అన్వేషించండి

Horse Riding: ప్రాణం మీదకు తెచ్చిన సంప్రదాయం - గుర్రపు స్వారీ చేస్తూ యువకుడు మృతి

Kurnool News: పూర్వీకుల సంప్రదాయం ప్రకారం ఓ యువకుడు గుర్రపు స్వారీ నేర్చుకుంటుండగా అదుపు తప్పి కింద పడి మృతి చెందాడు. కర్నూలు జిల్లా మద్దికెర మండలంలో ఈ ఘటన జరిగింది.

Young Man Died While Horse Riding: పూర్వీకుల నుంచి వస్తోన్న సంప్రదాయం కొనసాగించాలన్న ఆ యువకుడు భావించాడు. ఈ క్రమంలో గుర్రపు స్వారీ చేస్తుండగా అదుపు తప్పి కింద పడి మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా (Kurnool District) మద్దికెర (Maddikera) మండలానికి చెందిన పృథ్వీరాజ్ రాయుడు అనే యువకుడు పూర్వీకుల సంప్రదాయం ప్రకారం గుర్రపు స్వారీ (Horse Riding) నేర్చుకునేందుకు సిద్ధమయ్యాడు. మద్దికెరలో దసరా ఉత్సవాల్లో గుర్రంపై ఊరేగడం వారి కుటుంబ సంప్రదాయం. ఈ క్రమంలో యువకుడు గుర్రం ఎక్కి ప్రాక్టీస్ చేస్తుండగా.. అది పరుగులు తీసింది. పృథ్వీరాజ్ స్వారీ చేస్తుండగా వెనుక నుంచి కొందరు యువకులు అదుపు చేసేందుకు యత్నించినా గుర్రం నిలవలేదు. దీంతో అదుపు తప్పి కింద పడి యువకునికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

గేట్ జారి పడి

అటు, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడిలో ఆదివారం తీవ్ర విషాదం జరిగింది. కాలువ గేట్ జారి పడి ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మంగారావు, రాజేశ్వరి దంపతుల కుమారుడు తొడిమిల విజయ శ్రీహర్ష (14) స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం కావడంతో కొండూరు కాలువ వద్దకు ఆడుకునేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో గేటు కింద నుంచి అటు ఇటు తిరుగుతుండగా.. అది ప్రమాదవశాత్తు కదిలి కిందకు జారడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వీరు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

Also Read: Boat Accident: గోదావరిలో పడవ బోల్తా - ఒకరు గల్లంతు, బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Adilabad Crime News: ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
Live Murder in Hyderabad: నాగోల్‌లో రౌడీషీటర్ దారుణహత్య.. అంతా చూస్తుండగానే స్నేహితుడి గ్యాంగ్ అరాచకం! నిందితుల అరెస్ట్
నాగోల్‌లో రౌడీషీటర్ దారుణహత్య.. అంతా చూస్తుండగానే స్నేహితుడి గ్యాంగ్ అరాచకం! నిందితుల అరెస్ట్
Pulivendula Firing: పులివెందులలో అర్ధరాత్రి కాల్పుల కలకలం.. రాళ్లదాడిలో వాహనాలు ధ్వంసం
పులివెందులలో అర్ధరాత్రి కాల్పుల కలకలం.. రాళ్లదాడిలో వాహనాలు ధ్వంసం
Hyderabad Crime News: అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు
అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral News: విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
గత నెలలో ప్రజలు ఈ కార్ల కోసమే షోరూమ్‌ల ముందు క్యూ కట్టారు.. టాప్‌-10 కార్ల లిస్ట్‌
ఆగస్టులో దేశవ్యాప్తంగా ఈ కార్లకు ఫుల్ డిమాండ్.. టాప్‌-10 బెస్ట్‌ సెల్లింగ్‌ లిస్ట్‌ మీ కోసం
Navya Swamy: ఫ్యామిలీతో నవ్య స్వామి వినాయక చవితి సెలబ్రేషన్స్... వైరల్ ఫోటోలు
ఫ్యామిలీతో నవ్య స్వామి వినాయక చవితి సెలబ్రేషన్స్... వైరల్ ఫోటోలు
Telangana Congress new AICC incharge: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
NTR Bharosa Pensions: గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
Embed widget