అన్వేషించండి

Human Trafficking Case: కంబోడియా సైబర్ నేరగాళ్ల నుంచి 60 మందికి విముక్తి - హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో విశాఖ పోలీసుల దర్యాప్తు ముమ్మరం

Visakha News: కంబోడియాలో సైబర్ నేరగాళ్ల నుంచి 60 మందికి విశాఖ పోలీసులు విముక్తి కల్పించారు. వీరు శుక్రవారం సాయంత్రానికి విశాఖ ఎయిర్‌పోర్ట్ చేరుకుంటారు.

Indian Nationals Rescued From Cambodia: హ్యూమన్ ట్రాఫికింగ్‌ కేసుకు (Human Trafficking Case) సంబంధించి విశాఖ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కంబోడియా (Cambodia) సైబర్ నేరాగళ్ల నుంచి 60 మందికి విముక్తి కల్పించారు. హ్యూమన్ ట్రాఫికింగ్ వలలో జిల్లాకు చెందిన 150 మంది చిక్కుకున్నారు. కంబోడియా నుంచి బయల్దేరిన 60 మంది శుక్రవారం సాయంత్రం విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారని సీపీ రవిశంకర్ తెలిపారు. వీరి రాక కోసం బాధిత కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. కంబోడియాలో సైబర్ నేరగాళ్ల చేతిలో 5 వేల మంది భారతీయులు చిక్కుకున్నారని చెప్పారు. కాగా, విదేశాల్లో ఉద్యోగాల ఆశ చూపి మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురు నిందితుల ముఠాను ఇటీవల విశాఖ (Visakha) పోలీసులు అరెస్ట్ చేశారు. డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ఏపీ (AP), పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుంచి కంబోడియా, మయన్మార్, బ్యాంకాక్ దేశాలకు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. నిందితులు టాస్క్ గేమ్స్, ఫెడెక్స్ పేరిట సైబర్ నేరాలు చేయడంలో అమాయకులను వాడుకుంటున్నట్లు వెల్లడించారు. డేటా ఎంట్రీ పేరుతో ఉద్యోగాలని చెప్పి ఆన్ లైన్ స్కాంలు చేయడంలో వీరికి ట్రైనింగ్ ఇస్తారని.. మాట వినకుంటే చిత్రహింసలు పెడతారని అన్నారు. దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనం కలిగించగా.. పోలీసులు బాధితులను రక్షించి స్వగ్రామాలకు చేరేందుకు చర్యలు చేపట్టారు.

మరోవైపు, ఈ కేసును విచారించేందుకు విశాఖ సీపీ ఆధ్వర్యంలో 20 మందితో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటైంది. జాయింట్ సీపీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, 12 మంది హెడ్ కానిస్టేబుళ్ల దర్యాప్తు బృందం హ్యుమన్ ట్రాఫికింగ్ కేసుపై లోతుగా విచారణ చేపట్టింది.

అసలేం జరిగిందంటే.?

విశాఖ గాజువాక ప్రాంతానికి చెందిన రాజేష్ అనే ఏజెంట్ 2013 నుంచి 2019 వరకూ గల్ఫ్ దేశాల్లో ఫైర్ సేఫ్టీ అండ్ ప్రికాషన్ మేనేజర్ గా పని చేశాడు. విశాఖలోనే ఉంటూ గల్ఫ్ దేశాలకు ఫైర్ సేఫ్టీ ఉద్యోగాలకు మానవ వనరులను సరఫరా చేసేవాడు. గతేడాది మార్చిలో కాంబోడియా నుంచి సంతోష్ అనే వ్యక్తి ఫోన్ చేసి అక్కడ కంప్యూటర్ ఆపరేటర్స్ గా పని చేసేందుకు కొంతమందిని పంపాలని.. కమీషన్ ఇస్తానని ఆశ చూపాడు. ఇందుకు అంగీకరించిన రాజేష్ సోషల్ మీడియా ద్వారా డేటా ఎంట్రీ ఉద్యోగాలకు ప్రకటన ఇవ్వగా.. నిజమని నమ్మిన కొందరు నిరుద్యోగులు రూ.1.50 లక్షల వంతున అతనికి కట్టారు. రాజేష్ వారిని కంబోడియా ఏజెంట్‌కు అప్పగించాడు. ఇలా పలు దఫాలుగా వివిధ ఏజెంట్ల 150 మంది నిరుద్యోగులను కంబోడియాకు పంపించాడు. 

ఆన్ లైన్ మోసాలపై శిక్షణ

ఉద్యోగాలని నమ్మి అక్కడకు వెళ్లిన వారికి ఆన్ లైన్ స్కామ్స్, సైబర్ నేరాలు ఎలా చేయాలో ఈ ముఠా శిక్షణ ఇచ్చేది. ఫెడెక్స్, టాస్క్ గేమ్స్, ఆన్ లైన్ మోసాలు చేయాలని నిరుద్యోగులను బలంవంతం చేసింది. మాట వినకుంటే వారిపై చిత్ర హింసలకు పాల్పడేది. వారిని రూంలో బంధించి భోజనం కూడా పెట్టకుండా వేధించేది. సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకున్న విశాఖ వాసి ఇక్కడ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ముగ్గురు నిందితుల ముఠాను అరెస్ట్ చేశారు. వారు ఇచ్చిన సమాచారంతో బాధితులను గుర్తించారు. ఈ మేరకు విశాఖ సీపీ రవిశంకర్ వివరాలు వెల్లడించారు. 

ఇప్పటికే కేసు గురించి కంబోడియా ఎంబసీ సిబ్బందికి తెలిపినట్లు సీపీ చెప్పారు. శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, రాజమండ్రి, అమలాపురం, తుని, పలాస, కలకత్తా నుంచి నిరుద్యోగ యువత వీరి ఉచ్చులో చిక్కుకున్నారని అన్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి దర్యాప్తునకు కంబోడియాలోని భారత ఎంబసీ సహకారం తీసుకుంటామన్న సీపీ.. ఈ ముఠా వెనుక ఎవరున్నారో ఆరా తీస్తున్నట్లు చెప్పారు. విదేశాల్లో ఉద్యోగం అనగానే నిరుద్యోగులు ఆలోచించాలని.. ఏజెంట్ల చేతుల్లో మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Also Read: Chandra Babu News: టీడీపీ బాధ్యతలు లోకేష్‌కు అప్పగించాలి- చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేసిన రోజే జరగాలి: బుద్దా వెంకన్న

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget