Crime News: ఆర్టీసీ బస్సులో ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య, తోటి ప్రయాణికులు షాక్
Tirupati Crime News | తిరుపతి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సులోనే ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Youth commits suicide in RTC bus | శ్రీకాళహస్తి: ఈ మధ్య కాలంలో ప్రతి చిన్న విషయానికి యువతతో పాటు పెద్దవారు సైతం తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయనో, ఫెయిల్ అయ్యామనో, లేక అడిగిన ఫోన్ కొనివ్వలేదని, బైక్ కొనివ్వలేదంటూ ఆత్మహత్యలు చేసుకున్నట్లు వార్తలు చదువుతుంటాం. కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకి కొందరు, హాస్టల్ గదిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంటున్నారు. తిరుపతి జిల్లాలో విచిత్రంగా ఆర్టీసీ బస్సులోనే ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.
అసలేం జరిగిందంటే..
తిరుపతి - శ్రీకాళహస్తి ఆర్టీసీ ఆర్డినరీ సర్వీసు బస్సు వెళ్తోంది. ఈ క్రమంలో మేర్లపాక స్టేజీ వద్ద ఓ యువకుడు ఆదివారం తెల్లవారుజామున ఆ ఆర్టీసీ బస్సు ఎక్కాడు. మేర్లపాక నుంచి టికెట్ తీసుకున్నాడు. ఆ సమయంలో బస్సులో కేవలం ముగ్గురు ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ యువకుడు ఆర్టీసీ బస్సులో వెనుక సీట్ల వైపునకు వెళ్లి కూర్చున్నాడు. తరువాత కాసేపటికి గమనించగా ఆ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. బస్సులో ప్రయాణికులు తక్కువగా ఉండటం, వారంతా ముందు వైపు సీట్లో కూర్చోవడంతో యువకుడు వెనుక సీట్ల వద్ద హ్యాంగర్‌కు వెంట తెచ్చుకున్న తాడుతో ఉరివేసుకుని బలవన్మరణం చెందాడని ప్రయాణికులు తెలిపినట్లు రేణిగుంట పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. యువకుడు ఎవరు, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

