Vijayawada News : క్షణికావేశంలో చెన్నుపాటి గాంధీపై దాడి చేశారు- సీపీ కాంతి రాణా టాటా
Vijayawada News : విజయవాడలో టీడీపీ నేత చెన్నుపాటి గాంధీపై దాడి క్షణికావేశంలో జరిగిందని సీపీ కాంతి రాణా టాటా అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామన్నారు.
Vijayawada News : విజయవాడలో టీడీపీ సీనియర్ నేత చెన్నుపాటి గాంధీపై దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ దాడి వెనుక వైసీపీ గంజాయి మాఫియా హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. పక్కా ప్లాన్ తో చెన్నుపాటి గాంధీపై దాడి చేశారన్నారు. ఈ ఘటనపై స్పందించిన విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా క్షణికావేశంలో దాడి జరిగినట్లు తెలిపారు. ఒకరికొకరు ఎదురుపడి, క్షణికావేశంతో కొట్టుకున్నారన్నారు. ప్రత్యర్థులు పిడికిలితో కొడితే, చెన్నుపాటి గాంధీ కన్నుకి గాయం అయ్యిందన్నారు. చెన్నుపాటి గాంధీ ఇన్సిడెంట్ పై విజయవాడ సీపీ ఆదివారం మీడియాతో మాట్లాడారు.
సౌమ్యుడు, వివాదరహితుడు, ఇన్నేళ్ళు రాజకీయాల్లో ఉన్నా నిజాయతీగా బ్రతికిన, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ పై, వైసీపీ సైకో మూకలు దాడి చేసి గాయపరిచారు. గాంధీ కుడి కన్నుకు బలమైన గాయం అవ్వటంతో, చికిత్స తీసుకుంటున్నారు. (1/2) pic.twitter.com/rJtMeGpvwx
— Telugu Desam Party (@JaiTDP) September 3, 2022
క్షణికావేశంలోనే దాడి- సీపీ
టీడీపీ సీనియర్ నేత, మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీపై దాడి ఘటనపై కేసు నమోదు చేశామని విజయవాడ సీపీ కాంతి రాణా టాటా తెలిపారు. ఈ కేసు దర్యాప్తునకు ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. క్షణికావేశంలోనే చెన్నుపాటి గాంధీపై దాడి చేశారని తెలుస్తోందన్నారు. నిందితులపై 326, 506, రెడ్‌విత్ 34 సెక్షన్ల కింద కేసులు నమోదుచేశామని సీపీ తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి మారణాయుధాలు ఉపయోగించలేదని వెల్లడించారు. చేతితో కొట్టడం వల్లే కంటికి గాయం అయిందని వైద్యులు రిపోర్ట్ ఇచ్చారని కాంతి రాణా చెప్పారు.
వైసీపీ నేతలు దాడి!
చెన్నుపాటి గాంధీపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారని టీడీపీ ఆరోపిస్తుంది. చేతితో బలంగా గుద్దడంతో ఆయన కుడి కన్నును కోల్పోయారని వైద్యులు తెలిపారు. పటమటలంకలో ఉంటున్న చెన్నపాటి గాంధీ శనివారం సాయంత్రం స్థానిక జిల్లాపరిషత్ పాఠశాలకు సమీపంలో తెలుగు యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్దకు బయలుదేరారు. పాఠశాల వద్ద డ్రైనేజీ పనులను పరిశీలించి, స్కూటర్‌పై వెళ్లిపోతుండగా వైసీపీ నేతలు గద్దె కల్యాణ, సుబ్బు చెన్నుపాటి గాంధీని పిలిచారు. డ్రైనేజీ సమస్యపై తాము మాట్లాడుకోలేమా అంటూ గాంధీపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో చెన్నుపాటి గాంధీకి కంటికి తీవ్రగాయం అయింది.
Also Read : TDP Chennupati Gandhi : టీడీపీ సీనియర్ నేత చెన్నుపాటి గాంధీపై దాడి, వైసీపీ నేతలే దాడి చేశారని ఆరోపణ
Also Read : Chandrababu : టీడీపీ వాళ్ల తలలు పగలగొడితే శాంతిభద్రతలు బాగున్నట్లేనా?, డీజీపీకి చంద్రబాబు లేఖ