అన్వేషించండి

Two Headed Snake: 2 పాములతో రూ.25 కోట్లు సంపాదించేద్దామనుకున్నారు - కానీ దొరికిపోయారు - ఏకంగా డీఆర్ఐనే..!

DRI Decoy Operation: వరంగల్ నగరంలో రెండు తలల పాములను స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. ఈ పాముల విలువ కోట్లలో ఉంటుందని భావిస్తున్నారు.

Snake Smuggling Warangal:  వరంగల్ నగరంలో రెండు తలల పాము  రెడ్ సాండ్ బోవా  అక్రమ రవాణా గుట్టును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్  అధికారులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. గ్రే మార్కెట్‌లో కోట్లాది రూపాయల విలువ చేసే ఈ అరుదైన పాములను విక్రయించేందుకు ఒక ముఠా ప్రయత్నిస్తోందన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు, ఒక సినిమా ఫక్కీలో డెకాయ్ ఆపరేషన్  నిర్వహించి నిందితుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.                          

నిందితుడు రెండు సజీవమైన ఇండియన్ రెడ్ సాండ్ బోవా (Eryx johnii) పాములను బ్యాగ్‌లో దాచుకుని కస్టమర్ల కోసం ఎదురుచూస్తున్న సమయంలో అధికారులు దాడి చేశారు. ఈ పాములకు అంతర్జాతీయ బ్లాక్ మార్కెట్‌లో కళ్లు చెదిరే ధర పలుకుతోంది. ఒక్కో పాము నాణ్యత, బరువును బట్టి సుమారు రూ. 2 కోట్ల నుండి రూ. 25 కోట్ల వరకు విక్రయిస్తారని సమాచారం. కేవలం అక్రమ సంపాదన కోసమే ఈ అరుదైన జీవులను వేటాడుతున్నట్లు విచారణలో తేలింది.                           

ఈ పాములకు గ్రే మార్కెట్‌లో ఇంత భారీ ధర పలకడానికి ప్రధాన కారణం మూఢనమ్మకాలే. వీటితో క్షుద్ర పూజలు చేస్తే అదృష్టం వస్తుందని, అపారమైన గుప్త నిధులు లభిస్తాయని కొందరు నమ్ముతుంటారు. వీటితో పాటు కొన్ని రకాల ఆయుర్వేద మందుల తయారీలోనూ, లైంగిక పటుత్వానికి సంబంధించిన ఔషధాలలోనూ వీటిని ఉపయోగిస్తారన్న ప్రచారం ఉండటంతో అంతర్జాతీయ స్థాయిలో వీటికి విపరీతమైన గిరాకీ ఏర్పడింది.                          

నిజానికి వీటికి రెండు తలలు ఉండవు. వీటి తోక భాగం కూడా తల ఆకారంలో మొద్దుబారి ఉండటంతో వీటిని  రెండు తలల పాములు  అని పిలుస్తారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం వీటిని పట్టుకోవడం, విక్రయించడం తీవ్రమైన నేరం. ఈ అక్రమ రవాణా వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అరుదైన జీవజాతులను  స్మగ్లింగ్   ముఠా మూలాలను వెతకడంపై ఇప్పుడు దృష్టి సారించారు.

ఆపరేషన్ విజయవంతం కావడంతో స్వాధీనం చేసుకున్న పాములను, ప్యాకింగ్ సామగ్రిని,  నిందితుడిని తదుపరి చర్యల కోసం వరంగల్ ఫారెస్ట్ రేంజ్ అధికారులకు అప్పగించారు. ఈ రకమైన అక్రమ విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. వన్యప్రాణుల రక్షణలో ప్రజలు కూడా సహకరించాలని, అక్రమ రవాణాపై సమాచారం ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలని కోరారు.                  

టాప్ హెడ్ లైన్స్

Shivasattu Murder: చౌటుప్పల్‌లో దారుణం.. శివసత్తు సుధాకర్ స్వామి దారుణ హత్య.. అసోం నిందితుల అరెస్ట్!
చౌటుప్పల్‌లో దారుణం.. శివసత్తు సుధాకర్ స్వామి దారుణ హత్య.. అసోం నిందితుల అరెస్ట్!
Raptadu Girl Attack Case: రాప్తాడు ఘటన నిందితుడిపై పోలీసులు 6 రౌండ్ల కాల్పులు! అసలేం జరిగింది.. 
రాప్తాడు ఘటన నిందితుడిపై పోలీసులు 6 రౌండ్ల కాల్పులు! అసలేం జరిగింది.. 
Raptadu Attack Case: రాప్తాడు స్కూళ్లో దాడి కేసులో సంచలన నిజాలు.. పోలీసుల అదుపులో నిందితుడు
రాప్తాడు స్కూళ్లో దాడి కేసులో సంచలన నిజాలు.. పోలీసుల అదుపులో నిందితుడు
Raptadu Crime News: రాప్తాడు జెడ్పీ స్కూల్లో దారుణం- టెన్త్ విద్యార్థినిపై రంపంతో దాడి.. తెగిన చెయ్యి, తీవ్ర గాయాలు
రాప్తాడు జెడ్పీ స్కూల్లో దారుణం- టెన్త్ విద్యార్థినిపై రంపంతో దాడి.. తెగిన చెయ్యి, తీవ్ర గాయాలు

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Musuru Helpline Numbers: ఏపీకి తుపాను ముప్పు.. మనమిత్ర వాట్సాప్ సహా జిల్లాలవారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు
ఏపీకి తుపాను ముప్పు.. మనమిత్ర వాట్సాప్ సహా జిల్లాలవారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు
Amit Shah Telangana BJP Padayatra: తెలంగాణపై అమిత్ షా కన్ను - హైదరాబాద్ పాదయాత్రతో బీజేపీ గేర్ మార్చబోతుందా?
తెలంగాణపై అమిత్ షా కన్ను - హైదరాబాద్ పాదయాత్రతో బీజేపీ గేర్ మార్చబోతుందా?
Raptadu Girl Attack Case: రాప్తాడు దాడి నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం? బుల్లెట్లు దిగడంతో పరిస్థితి విషమం
రాప్తాడు దాడి నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం? బుల్లెట్లు దిగడంతో పరిస్థితి విషమం
School Holidays: మురసు తుపాను ఎఫెక్ట్.. ఏపీలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
మురసు తుపాను ఎఫెక్ట్.. ఏపీలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
Royal Enfield Himalayan 750 వచ్చేస్తోంది.. క్రూజ్‌ కంట్రోల్‌, TPMS సహా అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైకుల్లో హైయెస్ట్‌ పవర్‌ ఉన్న బండి.. హిమాలయన్ 750 ఫీచర్లు రివీల్!
Ranabaali OTT : రణబాలి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - విరోష్ కపుల్ కొత్త మూవీ స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
రణబాలి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - విరోష్ కపుల్ కొత్త మూవీ స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Upcoming Cars: ఈ నెలలో రాబోతున్న 4 కార్లు.. లగ్జరీ EVల నుంచి తొలి 'ఫ్లెక్స్ ఫ్యూయల్ హైబ్రిడ్' వరకు!
ఈ నెలలో లాంచ్‌ కానున్న 4 కొత్త కార్లు.. ఒక్కో కారుది ఒక్కో ప్రత్యేకత
Temple Wearable Device : స్మార్ట్‌వాచ్, ఫిట్‌నెస్ బ్యాండ్‌ కంటే టెంపుల్ ఎందుకు డిఫరెంట్? ఇది ఎలా పని చేస్తుంది?
స్మార్ట్‌వాచ్, ఫిట్‌నెస్ బ్యాండ్‌ కంటే టెంపుల్ ఎందుకు డిఫరెంట్? ఇది ఎలా పని చేస్తుంది?
Embed widget