(Source: ECI/ABP News/ABP Majha)
Vijayawada Crime : పోలీసులు మరింత త్వరగా రియాక్ట్ అయితే ఘోరం జరిగేదికాదు, విజయవాడ ఘటనపై సీపీ వివరణ
Vijayawada Crime : విజయవాడ జీజీహెచ్ లో మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారం కేసులో పోలీసులు ఇంకొంచెం వేగంగా రియాక్ట్ కావాల్సిందని సీపీ కాంతి రాణా అన్నారు. కేసు నమోదైన మూడు గంటల్లోనే నిందితులను అరెస్టు చేశామన్నారు.
Vijayawada Crime : విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మతిస్థిమితం లేని యువతిపై సామూహిక అత్యాచారం కేసుపై విజయవాడ సీపీ కాంతిరాణా స్పందించారు. ఈ కేసులో పోలీసులు మరింత వేగంగా రియాక్ట్ అవ్వాల్సిందన్నారు. అలా స్పందించి ఉంటే ఇవాళ బాధితురాలికి అన్యాయం జరిగేదికాదన్నారు. అందుకే బాధ్యులైన పోలీసులు అధికారులపై చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. సంచలనం సృష్టించిన విజయవాడ అత్యాచారం కేసులో త్వరగానే స్పందించామన్నారు విజయవాడ సీపీ కాంతిరాణా. కానీ అది సరిపోలేదని మరింత వేగంగా రియాక్ట్ కావాల్సిందని అభిప్రాయపడ్డారు. మధ్యాహ్నం 12 గంటలకు ఫిర్యాదు వచ్చిందని సీపీ తెలిపారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే లోకల్ ఎస్సై సహా సిబ్బంది అంతా విచారణ చేపట్టారన్నారు. పోలీస్‌లకు ఉన్న సోషల్ మీడియా గ్రూప్‌లో సమాచారాన్ని షేర్ చేసి అమ్మాయి ఎక్కడైనా ఉంటే చెప్పాలని ఆదేశించామన్నారు. స్పెషల్ పార్టీలను ఏర్పాటు చేసి ఎంక్వైరీ చేశామన్నారు.
మూడు గంటల్లోనే నిందితుల అరెస్టు
సాయంత్రానికి ఓ ఫోన్ నెంబర్ దొరికిందని దాని ఆధారంగా యువతిని ట్రేస్ చేశామని సీపీ కాంతి రాణా తెలిపారు. ఆ నెంబర్ శ్రీకాంత్‌ది అని తేలడంతో ఆయనే కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానించామన్నారు. చివరకు ఫ్యామిలీ మెంబర్స్ వెతికితే ఆసుపత్రిలో ఆమె ఉన్నట్టు తేలిందన్నారు. ఇది మిస్సింగ్ కేసు కాదు రేప్ కేస్ అని తెలిసిన వెంటనే కేసు దర్యాప్తు వేగం చేసినట్టు పేర్కొన్నారు. మూడు గంటల్లోనే నిందితులను పట్టుకున్నామన్నారు. నిందితులను వెంటనే జడ్జి ముందు హాజరుపరిచి జైల్లో పెట్టామన్నారు. పోలీసుల తప్పిదాలు కూడా ఉన్నాయని అంగీకరించారు విజయవాడ సీపీ కాంతిరాణా. ఇది కచ్చితంగా తమకు పాఠం లాటిందన్నారు. ఇలాంటివి భవిష్యత్‌లో జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
"మిస్సింగ్ కేసు కాదు అత్యాచారం జరిగిందని తెలియగానే మూడు గంటల్లోనే నిందితులను పట్టుకున్నాం వాళ్లను జైలుకి కూడా పంపించాం. ఇంకా త్వరగా పోలీసులు స్పందించాల్సింది. భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా అధికారులపై చర్యలు తీసుకున్నాం. శాఖాపరమైన విచారణ జరుగుతోంది. దాని ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం." సీపీ కాంతిరాణా
నున్న సీఐ, ఎస్సైపై చర్యలు
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మానసిక దివ్యాంగురాలిపై సామూహిక అత్యాచార ఘటనలో పోలీసులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నున్న సీఐ, సెక్టార్ ఎస్సైను సస్పెండ్ చేసింది. తమ కుమార్తె కనిపించట్లేదంటూ బాధితురాలి తల్లిదండ్రులు నున్న పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్తే స్పందించకుండా సాయంత్రం రావాలని పోలీసులు తిప్పి పంపించేశారని అభియోగాలు ఉన్నాయి. చివరిగా ఓ నంబర్ నుంచి ఫోన్ వచ్చిందని చెప్పినా వెంటనే చర్యలు చేపట్టలేదని ఆరోపణలు ఉన్నాయి.