Watch Video: నన్నే చూసి మొరుగుతావా అంటూ మూగజీవిపై ప్రతాపం-ఇనుప రాడ్డుతో దాడి
తనను చూసి పక్కింటి కుక్క మొరిగిందన్న కోపంతో దిల్లీలోని వ్యక్తి ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. అడ్డొచ్చిన యజమానినీ గాయపరిచాడు.
కుక్కపై ఇనుప రాడ్డుతో విచణక్షారహితంగా దాడి
ఇరుగు పొరుగు వాళ్లు గొడవ పడటం చాలా సహజం. కానీ ఒక్కోసారి ఆ గొడవలకు కారణాలేంటని చూస్తే చాలా సిల్లీగా అనిపిస్తాయి. కొన్నిసార్లు ఇవే తీవ్రమై ప్రాణాలు పోయేంత వరకూ వెళ్తాయి. దిల్లీలోని జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ. పక్కింటి కుక్క పదేపదే మొరుగుతోందన్న ఒకే ఒక కారణంతో ఇనుప రాడ్డుతో దానిపై దాడి చేశాడు ఓ వ్యక్తి. వద్దని యజమాని వారించినందుకు, ఆయననూ ఆ రాడ్డుతోనే విచక్షణారహితంగా కొట్టాడు. దిల్లీలోని పశ్చిమ్ విహార్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది. కేవలం తనను చూసి కుక్క మొరిగిందన్న కోపంతో ఇలా దాడి చేశాడు దుండగుడు. ఈ ఘటనలో కుక్క తీవ్రంగా గాయపడగా, యజమానికి కూడా గాయాలయ్యాయి. ముందు కుక్కపై రాడ్డుతో గట్టిగా కొట్టాడు. వద్దని అడ్డుగా వెళ్లినందుకు పెద్దాయననీ గాయపరిచాడు. మరో ఇద్దరికీ ఈ ఘటనలో గాయాలయ్యాయి.
ఈ దాడికి సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియోని ఆధారంగా చేసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీతో పాటు ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాల్టీ టు యానిమల్స్ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టనున్నారు. గాయపడ్డ వ్యక్తి ప్రస్తుతానికి చికిత్స పొందుతున్నాడు.
Day light violence in Delhi paschim vihar A4 block.
— Mohit Mohlia (@MohitMohlia) July 3, 2022
This man attacked multiple people including a woman and a dog @narendramodi @DelhiPolice @CPDelhi @PMOIndia @ArvindKejriwal @AamAadmiParty @BJP4India @peta #AnimalAbuse #Attack #attempttomurder @ndtvvideos @ndtvindia pic.twitter.com/tsusXkZCDA
Delhi |A man injured 3 members of a family in his neighbourhood in Paschim Vihar by hitting them with an iron rod allegedly after their pet dog barked at him. He also hit the dog & injured it
— ANI (@ANI) July 4, 2022
Dog's owner says they filed complaint,FIR yet to be registered. Injured under treatment pic.twitter.com/Do0j4QmMVR
#UPDATE | On the statement of Rakshit (owner of the dog), a case registered under various sections of IPC and Prevention of Cruelty to Animals Act registered at Paschim Vihar East Police Station. Investigation of the case is in progress and facts are being verified: Delhi Police
— ANI (@ANI) July 4, 2022