అన్వేషించండి

Visakha Crime: గంజాయి రవాణా చేసేది కొరియర్ బాయ్ లే: విశాఖ సీపీ సంచలన విషయాలు వెల్లడి

Visakhapatnam News In Telugu: విశాఖ నగర పరిధిలో గంజాయిని తరలించేది పలు రకాల కొరియర్ సంస్థలకు చెందిన బాయ్ లేనని నగర పోలీస్ కమిషనర్ డా.రవిశంకర్ సంచలన విషయాలు వెల్లడించారు.

Vizag CP Ravishankar: విశాఖపట్నం: విశాఖ నగర పరిధిలో గంజాయిని తరలించేది పలు రకాల కొరియర్ సంస్థలకు చెందిన బాయ్ లేనని నగర పోలీస్ కమిషనర్ డా.రవిశంకర్ సంచలన విషయాలు వెల్లడించారు. టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి సిపి బుధవారం నేరుగా టూటౌన్ పరిధిలోని కొబ్బరి తోట ప్రాంతాల్లో దాడుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవాణాకి సిద్దంగా ఉంచిన 200 కేజీల గంజాయి (Ganja)ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ రవిశంకర్ మాట్లాడుతూ, తమకు పక్కా సమాచారం రావడంతో దాడులు చేరసినట్టు ఆయన తెలియజేశారు. 

నగరంలో పలువురు కొరియర్ బాయ్ ల ద్వారా గంజాయి మెటీరియల్ రవాణా జరుగుతుందని అన్నారు. అలాంటి వారిపై నిఘా పెట్టామని చెప్పిన సీపీ, ప్రస్తుతం రవాణాకి పాల్పడుతున్నవారు పరారీలో ఉన్నారని చెప్పారు. నగరంలోని ఏ కొరియర్ కంపెనీ అయినా నిబంధనలు అతిక్రమించి ఇలాంటి చట్ట వ్యతిరేక, నిషేధిత గంజాయిని రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంలో ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదని, మొహమాటం లేకుండా లోపలేస్తామని ఘాటుగా హెచ్చరించారు. ప్రస్తుతం అనుమానితులపై నిఘాపెట్టామని, నగరం మొత్తం వారి కోసం జల్లెడ పడుతున్నట్టు ఆయన వివరించారు. 

ప్రస్తుతం గంజాయి స్వాధీనం చేసుకున్న ఇంటిలో వున్న వ్యక్తులు పలు రాష్ట్రాలు, ఇతర దేశాలకు కూడా ఇక్కడి నుంచే ఏడాదిన్న కాలంగా గంజాయి సరఫరా చేస్తున్నట్టు సమాచారం ఉందని తెలియజేశారు. మరికొన్ని ప్రాంతాల్లో కూడా గంజాయి గంజాయి రవాణా అవుతున్నట్టు సమాచారం వచ్చిందని అక్కడ కూడా ప్రత్యేక బృందాలు దాడులు నిర్వహిస్తాయని చెప్పారు. నగరంలో ప్రజలు అద్దెకి ఇళ్లు ఇచ్చేవారు అద్దెకి దిగేవారి వివరాలను పూర్తిగా కనుక్కున్న తరువాత మాత్రమే ఇళ్లు అద్దెకి ఇవ్వాలన్నారు. ఈ దాడుల్లో టూటౌన్ పోలీసులు పాల్గొన్నారు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Game Changer Trailer Decode | గేమ్ చేంజర్ ట్రైలర్ లో మీరు ఇవి గమనించారా..? | ABP DesamRam Charan Game Changer Mumbai | బాలీవుడ్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన రామ్ చరణ్ | ABP DesamRare Black panther Spotted | పిల్ల చిరుతతో కలిసి నల్ల చిరుత సందడి | ABP DesamAus vs Ind sydeny Test Day 1 Highlights | సిడ్నీ టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో చేతులెత్తేసిన భారత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Numaish 2025: భాగ్యనగరంలో నుమాయిష్ సందడి - అందుబాటులోకి 2,400 స్టాల్స్, ప్రత్యేకతలివే!
భాగ్యనగరంలో నుమాయిష్ సందడి - అందుబాటులోకి 2,400 స్టాల్స్, ప్రత్యేకతలివే!
Google Search Don'ts: గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
Holidays in January: స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్ - జనవరిలో 9 రోజులు మూతపడనున్న పాఠశాలలు
స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్ - జనవరిలో 9 రోజులు మూతపడనున్న పాఠశాలలు
Railway Recruitment Board: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
Embed widget