RTC Driver: ప్రయాణికురాలిపై ఆర్టీసీ డ్రైవర్ అత్యాచారయత్నం, అడ్డుపడిన ప్రయాణికుడిపై దాడి
RTC Driver: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళపై డ్రైవర్ అత్యాచారయత్నానికి తెగబడ్డాడు. అడ్డుకోబోయిన ప్రయాణికుడిపై కూడా డ్రైవర్ దాడి చేశాడు. భర్త స్నేహితుడి సాయంతో చివరకు బయటపడింది.
RTC Driver: ఆర్టీసీ డ్రైవర్(RTC Driver) ప్రయాణికురాలితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన విజయవాడ(Vijayawada)లో వెలుగుచూసింది. నెల్లూరు నుంచి విజయవాడ వస్తున్న ఓ మహిళపై ఆర్టీసీ డ్రైవర్ అత్యాచారయత్నం చేశాడు. తోటి ప్రయాణికుడి సాయంతో బాధిత మహిళ బయటపడింది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ప్రయాణికుడిపై కూడా డ్రైవర్ దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధితురాలు అనకాపల్లిలో ఉన్న భర్తకు ఫోన్(Phone Call) చేసి చెప్పింది. బాధిత మహిళ భర్త విజయవాడలో ఉన్న తన ఫ్రెండ్ కు ఫోన్ చేసి సమాచారం అందించారు. భర్త స్నేహితుడు బస్ స్టేషన్ కి వచ్చి బాధిత మహిళను రక్షించారు. అనంతరం ఆర్టీసీ అధికారులకు డ్రైవర్ తీరుపై బాధితురాలు ఫిర్యాదు చేసింది.
అసలేం జరిగిందంటే?
ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళపై ఆ బస్సు డ్రైవర్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. మరో ప్రయాణికుడి సాయంతో బాధితురాలు డ్రైవర్ నుంచి బయటపడింది. బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. బాధితురాలి చెప్పిన వివరాల ప్రకారం.. నెల్లూరు(Nellore) నుంచి బుధవారం రాత్రి ఇంద్ర ఆర్టీసీ బస్సులో మహిళ బయలుదేరింది. ఈ బస్సులో ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. బస్సు ఒంగోలు వచ్చే సరికి బస్సులో ఓ మహిళ, మరో ఇద్దరు పురుషులు ఉన్నారు. అప్పటి వరకు డ్రైవింగ్ చేసిన జనార్దన్ మరో డ్రైవర్ కు బస్సును అప్పగించాడు. ఆ తర్వాత బస్సులో లైట్లు ఆపేసి ప్రయాణికురాలితో జనార్దన్ అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆమె ప్రతిఘటించడంతో బలవంతం చేయడానికి ప్రయత్నించాడు.
అడ్డుపడిన ప్రయాణికుడిపై దాడి
గుంటూరులో మరో ప్రయాణికుడు దిగిపోయాడు. మళ్లీ డ్రైవర్ ఆమెపై అత్యాచారయత్నం(Sexual Harassment) చేసేందుకు ప్రయత్నించగా మరో ప్రయాణికుడి వద్దకు వెళ్లి రక్షించాల్సిందిగా వేడుకోంది. ప్రయాణికుడు డ్రైవర్‌ను మందలించేందుకు ప్రయత్నించగా అతడిపై దాడి చేశాడు. ఈ విషయాన్ని ఆమె అనకాపల్లిలోని తన భర్తకు ఫోన్‌చేసి చెప్పింది. భర్త వెంటనే విజయవాడలోని తన స్నేహితుడికి ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడు. అతడు హుటాహుటిన విజయవాడ పండిత్ నెహ్రూ బస్ స్టాండ్ కు కారులో వచ్చారు. బస్సు అక్కడికి రాగానే ఆమెను రక్షించాడు. డ్రైవర్ జనార్ధన్‌పై బాధితురాలు ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో డ్రైవర్ జనార్దన్‌కు డ్యూటీ నిలిపివేసి నెల్లూరు డిపో అధికారులకు సమాచారం ఇచ్చారు ఆర్టీసీ అధికారులు. డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని బాధితురాలిని రక్షించిన వ్యక్తి ఫిర్యాదు చేశారు.
Also Read: Rajahmundry: రాజమండ్రిలో రెచ్చిపోతున్న బ్లేడ్ బ్యాచ్, రాత్రి పదైతే చాలు ఒంటరిగా వెళ్లే వారిపై దాడులు