News
News
X

Hyderabad Crime: అద్దె ఇంటి కోసం వచ్చి చైన్ స్నాచింగ్, గుడి నుంచి ఫాలో అయ్యి చివరి నిమిషంలో ట్విస్ట్

అద్దె ఇంటి కోసం వెతుకున్నట్లుగా వచ్చి చైన్ స్నాచింగ్ చేసిన ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని నిజాంపేట్ లో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

FOLLOW US: 
Share:

అద్దె ఇంటి కోసం తిరుగుతున్నట్లు నటించిన యువకుడు చైన్ చోరీ చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని నిజాంపేటలో జరిగింది. అద్దె ఇంటి కోసం వెతుకున్నట్లుగా వచ్చి చైన్ స్నాచింగ్ చేసిన ఘటన నిజాంపేట్ లో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసుల సీసీ ఫుటేజీ సేకరించారు. నిందితుడ్ని త్వరలోనే అరెస్ట్ చేశామన్నారు. అయితే ఒంటరి మహిళలు కొంచెం జాగ్రత్తగా ఉండాలని, ఎవరైనా అనుమానంగా తిరుగుతుంటే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. 
అసలేం జరిగిందంటే..
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని బాచుపల్లి పియస్ పరిధి నిజాంపేట్ లో శ్రీనివాస్ కాలనీకి చెందిన స్వర్ణలత(62) స్థానికంగా గుడికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నారు. ఓ వ్యక్తి ఆమెకు ఎదురుపడి అద్దె ఇంటి విషయమై చర్చించాడు. దాంతో ఆ మహిళ ఇల్లు అద్దెకు లేదని చెప్పినా వినకుండా ఆమెను ఫాలో అవుతూ ఇంటివరకు వచ్చాడు నిందితుడు. 
లిఫ్ట్ లోకి వెళ్లగానే చైన్ చోరీ..
ఆ పెద్దావిడ తాను నివాసం ఉంటున్న బాలాజీ రెసిడెన్సీలోని లిఫ్ట్ లోపలికి రాగానే వెంటనే నిందితుడు లిఫ్ట్ గ్రిల్ ఓపెన్ చేసి ఆమె మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు గొలుసును లాక్కెళ్లాడు. బాధితురాలు బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీలను పరిశీలిస్తున్నారు.

పోలీసులు ఏమన్నారంటే..
స్వర్ణలత అనే 62 ఏళ్ల మహిళ సాయిబాబా గుడికి వెళ్లారు. పూజలు పూర్తయిన తరువాత ఇంటికి వెళ్తుంటే, గుడిలో పరిచయం చేసుకున్న నిందితుడు ఆమెను అద్దె ఇల్లు గురించి వాకబు చేశాడు. తమ అపార్ట్ మెంట్లో అద్దె ఇల్లు లేదని చెప్పినా అతడు వినిపించుకోలేదు. ఆమెను ఫాలో అవుతూ ఇంటికి వెళ్లాడు. ఆమె లిఫ్ట్ ఎక్కిన తరువాత నిందితుడు గ్రిల్స్ ఓపెన్ చేసి మహిళ మెడలోని బంగారు చైన్ ను బలవంతంగా లాక్కెళ్లాడని పోలీసులు తెలిపారు. రెండు మూడు ఇళ్లల్లోకి వెళ్లి, అనంతరం అక్కడి నుంచి నిందితుడు పరారయ్యారని పోలీసులు వెల్లడించారు.

గుడికి వస్తే భక్తుడు అనుకున్నానని బాధితురాలు స్వర్ణలత తెలిపారు. తన స్నేహితురాలు వెళ్లిపోగా, తాను ఇంటికి వెళ్తుండగా అద్దె ఇల్లు ఉంటే చెప్పాలని తనను నిందితుడు అడిగినట్లు చెప్పారు. ఖాళీ ఇల్లులు లేవని చెప్పినా అతడు వినలేదని, తనను ఫాలో అయ్యాడని చెప్పారు. తీరా అపార్ట్ మెంట్ కు చేరుకున్నాక లిఫ్ట్ ఎక్కి ఒక్క డోర్ క్లోజ్ చేశాక, నిందితుడు డోర్ ఓపెన్ చేసి తన మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు చైన్ లాక్కెళ్లాడని చెప్పి ఆమె వాపోయారు.

వరంగల్‌లో ఇదే తరహాలో.. 
వరంగల్ : చైన్ స్నాచింగ్ కు పాల్పడిన దొంగతో పాటు, ఈ కేసు సంబంధం ఉన్న మరో ఇద్దరు నిందితులను ఐనవోలు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఐనవోలు దేవాలయం పరిసర ప్రాంతంలో ఈ చైన్ చోరీ జరిగిందని పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన నిందితుల వద్ద నుంచి 40 గ్రాముల బంగారు ఆభరణంతో పాటు లక్ష ఎనభైవేల రూపాయల నగదు ఒక ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

ఈ అరెస్టు సంబంధించి ఈస్ట్ జోన్ డీసీపీ కరుణాకర్ వివరాలను వెల్లడించారు. వరంగల్ జిల్లాలోని గీసుగొండ మండలం, వంచనగిరి ప్రాంతానికి చెందిన నిందితుడు ఎల్లబోయిన హరీష్ ఈ నెల 21వ తేదిన యాదాద్రి జిల్లా బీబీనగర్ ప్రాంతానికి చెందిన గండు వసంత అనే మహిళ  చెల్లించుకోనేందుకుగాను ఐనవోలు జాతరలో ఎల్లమ్మగుడి వద్ద బోనం ఎత్తుకోనే సమయంలో సదరు మహిళ మెడలోని బంగారు పుస్తెల తాడును చోరీ చేసాడు. ఈ చోరీపై ఫిర్యాదు నమోదు చేసుకున్న ఐనవోలు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Published at : 31 Jan 2023 09:09 PM (IST) Tags: Crime News Medchal malkajgiri Woman Gold Chain Chain Snatching Hyderebad Bachupally Police Station

సంబంధిత కథనాలు

Mulugu District: మావోయిస్ట్ పార్టీకి చెందిన 8 మంది కొరియర్ లు అరెస్ట్

Mulugu District: మావోయిస్ట్ పార్టీకి చెందిన 8 మంది కొరియర్ లు అరెస్ట్

Mlc Kavitha :ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ, రేపు మళ్లీ రావాలని నోటీసులు

Mlc Kavitha :ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ, రేపు మళ్లీ రావాలని నోటీసులు

Gudivada News : గుడివాడలో పోలీస్ వర్సెస్ వీఆర్వో- చేయి కొరికిన వీఆర్వో, చెంపపై కొట్టిన లేడీ కానిస్టేబుల్

Gudivada News : గుడివాడలో పోలీస్ వర్సెస్ వీఆర్వో- చేయి కొరికిన వీఆర్వో, చెంపపై కొట్టిన లేడీ కానిస్టేబుల్

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు - తీహార్ జైలుకు రామచంద్ర పిళ్లై తరలింపు! 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు - తీహార్ జైలుకు రామచంద్ర పిళ్లై తరలింపు! 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ

Students Bike Stunts : ఇన్ స్టా రీల్స్ కోసం నడిరోడ్డుపై బైక్ స్టంట్స్, అరెస్టు చేసిన పోలీసులు!

Students Bike Stunts : ఇన్ స్టా రీల్స్ కోసం నడిరోడ్డుపై బైక్ స్టంట్స్, అరెస్టు చేసిన పోలీసులు!

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్