అన్వేషించండి

తల్లిని మోసం చేసి మిత్రుడి ఇన్సురెన్స్ సొమ్ము కాజేసిన స్నేహితులు

బీమా సొమ్ము కోసం స్నేహితుడి ఫ్యామిలీనే మోసం చేశారు కొందరు మిత్రులు. బ్యాంకు అధికారులతో కుమ్మక్కై 50 లక్షలు కొట్టేసేందుకు స్కెచ్‌ వేశారు.

బ్రెయిన్ ట్యూమర్‌తో కొడుకును పోగొట్టుకొని పుట్టెడు బాధలో ఉన్న తల్లికి అండగా ఉండాల్సిన స్నేహితులే భారీ స్కెచ్ వేశారు. నమ్మకంగా సంతకాలు పెట్టించుకొని బీమా సొమ్ము కాజేశారు. విజయవాడ రామలింగేశ్వరనగర్‌కు చెందిన పుప్పాల వెంకట గౌరికి ముగ్గురు కుమారులు, కుమార్తె. రెండో కుమారుడు చిరంజీవి బ్రెయిన్ ట్యూమర్‌తో హైదరాబాద్‌లో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గతేడాది అక్టోబర్ 26న మరణించారు. చిరంజీవి బతికి ఉన్న సమయంలో తన స్నేహితుడైన నెలబండ్ల మహేష్ వద్ద తన తల్లిని నామినిగా పెట్టి రూ. 50 లక్షలకు ఇన్సూరెన్స్ తీసుకున్నారు. చిరంజీని మరణించిన తర్వాత అతని స్నేహితులైన మహేష్, కోడెబోయిన కృష్ణ ప్రసాద్, కుంట లక్ష్మణ్ కలిసి గౌరి వద్దకు వచ్చి బీమా క్లెయిమ్‌కు కావాల్సిన ప్రక్రియ అంతా తాము చూసుకుంటామని నమ్మించారు. అండగా ఉంటామని భరోసా కల్పించి మాయమాటలు చెప్పారు. కొడుకు స్నేహితులు కావటంతో ఆమె వారి మాటలు నమ్మి బీమా బాండ్, డెత్‌ సర్టిఫికేట్‌ ఇచ్చేసింది. 

గవర్నర్‌పేటలోని కృష్ణ కో-ఆపరేటివ్ బ్యాంకు మేనేజర్ సహాయంతో గౌరి పేరుతో ఖాతా తెరిచారు. బీమా సొమ్ము విడుదల కావటానికి కొన్ని సంతకాలు కావాలని కాగితాలపై సంతకాలు తీసుకున్నారు. ఆ తరువాత నుంచి కనిపించకుండా పోయారు.

కుమార్తె రావటంతో వెలుగులోకి...
ఇటీవల గౌరి కుమార్తె నందిని హైదరాబాద్ నుంచి వచ్చారు. అదే సమయంలో లక్ష్మణ్, కృష్ణ ప్రసాద్ ఇద్దరూ గౌరిని కూడా కలిశారు. ఇన్సూరెన్స్ వ్యవహరం చర్చకు రావటంతో మిత్రులు ఇద్దరు వేర్వేరు మాటలు చెప్పారు. నందినికి వారిపై అనుమానం వచ్చింది. నందిని బీమా కంపెనీలో పని చేస్తున్న తన స్నేహితుడిని అడిగి వివరాలు తెలుసుకుంది. రెండు రోజులు క్రితమే గౌరి ఖాతాలో 50 లక్షలు జమ అయ్యిందని చెప్పారు. దీంతో నందిని తన తల్లిని తీసుకొని బ్యాంకుకు వెళ్లి ఖాతాలో బ్యాలెన్స్ వాకబు చేయగా, కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఉన్నాయి. వెంటనే బ్యాంకు ఖాతాకు చెందిన పూర్తి స్టేట్మెంట్ తీసుకుని వివరాలు సేకరించగా, డిసెంబర్ 28న సెల్ఫ్ చెక్ ద్వారా 20 లక్షల రూపాయలు విత్ డ్రా చేసినట్లుగా, 30న కుంట లక్ష్మణ్ సోదరుడు కుంట అభిషేక్ ఖాతాకు చెక్ ట్రాన్సఫర్ ద్వారా 30 లక్షలు ట్రాన్స్ఫర్ చేసినట్లుగా లెక్కల్లో తేలింది.

బ్యాంకు అధికారుల పాత్ర....
మోసపోయామని గుర్తించిన గౌరి, నందిని, సెల్ఫ్ చెక్ పై నగదు ఎలా ఇస్తారని, బ్యాంకు అధికారులను నిలదీశారు. దీంతో బ్యాంక్ మేనేజర్ మహేష్ గౌరి,నందినితో రాజీకి వచ్చారు. అందులో భాగంగా 30లక్షల రూపాయలు గౌరి ఖాతాకు మళ్లించారు. ఆ తరువాత మిగిలిన డబ్బులు త్వరలోనే ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు నగదు ఇవ్వకపోవటంతో బాధితురాలు, పోలీసులను ఆశ్రయించారు.

5లక్షల కోసం కక్కుర్తిపడి... పోలీసులకు చిక్కారు

విజయవాడ నగరలంలోని గవర్నర్ పేట ఏఎంసీ కాంప్లెక్సులోని ఒక ఎలక్ట్రానిక్ దుకాణంలో 5లక్షలు చోరీ చేసి పారిపోయిన వ్యక్తి యోగేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. 5 లక్షల రూపాయలను బ్యాంకులో జమ చేసేందుకు వెళుతుండగా తన పై ఇద్దరు బ్లేడ్ బ్యాచ్ సభ్యులు దాడి చేసి డబ్బులు లాక్కున్నారంటూ యోగేష్ సిని ఫక్కిలో స్టోరీ వినిపించాడు. దీంతో దుకాణ యజమాని చేసేది లేక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే యోగేష్ మాటలకు, సంఘటనా స్థలంలో పరిస్థితులకు భిన్నంగా కనిపించాయని పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. యోగేష్ మాటల్లో వాస్తవం లేదని గుర్తించారు. నగదును వేరే చోట దాచి పెట్టి యోగేష్ అసత్య కథనాన్ని వినిపించాడని పోలీసులు గుర్తించి తమదైన శైలిలో విచారించారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చిందని పోలీసులు వెల్లడించారు. విజయవాడ పాతబస్తికి చెందిన అజయ్ కుమార్ జైన్, గవర్నరు పేటలో ఎలక్ట్రికల్ వస్తువులను విక్రయిస్తుంటారు. దుకాణంలో ఉన్న ఐదు లక్షల నగదు కనిపించకపోవటంతో,వెంటనే తన వద్ద పని చేసే యోగేష్ ను నిలదీశారు. డబ్బులు కొట్టేసిన, యోగేష్ బ్లేడ్ బ్యాచ్ కథను వినిపించారు. యజమాని పోలీసులను ఆశ్రయించటంతో,అసలు విషయం బయటకు వచ్చింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Fact Check: రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Embed widget