Crime News: కోతులు భయపెట్టడంతో మహిళ మృతి, నిర్మల్ జిల్లాలో విషాదం
Telangana News | నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో కోతుల బెడద ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో కోతులు తనపై దాడి చేస్తాయన్న భయంతో ఓ మహిళ వాటి నుంచి తప్పించుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయింది.
Woman dies with fear of monkey attack at Khanapur in Nirmal District | ఖానాపూర్: కోతులు భయపెట్టడంతో కిందపడి ఓ మహిళ తలకు తీవ్ర గాయాలై చనిపోయిన ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో చోటుచేసుకుంది.
కోతులు దాడి చేస్తాయన్న భయంతో మహిళ పరుగులు
వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని విద్యానగర్ కాలనికి చెందిన బొంగోని లక్మి (52) ఇంటి ముందు కూర్చొని ఉంది. అటుగా వచ్చిన కోతులు మహిళను సమీపించడంతో భయపడి పరుగెత్తే ప్రయత్నం చేసింది. దీంతో కింద పడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే హుటాహుటిగా స్తానిక హాస్పిటల్ కు తరలించారు. హాస్పిటల్లో ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందిందని వెల్లడించారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఆవేదనతో కన్నీటి పర్యంతమయ్యారు.
కోతుల సమస్య తీర్చాలని స్థానికుల వినతి
కోతి వల్ల కిందపడి ఆమె మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. కోతి తమనపై దాడి చేస్తుందేమోనన్న భయం వల్ల ఆమె చనిపోయిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఖానాపూర్ పట్టణంలో గత కొన్ని రోజులుగా కోతులు అందరిపై స్వైర విహారం చేస్తున్నాయని, ఎంతోమంది కోతుల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కోతుల కాటుల వల్ల సైతం తీవ్ర ఇబ్బందులు పడి ఆసుపత్రుల పాలవుతున్నారని, ఖానాపూర్ మున్సిపల్ అధికారులు ఇకనైనా ఈ ఘటనను చూసి కోతులను అదుపు చేయాలని ప్రజల ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు షాక్, వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లు