Casino Case : కేసినో కేసులో ఎమ్మెల్యేలు, సినీ తారలు ! ఈడీ గుట్టు విప్పితే సంచలనాలే !
కేసినో నిర్వాహకులపై ఈడీ జరిపిన దాడుల తర్వాత అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎమ్మెల్యేలు, సినీ తారలు చీకోటి ప్రవీణ్ ఖాతాదారుల్లో ఉన్నారని చెబుతున్నారు.
Canino Case : తెలుగు రాష్ట్రాల్లో చికోటి ప్రవీణ్ క్యాసినో కేసు తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. కేసినో ముసుగులో అత్యధికంగా హవాలా వ్యాపారం జరుగుతోందని ఈడీ అనుమానిస్తోంది. హవాలా ద్వారా అక్రమంగా కోట్లాది రూపాయాలు దేశం సరిహద్దులు దాటించడం, విదేశాల నుండి ఇండియాకు అడ్డదారిలో రప్పించడం ఇలా అక్రమార్గంలో క్యాసినో ఆడిస్తున్నారని చికోటి ప్రవీణ్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ కేసులో తీగ లాగితే పొలిటికల్ డొంక కదులుతున్నట్లుగా పదహారు మంది ఎమ్మెల్యేలు కేసినో కస్టమర్ల జాబితాలో ఉన్నట్లుగా ప్రచార జరుగుతోంది.
ప్రవీణ్ కస్టమర్లలో 16 మంది ఎమ్మెల్యేలు !
పేకాట శిబిరాలు, కేసినోలను ఏర్పాటు చేయడంలో దిట్టగా మారిన చీకోటి ప్రవీణ్ ఖాతాదారుల్ోల తెలుగు రాష్ట్రాలకు చెందిన పదహారు మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా తెలస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలని చెబుతున్నారు. అయితే వారి పేర్లేమిటో ఇంకా బయటకు రాలేదు. ప్రధాన నిందితులు చికోటి ప్రవీణ్, మాధవరెడ్డి ఇళ్లలో 20గంటలకు పైగా సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలు, ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు. సోమవారం ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు.
చెన్నై నగల వ్యాపారులకూ హవాలా ఎజెంట్‌గా చీకోటి !
ఇలా కేసులో విచారణ వేగవంతంగా జరుగుతున్న తరుణంలో తాజాగా క్యాసినో వ్యవహారంలో 16 మంది ఎమ్మెల్యేలకు సంబంధాలున్నాయనే వార్త చక్కర్లు కొడుతోంది. అంతేకాదు నలుగురు వ్యక్తులు కోట్లాది రూపాయల హవాలా లావాదేవీలలో చికోటి ప్రవీణ్ కు సహకరించారనే వార్తలు వినిపిస్తున్నాయి. చెన్నైకు చెందిన ప్రముఖ జ్యూవలరీ సంస్ద యజమాని సైతం ఈ క్యాసినో వ్యవహారంలో చికోటి ప్రవీణ్ తో చేతులు కలపినట్లుగా తెలుస్తోంది.తెలుగు రాష్ట్రాల్లో పేరుపొందిన మరో జ్యూవలరీ సంస్ద యజమాని పేరుసైతం ఈ కేసులో ప్రధానంగా వినిపిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
కేసినో.. హవాలాల్లో రాజకీయ నేతలే కీలకమా ?
చికోటి ప్రవీణ్ ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ అదీ మంత్రి మల్లారెడ్డికి చెందినదిగా ఈడీ అధికారులు గుర్తించారు. ఈ వార్త బయటకు రావడంతో మంత్రికి ఈ కేసులో ప్రమేయం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపధ్యంలో ,మల్లారెడ్డి స్పందించారు.. ఎమ్మెల్యే స్టిక్కర్ నాదే కానీ, ఆరునెలల క్రితం బయటపడేస్తే తీసుకున్నారోమో అంటూ మీడియాతో మాట్లడిన తీరు కొంత గందరగోళానికి తావిస్తోంది. మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే స్టిక్కర్ మాధవరెడ్డికే దొరకాలా.. ఇదేదో సినిమా స్టోరీని దగ్గరగా ఉందనే విమర్మలు వెల్లువెత్తుతున్నాయి.గతంలో గుడివాడలో ఏకంగా అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే క్యాసినో ఆడించాడనే ఆరోపణలు అప్పట్లో బలంగా వినిపించాయి.
వివాదంలోకి సినీ తారలు కూడా !
ప్రముఖ సినీ తారల పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్ తారలతో గానాబజానా ఏర్పాటు చేశారని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు చెమటలు పట్టిస్తున్నాయట.ఎమ్మెల్యేలు ఏ పార్టీలకు చెందిన వారు.. మొత్తం ఒకే రాజకీయ పార్టీకి చెందిన వారా.. లేక అన్ని పార్టీలకు ఈ క్యాసినోలో ప్రమేయం ఉందా.. ఒకవేళ వారి ప్రమేయం లేకుంటే సరే ...ఉంటే అధికార పార్టీ పేర్లను ఈడీ బహిర్గతం చేస్తుందా..చేస్తే ఆయా పార్టీలకు క్యాసినో మచ్చ తప్పదు. ఇతరపార్టీలకు టార్గెట్ అవ్వక తప్పదు.