Hyderabad News: రీల్స్ మోజులో వర్షంలో బైక్ స్టంట్ - యువకుడు మృతి, మరో యువకునికి గాయాలు
Telangana News: ఇద్దరు యువకులు వర్షంలోనూ బైక్‌పై స్టంట్ వేశారు. ప్రమాదవశాత్తు బైక్ అదుపు తప్పి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పరిధిలో జరిగింది.
Young Man Died With Bike Stunt: రీల్స్ మోజులో పడి కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. భారీ వర్షంలోనూ బైక్‌తో స్టంట్స్ చేయగా.. ప్రమాదవశాత్తు బైక్ అదుపు తప్పి ఓ యువకుడు మృతి చెందాడు. మరో యువకునికి గాయాలయ్యాయి. ఈ ఘటన రంగారెడ్డి (Rangareddy) జిల్లా హయత్ నగర్ (Hayathnagar) పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం జరిగింది. పెద్ద అంబర్‌పేట్ సమీపంలో నిత్యం రద్దీగా ఉండే విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై ఇద్దరు యువకులు రీల్స్ మోజులో పడి బైక్‌తో స్టంట్ చేశారు. బైక్‌ను సింగిల్ వీల్‌పై నడుపుతూ హల్‌చల్ చేశారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు బైక్ అదుపు తప్పగా శివ అనే యువకుడు మృతి చెందాడు. బైక్ డ్రైవింగ్ చేసిన యువకునికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే బాధితున్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు.
లోయలో పడిన కారు
మరోవైపు, నిర్మల్ సమీపంలో ఓ కారు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు మహబూబ్ ఘాట్ రెండో సెక్షన్‌లో కారు అదుపు తప్పి లోయలో పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఉన్న రాధాకృష్ణ ఆయన భార్య, కుమారుడిని కాపాడారు. ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా వారిని నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Also Read: Secunderabad News: భార్య, 10 నెలల బిడ్డను చంపేసిన భర్త! పోలీసులకు ఫోన్ - అనంతరం మరో ఘోరం!