ఫరీద్‌పేటలో వైసీపీ నేత దారుణ హత్య: ఏడాదిలో రెండో హత్య, పోలీసుల వైఫల్యంపై గ్రామస్థుల ఆగ్రహం!
Leader Murder: ఎచ్చెర్ల నియోజకవర్గంలోని ఫరీద్ పేటలో వైస్ సర్పంచ్‌ను హత్య చేశారు. కారణాలేమిటన్నదానిపై ఇంకా పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు.

Vice Sarpanch murdered in Faridpet : శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీద్ పేటలో దారుణం జరిగింది. పట్టపగలు సత్తారు గోపి(46)అనే వ్యక్తిని నడిరోడ్డుపై కత్తులతో ప్రత్యర్ధులు నరికి చంపారు. వైసీపీ నేతగా,ఎచ్చెర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవి ప్రధాన అనుచరుడిగా గోపి ఉన్నారు. గ్రామంలో అతనే కాంట్రాక్టర్ గా చేపడుతోన్న సిసి రోడ్డు నిర్మాణ పనులు పరిశీలనకు వెళుతుండగా మాటు వేసి దాడి దాడి చేసి హతమార్చారు. మృతుడు గోపికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సరిగ్గా ఏడాది కిందట గోపి డ్రైవర్ కూన ప్రసాద్ ను గ్రామంలోనే ప్రత్యర్థులు హత్య చేశారు. ఇప్పుడు సత్తారు గోపీనే హత్య చేశారు. విషయం తెలిసిన వెంటనే ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి పరిసీలించారు. పోలీసుల వైఫల్యం వల్లే దాడులు జరుగుతున్నాయి అంటూ ఎస్పీనీ గ్రామస్తులు నిలదీశారు. ప్రతీకార చర్యలు ఉంటాయన్న కారణంగా గ్రామంలో భారీగా పోలీసుల్ని మోహరించారు. ఉత్తరాంధ్ర 365 రోజులు పోలీస్ పికెటింగ్ కొనసాగుతున్న గ్రామంగా ఫరీద్ పేటకు గుర్తింపు ఉంది.





















