Palnadu: నా భార్యను బలవంతంగా తీసుకెళ్లారు - ప్రేమ వివాహం చేసుకున్న యువకుడి ఆవేదన, సెల్ టవర్ ఎక్కి హల్చల్
Cell Tower: పల్నాడు జిల్లా క్రోసూరులో ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. ఇటీవల ప్రేమ వివాహం చేసుకోగా తన భార్యను అత్తింటి వారు తీసుకెళ్లిపోయారని ఆరోపించాడు.
Youth Climbed Cell Tower In Palnadu: తన భార్యను అత్తింటి వారు బలవంతంగా తీసుకెళ్లారని ఆరోపిస్తూ ఓ యువకుడు హల్చల్ చేశాడు. సెల్ టవర్ ఎక్కి తనకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేశాడు. ఈ ఘటన పల్నాడు జిల్లా (Palnadu District) క్రోసూరు మండలం కేంద్రంలో శనివారం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. క్రోసూరు (Krosuru) గ్రామానికి చెందిన షేక్ మస్తాన్ వలి (22), సిరిపురం గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి పెద్దలకు తెలియకుండా వివాహం చేసుకున్నాడు. అదే గ్రామంలో యువతితో కలిసి జీవిస్తున్నాడు. ఈ క్రమంలో యువతి తల్లిదండ్రులు తనను బెదిరించి తన భార్యను తీసుకెళ్లిపోయారని యువకుడు ఆరోపించాడు. దీంతో మనస్తాపానికి గురై శనివారం సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువకుని నచ్చచెప్పేందుకు యత్నించారు. ఫైర్ సిబ్బంది అతన్ని కిందకు దించేందుకు చర్యలు చేపట్టారు. అయితే, డీఎస్పీ హామీ ఇస్తే కానీ తాను కిందకు దిగనని యువకుడు పట్టుబట్టాడు.
Also Read: Ganja Cultivation: నగరం నడిబొడ్డున గంజాయి సాగు - నేవీ పరిధిలో ఉన్న ప్రాంతంలోనే పండించేస్తున్నారు