News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Vizag Love Story: ఇంటర్ బాలికకు ఇద్దరు లవర్స్! ఒకరితో పెళ్లి, ఇంకొకరితో చనువు - ఇంతలో భారీ విషాదం!

ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న బాలిక ఒకరిని ప్రేమించి.. మరొకరిని వివాహం చేసుకున్న బాలిక.. తను చనిపోయి.. మరొకరి ప్రాణాలను బలిగొంది.

FOLLOW US: 
Share:

ముక్కోణపు ప్రేమ వ్యవహారంలో ఒక యువతి, యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విశాఖపట్నంలోని గోపాలపట్నంలో జరిగింది. గత మూడు రోజుల క్రితం జరిగిన యువతి ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు చేయగా ఈ కీలక విషయాలు తెలిశాయి. జీవీఎంసీ 89వ వార్డు నాగేంద్రకాలనీకి చెందిన షేక్ కరిస్మా(16) కుటుంబ సభ్యులతో నివాసముంటూ బుల్లయ్య కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఒకరిని ప్రేమించి.. మరొకరిని వివాహం చేసుకున్న బాలిక.. తను చనిపోయి.. మరొకరి ప్రాణాలను బలిగొంది. వివాహం చేసుకున్న యువకుడి జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చేసింది. 

గోపాలపట్నం పోలీసులు తెలిపిన వివరాలివీ.. నాగేంద్ర కాలనీకి చెందిన బాలిక (16) ఇటీవల గురువారం (ఆగస్టు 10) ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. దీనిపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టగా పలు ఆసక్తికర విషయాలు బయట పడ్డాయి. నగరంలోని ఓ కళాశాలలో ఇం టర్ చదువుతున్న బాలికకు పలువురు యువకులతో పరిచయాలు ఉన్నాయి. ఆదర్శ నగర్ కు చెందిన సీపాన సూర్యప్ర కాష్ రావుతో ప్రేమ వ్యవహారం నడిపిస్తూ.. ఇందిరానగర్ కు చెందిన లెంకా సాయి కుమార్ ను రహస్యంగా వివాహం చేసుకుంది. ఆమె, సూర్యప్రకాష్ చనువుగా ఉండడంతో అది సాయి కుమార్ కు నచ్చలేదు. అలాగే సాయికుమార్ తో చనువుగా వ్యవహరించడం సూర్య ప్రకాశ్ కు నచ్చలేదు. దీనితో ముగ్గురి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. 

బాలిక ఆత్మహత్యకు రెండు రోజుల ముందు ఆమె ఇంటికి ఇద్దరూ వేర్వేరు సమయాల్లో వచ్చారు. ఇద్దరిలో ఎవరితో ఉంటావో తేల్చుకోవాలని స్పష్టం చేశారు. దీంతో ఒత్తిడికి గురైన ఆమె.. ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి.. సూర్య ప్రకాష్, సాయికుమార్లపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. బాలికను ఒత్తిడికి గురి చేయడం వల్లే మరణించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ విషయం తెలిసి ఆందోళన చెందిన సూర్య ప్రకాష్ గోపాల పట్నం ఆర్డర్ క్యాబిన్ వద్ద శుక్రవారం రైలు కింద పడి మృతి చెందాడు. శనివారం మృతదేహాన్ని చూసిన అతని తల్లిదండ్రులు సూర్యప్రకాష్ గా గుర్తించారు. లంకా సాయి కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.

మృతురాలి తండ్రి గపూర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ ఇ.నరసింహారావు ఆధ్వర్యంలో ఎస్సై అప్పలనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని |శవపంచనామా కోసం కేజీహెచ్ కు తరలించారు.

Published at : 13 Aug 2023 11:36 AM (IST) Tags: Triangle love story girl suicide Vizag News VisakhaPatnam

ఇవి కూడా చూడండి

Suicide Blast: పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి, 52 మంది మృతి

Suicide Blast: పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి, 52 మంది మృతి

Online Betting Scam: ఆన్ లైన్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠా అరెస్ట్, యువకులు జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు 

Online Betting Scam: ఆన్ లైన్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠా అరెస్ట్, యువకులు జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు 

పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన యువతి, పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లి, సోదరుడు

పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన యువతి, పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లి, సోదరుడు

Cyber Crime: గణేష్‌ ఉత్సవాల లక్కీ డ్రాలో ఐఫోన్‌ 15-నమ్మితే అకౌంట్‌ ఖాళీ అయినట్టే

Cyber Crime: గణేష్‌ ఉత్సవాల లక్కీ డ్రాలో ఐఫోన్‌ 15-నమ్మితే అకౌంట్‌ ఖాళీ అయినట్టే

Hyderabad: హైదరాబాదులో వర్షం, నాలా లో పడి పారిశుద్ధ కార్మికురాలు మృతి

Hyderabad:  హైదరాబాదులో వర్షం, నాలా లో పడి పారిశుద్ధ కార్మికురాలు మృతి

టాప్ స్టోరీస్

RK Roja: ఆటో డ్రైవర్‌ అవతారంలో మంత్రి రోజా, లోకేశ్‌పై తీవ్ర వ్యాఖ్యలు - ముందస్తు బెయిల్ ఎందుకు?

RK Roja: ఆటో డ్రైవర్‌ అవతారంలో మంత్రి రోజా, లోకేశ్‌పై తీవ్ర వ్యాఖ్యలు - ముందస్తు బెయిల్ ఎందుకు?

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

ODI World Cup 2023: అక్షర్ పటేల్ సంచలన పోస్టులు, కావాలనే తప్పించారా! అతడి బాధ వర్ణనాతీతం

ODI World Cup 2023: అక్షర్ పటేల్ సంచలన పోస్టులు, కావాలనే తప్పించారా! అతడి బాధ వర్ణనాతీతం