అన్వేషించండి

Adhav Arjuna: పిల్లలకేమో ప్రభుత్వ ఇడ్లీ.. మంత్రిగారికేమో ప్రైవేట్ బ్రెడ్ జామ్! సోషల్ మీడియాకు చిక్కిన అధవ్ అర్జున

Adhav Arjuna: విద్యార్థులతో కలిసి అల్పాహారం తినడానికి వెళ్లారు తమిళ మంత్రి అధవ్ అర్జున. వారి ఆహారం ఎలా ఉందో చూడాలనుకున్నారు. కానీ అక్కడికి వెళ్లి ఆయన బ్రెడ్డు, జామ్‌ తిని ట్రోలిగ్‌కు గురవుతున్నారు.

Vijay Minister Trolled  Bread Jam Controversy: తమిళనాడు రాజకీయాల్లో  దళపతి  విజయ్ నేతృత్వంలోని టీవీకే సర్కార్ కొలువుదీరినప్పటి నుంచి ప్రతి రోజూ ఏదో ఒక అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతోంది. తాజాగా విజయ్ కేబినెట్‌లో అత్యంత కీలకమైన మంత్రి, వ్యూహకర్త అధవ్ అర్జున చేసిన ఒక పని నెటిజన్లకు చిక్కింది. ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులతో కలిసి అల్పాహారాన్ని ఆయన  బ్రెడ్డు, జామ్‌తో పూర్తి చేశారు.          
 
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆశయాలకు అనుగుణంగా మంత్రులంతా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ పథకాలను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి అధవ్ అర్జున ఒక ప్రభుత్వ పాఠశాలను సందర్శించి, అక్కడ విద్యార్థులకు అందిస్తున్న అల్పాహార పథకాన్ని తనిఖీ చేశారు. అయితే, అక్కడే అసలు కథ మొదలైంది. చిన్నారులందరూ ప్రభుత్వం వడ్డించిన అల్పాహారాన్ని ఎంతో ఇష్టంగా తింటుంటే, పక్కనే కూర్చున్న మంత్రి గారు మాత్రం తన వెంట తెచ్చుకున్న బ్రెడ్ అండ్ జామ్ ను ఆరగిస్తూ కెమెరాలకు చిక్కారు. ఈ  వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆయన్ను ఒక ఆట ఆడుకుంటున్నారు.  

 మా ప్రభుత్వం వండే ఆహారం అమృతం.. మా చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నాం అని స్టేజీల మీద చెప్పే మాటలకు, మంత్రి గారి చేతిలోని బ్రెడ్ ముక్కకు ఏమైనా సంబంధం ఉందా? అని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. "పిల్లలు తింటున్న ఆహారంపై మంత్రి గారికే నమ్మకం లేనప్పుడు, ఆ ఆహారం నాణ్యతపై ప్రజలకు నమ్మకం ఎలా కలుగుతుంది అంటూ సెటైర్లు వేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతను తనిఖీ చేయాల్సిన మంత్రే.. ఆ ఆహారాన్ని ముట్టకుండా తన సొంత డబ్బా తెచ్చుకోవడం చూస్తుంటే, ఆయనకు ప్రభుత్వ వంటకాలపై ఉన్న నమ్మకం  ఏపాటిదో అర్థమవుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ముఖ్యమంత్రి విజయ్ మొదటి నుంచీ తాను సామాన్యుడిని అని, ప్రజలతో కలిసి ఉండేవాడిని అని చెప్పుకుంటున్నారు. కానీ ఆయన కేబినెట్ మంత్రులు మాత్రం ఇలా విదేశీ డైట్ ఫాలో అవుతూ చిన్నారుల మధ్య కూర్చోవడం పార్టీ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తోంది. పిల్లలకి పెట్టిన ఉప్మాలో ఉప్పు లేదో ఏమో కానీ, మంత్రి గారి బ్రెడ్ మీద మాత్రం జామ్ అదిరిపోయింది అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 

రాజకీయాల్లో ఏ చిన్న పొరపాటు చేసినా అది భూతద్దంలో కనిపిస్తుందని అధవ్ అర్జున మరచిపోయినట్లున్నారు. ఆయన డైట్ ప్లాన్ ఏదైనా కావచ్చు, కానీ ఒక ప్రజా ప్రతినిధిగా ప్రభుత్వ పథకాన్ని ప్రోత్సహించాల్సిన సమయంలో ఇలాంటి చర్యలు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకెళ్తాయని టీవీకే క్యాడర్ ఆందోళన చెందుతోంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Shami Career End..!.: షమీ ఇంటర్నేషనల్ కంబ్యాక్ కి కంప్లీట్ చెక్.. 15 మంది యంగ్ పేసర్లతో బిసిసిఐ మైండ్ బ్లాకింగ్ ప్లాన్స్, సెలెక్టర్ల షాకింగ్ ట్విస్ట్!
షమీ ఇంటర్నేషనల్ కంబ్యాక్ కి కంప్లీట్ చెక్.. 15 మంది యంగ్ పేసర్లతో బిసిసిఐ మైండ్ బ్లాకింగ్ ప్లాన్స్, సెలెక్టర్ల షాకింగ్ ట్విస్ట్!
Ajinkya Rahane Retirement: టీమ్ ఇండియా వెటరన్ స్టార్ సంచలన నిర్ణయం.. అన్ని ఫార్మాట్లకు రహానే గుడ్ బై
టీమ్ ఇండియా వెటరన్ స్టార్ సంచలన నిర్ణయం.. అన్ని ఫార్మాట్లకు రహానే గుడ్ బై
ABP Desam Top 10, 30 July 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 30 July 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
CM Vijay Local Body Elections: స్థానిక పోరుకు సీఎం విజయ్ స్టాప్‌ బటన్ ! వెనక్కి తగ్గుతున్నారా? లేక క్యాడర్ బలాన్ని పెంచుకునే వ్యూహమా?
స్థానిక పోరుకు సీఎం విజయ్ స్టాప్‌ బటన్ ! వెనక్కి తగ్గుతున్నారా? లేక క్యాడర్ బలాన్ని పెంచుకునే వ్యూహమా?
Advertisement

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
US Iran War: ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
Adilabad Rains News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Commonwealth Games 2026: CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
Embed widget