Vijayawada: పక్కింటి మహిళను ఇంట్లోకి లాక్కొచ్చి రేప్.. పక్కనే ఉండి వీడియో షూట్ చేసిన భార్య, అంతటితో ఆగకుండా..
కళ్ల ముందే భర్త ఓ మహిళ మానం తీస్తుంటే అది అడ్డుకోవాల్సింది పోయి, కట్టుకున్న భార్య అతడికి సహకరించింది. తన ఫోన్‌లో ఆ ఘటనను వీడియో తీసింది.
విజయవాడలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ఎదురింట్లోనే ఉండే పెళ్లై పిల్లలున్న మహిళపై అత్యాచారం చేశాడు. అత్యాచారం చేస్తుండగా.. అతని భార్య నిస్సిగ్గుగా వీడియోలు, ఫోటోలు తీసింది. తన భర్త చేస్తున్న పనిని ఆపాల్సింది భార్య ముందే పరాయి మహిళపై అత్యాచారం చేయడం స్థానికంగా సంచలనంగా మారింది. నిందితుడు ఆ ఫోటోలు, వీడియోలు చూపించి బెదిరించి మరోసారి కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా తన స్నేహితుల లైంగిక కోరికలు కూడా తీర్చాలని మహిళను వేధించాడు. అతని వేధింపులు భరించలేని మహిళ స్థానిక పోలీసులను ఆశ్రయించింది. దాంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కళ్ల ముందే భర్త ఓ మహిళ మానం తీస్తుంటే అది అడ్డుకోవాల్సింది పోయి, కట్టుకున్న భార్య అతడికి సహకరించింది. తన ఫోన్‌లో ఆ ఘటనను వీడియో తీసింది. విజయవాడ నగరంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు కేసు నమోదు చేశారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ సమీప ప్రాంతంలో పెళ్లైన ఓ మహిళ (25) తన భర్త, పిల్లలతో కలిసి నివాసం ఉంటోంది. తన భర్త కేటరింగ్ పని చేస్తుంటాడు. అయితే, ఈ నెల 3వ తేదీ రాత్రి ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంట్లో నిద్రపోతోంది. వీరి ఎదురింట్లోనే నిందితుడు దిలీప్ - తులసి అనే భార్యాభర్తలు ఉంటున్నారు.
అయితే, రాత్రి 11 గంటల సమయంలో ఈ ఇద్దరు భార్యాభర్తలు ఆ వివాహిత ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డారు. ఇంట్లో నిద్రపోతునన ఆమె లేచి చూసి కేకలు వేసేందుకు ప్రయత్నించగా.. వెంటనే ఆమె నోరు మూసి, తమ ఇంట్లోకి లాక్కెళ్లారు. ఆమెను బలవంతంగా భర్త రెండు సార్లు అత్యాచారం చేయగా, పక్కనే ఉండి అతడి భార్య వీడియోలు, ఫొటోలు తీసింది. ఆ తర్వాతి రోజు కూడా ఆమెను బెదిరించి నిందితుడు దిలీప్ మరోసారి అత్యాచారం చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో ఆ వీడియోలు బయట పెడతానంటూ బెదిరించి మరీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే పిల్లలిద్దరినీ చంపేస్తానని, ఫొటోలను అందరికీ చూపించి పరువు తీస్తానని బెదిరించాడు.
అంతేకాకుండా, తన స్నేహితుల కోరికలు కూడా తీర్చాలని వేధించాడు. దీంతో తట్టుకోలేదని బాధితురాలు మహిళా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. ఈ ఘటనపై ఫిర్యాదు చేయగా, భార్యాభర్తలపై ఐపీసీ 376(2), 354బి, 354డి, 109 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే, నిందితుడు ఆమెపై అత్యాచారానికి ఏవైనా వివాదాలు కారణమా అనే కోణంలో పోలీసులు భావిస్తున్నారు.