అన్వేషించండి

నాలుగేళ్ల కూతుర్ని కత్తితో పొడిచి చంపిన తల్లి, కొడుకుపైనా హత్యాయత్నం

Woman Kills Daughter: అమెరికాలో ఓ మహిళ నాలుగేళ్ల కూతుర్ని కత్తితో దారుణంగా పొడిచి చంపింది.

Woman Kills Daughter: 

అమెరికాలో దారుణం..

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ మహిళ కన్న కూతుర్నే దారుణంగా హత్య చేసింది. నాలుగేళ్ల కూతుర్ని కత్తితో అత్యంత దారుణంగా పొడిచింది. 10 ఏళ్ల కొడుకునీ చంపేందుకు ప్రయత్నించింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆమెని అరెస్ట్ చేశారు. చంపినందుకు ఏ మాత్రం పశ్చాత్తాపం లేదని ఆ తల్లి చెప్పడం పోలీసులను షాక్‌కి గురి చేసింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...నిందితురాలి పేరు మీరా నజారి. వయసు 34 ఏళ్లు. అక్టోబర్ 14న నాలుగేళ్ల కూతుర్ని చంపేసింది. ఈ హత్య గురించి మధ్యాహ్నం పోలీసులకు కాల్ వచ్చింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో చిన్నారి నిర్జీవంగా పడి ఉంది. శరీరంపై కత్తిపోట్లు కనిపించాయి. స్థానికులు హత్య జరిగిన తీరు చూసి హడలి పోయారు. అంత చిన్న పిల్లను అంత దారుణంగా ఎలా చంపిందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత చేసి కూడా ఏమీ జరగనట్టు ఆ తల్లి ఎలా ఉంటోందని ప్రశ్నించారు. అయితే...ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ చెప్పిన దాన్ని బట్టి చూస్తే నిందితురాలు మానిసక సమస్యలతో బాధ పడుతోంది. చాలా రోజులుగా ఇలాగే ప్రవర్తిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకు ఈ హత్య చేసిందో ఇప్పటి వరకూ కారణం తెలియలేదు. ఈ మధ్య కాలంలో అమెరికాలో ఈ తరహా ఘటనలు పెరుగుతున్నాయి. మానసిక సమస్యలతో బాధపడుతూ కుటుంబ సభ్యుల్నే అత్యంత కిరాతకంగా చంపేస్తున్నారు. గన్‌తో కాల్చి చంపిన సంఘటనలూ వెలుగు చూశాయి. 

మెక్సికోలోనూ దారుణం..

మెక్సికోలో ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా చంపేశాడు. అక్కడితో ఆగకుండా ఆమె మెదడుని బయటకు తీసి తినేశాడు. మెక్సికన్ ఫుడ్‌ Tacosలో ఆమె మెదడుని పెట్టి తిన్నాడు. ఈ షాకింగ్ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆ నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం...నిందితుడు అల్వారో ఓ బిల్డర్. జూన్ 29వ తేదీన డ్రగ్స్ తీసుకున్నాడు. అక్కడ నిషేధం ఉన్నా అక్రమంగా తెచ్చుకున్నాడు. ఆ మత్తులోనే భార్యను దారుణంగా హత్య చేశాడు. ఎందుకిలా చేశావని అడిగితే.."మృత్యుదేవత నాతో మాట్లాడింది. ఆమెని చంపాలని చెప్పింది" అని పిచ్చిపిచ్చిగా మాట్లాడాడు. ఏడాది క్రితమే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆమెకి అప్పటికే ఐదుగురు పిల్లలున్నారు. అయితే..తన భార్యని హత్య చేసిన తరవాత మెదడు బయటకు తీసి తిన్నానని పోలీసుల ముంద అంగీకరించాడు నిందితుడు. అంతేకాదు. ఆమె పుర్రెని యాష్‌ట్రేగా వాడుకున్నాడు. ఆ తరవాత శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఓ ప్లాస్టిక్ బ్యాగ్‌లో పెట్టాడు. రెండ్రోజుల పాటు ఆ ఇంట్లోనే ఉన్న నిందితుడు ఆ తరవాత కూతురికి ఫోన్ చేసి మర్డర్ చేసినట్టు ఒప్పుకున్నాడు. "నేను మీ అమ్మని చంపేసి బ్యాగ్‌లో పెట్టాను. వచ్చి డెడ్‌బాడీని కలెక్ట్ చేసుకో" అని చెప్పాడు. సుత్తితో బలంగా కొట్టి చంపేసినట్టు పోలీసులు వెల్లడించారు. 

Also Read: డెట్రాయిట్‌లో యూదు మహిళ దారుణ హత్య, కత్తితో పొడిచి చంపిన దుండగులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
PM Modi Mann Ki Baat: 2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Anantapur News: అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
PM Modi Mann Ki Baat: 2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Anantapur News: అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
China Bullet Train: ఈ రైలు వేగం గంటకు 450 కిలోమీటర్లు - అత్యాధునిక ఆవిష్కరణ చేసిన చైనా, ప్రత్యేకతలు ఇవే!
ఈ రైలు వేగం గంటకు 450 కిలోమీటర్లు - అత్యాధునిక ఆవిష్కరణ చేసిన చైనా, ప్రత్యేకతలు ఇవే!
Ram Charan Unstoppable 4: బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
Kasturba Gandhi School: 300 మందిని ఇళ్లకు తీసుకెళ్లిన తల్లిదండ్రులు, కస్తూర్భా గాంధీ స్కూళ్లో ఏం జరుగుతోంది
300 మందిని ఇళ్లకు తీసుకెళ్లిన తల్లిదండ్రులు, కస్తూర్భా గాంధీ స్కూళ్లో ఏం జరుగుతోంది
JC Prabhakar Reddy: చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Embed widget