అన్వేషించండి

Visakha News: అమెరికాలో దుండగుడి కాల్పులు, విశాఖ వాసి మృతి

అమెరికాలో గుర్తుతెలియని వ్యక్తుల కాల్పుల్లో విశాఖ వాసి సత్యకృష్ణ మృతి చెందాడు. నెల రోజుల క్రితమే సత్యకృష్ణ అమెరికాకు వెళ్లినట్లు తెలుస్తోంది.

అమెరికాలో దుండగుల కాల్పుల్లో విశాఖకు చెందిన తెలుగు విద్యార్థి చట్టూరి సత్యకృష్ణ మరణించారు. సత్యకృష్ణను దుండగులు తుపాకీతో కాల్చి చంపినట్లు తెలుస్తోంది. నెలరోజుల క్రితమే ఉన్నత విద్య కోసం సత్యకృష్ణ అమెరికాకు వెళ్లారు. సత్యకృష్ణ భౌతికకాయాన్ని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సాయం అందించాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ సాయం అందించాలని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కోరారు. 

Visakha News: అమెరికాలో దుండగుడి కాల్పులు, విశాఖ వాసి మృతి

నెల రోజుల క్రితమే అమెరికాకు వెళ్లిన సత్యకృష్ణ

చిట్టూరి సత్య కృష్ణ(27) అమెరికా అలబామాలోని పాత బర్మింగ్‌హామ్ హైవేలోని క్రౌన్ సర్వీస్ స్టేషన్‌లో స్టోర్ క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. దొంగతనానికి వచ్చిన దుండగులు కాల్పులు జరపగా సత్య కృష్ణ అక్కడికక్కడే మృతి చెందినట్లు అమెరికా పోలీసు అధికారులు తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్ష చేస్తున్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. సత్యకృష్ణ నెల రోజుల క్రితమే అమెరికా వెళ్లారు. అతని భార్య నిండు గర్భవతి అని సమాచారం. కృష్ణ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. హత్యకు పాల్పడిన నిందితుడి ఫొటోలను అమెరికా పోలీసు శాఖ విడుదల చేసింది. అనుమానితుడు నల్లటి చొక్కా ధరించి ఆరు అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్నాడని కలేరా నగర పోలీసు విభాగం అధికారులు తెలిపారు.

ఇటీవల వర్జీనియాలో కాల్పులు

ఆమెరికాలోని వర్జీనియా ప్రాంతంలో హుక్కా లాంజ్‌లో ఇటీవల కాల్పులు జ‌రిగాయి. ఈ కాల్పుల్లో ఒక‌రు మృతి చెంద‌గా మ‌రో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వ‌ర్జీనియా టెక్ స‌మీపంలోని హుక్కా లాంజ్ ప్రాంతంలో కాల్పులు జ‌రిగాయని బ్లాక్స్‌బర్గ్ పోలీసులు వెల్లడించారు. మొత్తం ఐదుగురిపై దుండ‌గులు కాల్పులు జ‌రిపారని తెలిపారు. అయితే వారిని ఆసుపత్రికి త‌ర‌లించారు. అందులో ఒక‌రు ప‌రిస్థితి విష‌మించి మృతి చెందారు. మ‌రో న‌లుగురికి వైద్యం అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఒకరు వర్జీనియా టెక్ విద్యార్థి అని యూనివర్సిటీ ప్రెసిడెంట్ టిమ్ సాండ్స్ వెల్లడించారు. కాల్పుల కారణంగా అనేక గంటలపాటు వ‌ర్జీనియా టెక్ యూనివర్శిటీ ప్రాంతంలో లాక్‌డౌన్‌ విధించారు. గత శ‌నివారం తెల్లవారుజామున 3:18 గంటలకు క్యాంపస్ సురక్షితంగా ఉంద‌ని పోలీసులు ప్రక‌టించారు. ఏప్రిల్ 2007లో వర్జీనియా టెక్ వద్ద జరిగిన కాల్పుల్లో 32 మంది మృతి చెందారు. అయితే వారి మ‌ర‌ణానికి గుర్తుగా ఏర్పాటు చేసిన స్మార‌క చిహ్నానికి ఒక మైలు స‌మీపంలోనే తాజాగా కాల్పులు జరిగాయి. అయితే ఈ ఘ‌ట‌న‌పై పలు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి. 

Also Read: జూనియర్ ఆర్టిస్టుల్లా బిచ్చమడిగారంటూ చిరంజీవి, మహేష్ బాబుపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్ 

టాప్ హెడ్ లైన్స్

Adilabad Crime News: మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
Hyderabad Building Collapse: గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!
గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Gachibowli Building Collapse: అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Embed widget