకుడికి ఉండాల్సింది కూడా ఇదే. అందుకే కమ్యూనికేషన్ స్కిల్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇంతటి ముఖ్యమైన ఈ నైపుణ్యాన్ని సాధించేందుకు ఈ 10 చిట్కాలు పాటించండి.
1. వినడం నేర్చుకోవాలి
వినడం కూడా నేర్చుకోవాల్సిన అంశం. ఎదుటివారు చెప్పేది శ్రద్ధగా వింటే వాళ్లేం చెబుతున్నారో అర్థం అవుతుంది. దానికి సరైన సమాధానం కూడా చెప్పగలుగుతాం. అలాగే అవసరమైన ప్రశ్నలు అడగడానికి కూడా వినడం ముఖ్యం.
2. స్పష్టం, సంక్షిప్తం
మాట్లాడుతున్నప్పుడైనా, రాసినప్పుడైనా మీరిచ్చే సందేశం సులభంగా అర్థమయ్యేలా ఉండాలి. సరళమైన భాషను వాడాలి.
3. బాడీ లాంగ్వేజ్
మాట్లాడుతున్నప్పుడు మాటలే కాదు శరీర కదలికలు కూడా చాలా ముఖ్యం. అవి మాటలను మరింత ఎఫెక్టివ్ గా మారుస్తాయి.
4. ఆడియెన్స్ ఎవరు
ఎవరితో మాట్లాడుతున్నాం అనేది చాలా కీలకం. ఎవరితో మాట్లాడుతున్నామో వారికి తగ్గట్లుగా పదాల ఎంపిక ఉండాలి.
5. గౌరవించాలి, గౌరవించబడాలి
ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వారిని, వారి అభిప్రాయాలను గౌరవించాలి. చులకన చేసి మాట్లాడటం, ఏకవాక్యంతో సంభోదించడం చేయవద్దు. మీకు గౌరవం లభించాలంటే గౌరవించి తీరాలి.
Also Read: Top Management Institutes: భారత్‌లోని టాప్ 10 మేనేజ్‌మెంట్ విద్యాసంస్థలు ఇవీ
6. అభిప్రాయాలు స్వీకరించాలి
మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలపై ఇతరులు ఇచ్చే అభిప్రాయాలను స్వీకరించాలి. ఏ అంశంలో మెరుగుపడాలో గుర్తించి చెబితే దానిని మనస్ఫూర్తిగా స్వీకరించి మీ కమ్యూనికేషన్ లో మార్పులు చేసుకోవాలి.
7. ఆత్మవిశ్వాసం
ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆత్మవిశ్వాసాన్ని కనబరచాలి. గంభీరంగా ఉండాలి. అలాంటి పదాలే వాడాలి. ఆత్మవిశ్వాసంతో మాట్లాడే భాష ఎదుటివారిపై మంచి ప్రభావాన్ని చూపిస్తుంది.
8. నాన్-వర్బల్ కమ్యూనికేషన్
ముఖ కవళికలు, వాయిస్ లో తేడాలు చాలా ముఖ్యం. మీరేం మాట్లాడుతున్నారో ఆ సందర్భానికి తగ్గ ముఖ కవళికలు ఉండాలి. అలాగే వాయిస్ లో తేడా చూపించాలి.
9. ఎంపథీ కనబరచాలి
ఎంపథీ చూపించడం కూడా కమ్యూనికేషన్ స్కిల్ లో భాగమే. మీ మనసులోని భావాలను మీ కమ్యూనికేషన్ లో చెప్పగలగాలి. సానుభూతి చూపించేటప్పుడు మాటలతో పాటు చేతలతో మీ భావాలను వ్యక్తీకరించాలి.
10. ప్రాక్టీస్.. ప్రాక్టీస్.. ప్రాక్టీస్..
ఎంత ఎక్కువగా కమ్యూనికేట్ చేస్తే అంత ఎక్కువగా మెరుగుపడతారు. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్ ను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉండాలి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial