అన్వేషించండి

Vizag Crime: విశాఖలో టెన్త్ క్లాస్ విద్యార్థినిపై లైంగిక దాడి- వీడియోలతో బెదిరించి నిందితుడి స్నేహితులు సైతం!

Vizag Tenth Class student sexually assaulted: విశాఖలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిని బెదిరించి గత కొన్ని రోజులుగా లైంగిక దాడి చేస్తున్న విషయం తాజాగా వెలుగుచూసింది.

Vizag 10th class student sexually assaulted: విశాఖపట్నం: సాగర నగరం విశాఖలో దారుణం జరిగింది. పదో తరగతి చదువుతున్న విద్యార్థినిని బెదిరించి గత కొన్ని రోజులుగా లైంగిక దాడి చేస్తున్న విషయం తాజాగా వెలుగుచూసింది. బాలిక చదువుతున్న స్కూల్‌ లో అటెండర్ గా చేస్తున్న నిందితుడే టార్గెట్ చేసి విద్యార్థినిని లైంగికంగా వేధించాడు. అంతటితో ఆగకుండా విద్యార్థిని న్యూడ్ ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడు. తన ఫ్రెండ్స్ కు ఆ వీడియోలు పంపించాడు, చివరికి వారు సైతం విద్యార్థినిని లైంగికంగా వేధించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు.

అసలేం జరిగిందంటే..
నేవీ అధికారి కుమార్తె విశాఖలోని ఓ స్కూల్ లో టెన్త్ క్లాస్ చదువుతోంది. 104 ఏరియాకు చెందిన సత్యారావు ఓ స్కూల్‌లో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. విద్యార్థిని ఉండే అపార్ట్ మెంట్ లోనే నిందితుడు నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. పరిచయం ఉండటంతో మాయమాటలు చెప్పి బాలికను లొంగదీసుకున్నాడు. ఈ క్రమంలో తన సెల్ ఫోన్లో విద్యార్థినిని న్యూడ్ వీడియోలు, ఫొటోలు తీశాడు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తూ లైంగిక దాడికి పాల్పడ్డాడు. వీడియోలను అడ్డం పెట్టుకుని వీలు చిక్కినప్పుడల్లా బాలికను లైంగికంగా వేధిస్తూ, చిత్రహింసలకు గురి చేస్తున్నాడు ప్రధాన నిందితుడు సత్యారావు. 

బాలికకు సంబంధించిన వీడియోలను నిందితుడు సత్యారావు తన స్నేహితులకు పంపించాడు. వారు సైతం లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. తాము చెప్పినట్లు వినకపోతే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. జూన్ 3వ తేదీ నుంచి 23వ తేదీ వరకు పలుమార్లు బాలికను లైంగికంగా వేధించారు. అయితే గత నెల నుంచి కూతురు అంత యాక్టివ్ గా లేకపోవడం, ఏదో కోల్పోయనట్లుగా ఉండటాన్ని తల్లిదండ్రులు గమనించారు. ఏం జరిగిందని ప్రశ్నించడంతో బాధిత బాలిక తనపై జరుగుతున్న లైంగిక దాడి గురించి చెప్పి కన్నీటి పర్యంతమైంది. 

బాధిత బాలిక తల్లిదండ్రులు న్యాయం కోరుతూ పోలీసులను ఆశ్రయించారు. ప్రధాన నిందితుడు సత్యారావుతో పాటు అతడి స్నేహితులపై విశాఖ ఎయిర్‌పోర్టు పీఎస్ లో లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేశారు. బాధితురాలు మైనర్ కావడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన విశాఖ పోలీసులు నిందితుడు సత్యారావును అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న అతడి ముగ్గురు స్నేహితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలిని విశాఖ కేజీహెచ్ కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఒకే అపార్ట్ మెంట్లో ఉండటం, ఒకే స్కూల్ కావడంతో నిందితుడు బాలికకు మాయమాటలు చెప్పి దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. కేసు తదుపరి విచారణను దిశ పోలీసు విభాగానికి ట్రాన్స్ ఫర్ చేశారు. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షిస్తామన్నారు పోలీసులు.
Also Read: చంద్రగిరిలో ఇసుక అక్రమ రవాణా, సీఐ రాజశేఖర్ కాళ్లు పట్టుకుని వేడుకున్న వైసీపీ నేత! 
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు

వీడియోలు

Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget