అన్వేషించండి

భార్యను 17 సార్లు కత్తితో పొడిచి చంపిన ఇండియన్, జీవిత ఖైదు విధించిన ఫ్లోరిడా కోర్టు

US Crime News: భార్యను కిరాతకంగా చంపిన ఇండియన్‌కి ఫ్లోరిడా కోర్టు జీవిత ఖైదు విధించింది.

US Crime News:

ఇండియన్‌కి జీవిత ఖైదు

అమెరికాలో భార్యను హత్య చేసిన ఇండియన్‌కి ఫ్లోరిడా కోర్టు జీవిత ఖైదు (Life Sentence) విధించింది. 2020లో భారత్‌కి చెందిన ఫిలిప్ మాథ్యూ (Philip Mathew) భార్య మెరిన్‌ జాయ్‌పై (Merin Joy) దాడి చేశాడు. ఆమె కార్‌లో వెళ్తుండగా అడ్డగించాడు. ఆపై దాడి చేసి కత్తితో 17 సార్లు కిరాతకంగా పొడిచాడు. ఆమెని రోడ్డుపై పడేసి ఆమె వచ్చిన కార్‌లోనే పరారయ్యాడు. పారిపోయే ముందు కార్‌ని ఆమెపైకి ఎక్కించాడు. రక్తపు మడుగులో పడి ఉన్న మెరిన్ జాయ్‌ని గుర్తించి స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తీవ్ర రక్త స్రావమైంది. పైగా గర్భంతో ఉంది. చనిపోయే ముందు తన కడుపులోని బిడ్డ గురించి తలుచుకుని బాగా ఏడ్చినట్టు స్నేహితులు చెప్పారు. దాడి చేసింది తన భర్తే అని పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఈ స్టేట్‌మెంట్ ఆధారంగానే పోలీసులు ఫిలిప్‌ని అరెస్ట్ చేశారు. కోర్టు నిందితుడికి జీవిత ఖైదు విధించింది. విడుదలయ్యే అవకాశమే లేకుండా చేసింది. దీంతో పాటు పదునైన ఆయుధంతో దాడి చేసినందుకు ఐదేళ్ల శిక్ష కూడా విధించింది. ఈ శిక్షను సవాల్ చేసి ఉండి ఉంటే కోర్టు కచ్చితంగా ఉరిశిక్ష విధించి ఉండేదని, కానీ ఇందుకు ఫిలిప్‌ ముందుకు రాకపోవడం వల్ల జీవిత ఖైదుతో సరిపెట్టిందని The Sun Sentinel రిపోర్ట్ చేసింది. నిజానికి ఈ హత్య జరిగే నాటికే మెరిన్‌తో రిలేషన్‌ని బ్రేక్ చేసుకునేందుకు సిద్ధమయ్యాడు ఫిలిప్. కానీ అంతలోనే హత్య చేశాడు. కోర్టు తీర్పు విన్న తరవాత మెరిన్ జాయ్ బంధువులు సంతోషం వ్యక్తం చేశారు. తన కూతుర్ని చంపిన వ్యక్తి జీవితాంతం జైల్లోనే ఉంటాడన్న వార్త తెలిసి తల్లిదండ్రులూ కొంత ఊరట పొందారు. 

ఖతార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

ఖతార్‌ ప్రభుత్వం ఇటీవలే సంచలన నిర్ణయం తీసుకుంది. గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇండియన్ నేవీకి చెందిన 8 మంది మాజీ అధికారులకు ఉరిశిక్ష విధించింది. అయితే..ఈ తీర్పుని సవాలు చేస్తామని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ అధికారుల్లో ఒకప్పుడు యుద్ధనౌకల్లో మేజర్ స్థాయి వ్యక్తులూ ఉన్నారు. దాదాపు ఏడాదిగా వీళ్లు ఖతార్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ తీర్పుపై భారత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. లీగల్‌ పరంగా తీసుకోవాల్సిన చర్యల్ని కచ్చితంగా తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఇప్పటికే చాలా సార్లు బెయిల్‌ పిటిషన్‌ వేశారు అధికారులు. కానీ వాటిని ఖతార్ అధికారులు కొట్టేశారు. పైగా జైలుశిక్షను పొడిగిస్తూ వచ్చారు. చివరకు కోర్టు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పుని వెలువరించింది. 

"నేవీ మాజీ అధికారులకు ఉరిశిక్ష వేయడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. ఈ కేసుకి సంబంధించిన పూర్తి తీర్పు కోసం ఎదురు చూస్తున్నాం. వాళ్ల కుటుంబ సభ్యులతో మేం ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాం. లీగల్‌ టీమ్‌తోనూ చర్చలు జరుపుతున్నాం. ఈ తీర్పుని సవాల్ చేసేందుకు న్యాయ పరంగా అన్ని మార్గాలనూ అన్వేషిస్తున్నాం"

- భారత విదేశాంగ శాఖ  

Also Read: కర్ణాటక మహిళా ఉద్యోగి హత్య కేసులో నిందితుడు అరెస్ట్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala Laddu News: తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
Andhra Pradesh: జగన్‌ను దేశం నుంచి బహిష్కరించాలి,  మంత్రుల హాట్ కామెంట్స్
జగన్‌ను దేశం నుంచి బహిష్కరించాలి, మంత్రుల హాట్ కామెంట్స్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Hassan Nasrallah Killed: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతం- ఇజ్రాయెల్ ఆర్మీ సంచలన ప్రకటన
హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతం- ఇజ్రాయెల్ ఆర్మీ సంచలన ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామాSecond Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Laddu News: తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
Andhra Pradesh: జగన్‌ను దేశం నుంచి బహిష్కరించాలి,  మంత్రుల హాట్ కామెంట్స్
జగన్‌ను దేశం నుంచి బహిష్కరించాలి, మంత్రుల హాట్ కామెంట్స్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Hassan Nasrallah Killed: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతం- ఇజ్రాయెల్ ఆర్మీ సంచలన ప్రకటన
హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతం- ఇజ్రాయెల్ ఆర్మీ సంచలన ప్రకటన
HYDRA: మూసీలో రక్త కన్నీళ్లు పారిస్తున్నారు- రేవంత్‌పై హరీష్ సంచలన ఆరోపణలు
మూసీలో రక్త కన్నీళ్లు పారిస్తున్నారు- రేవంత్‌పై హరీష్ సంచలన ఆరోపణలు
JaganLatest Tweets: నా ప్రెస్ మీట్ మీరందరూ వినండి- సీఎంలు, పార్టీ అధినేతలకు జగన్ ట్వీట్
నా ప్రెస్ మీట్ మీరందరూ వినండి- సీఎంలు, పార్టీ అధినేతలకు జగన్ ట్వీట్
Ponguleti ED Raids : కుమారుడి లగ్జరీ వాచీల మోజే కొంప ముంచిందా ? ఈడీ సోదాల వెనుక జరిగింది ఇదే
కుమారుడి లగ్జరీ వాచీల మోజే కొంప ముంచిందా ? ఈడీ సోదాల వెనుక జరిగింది ఇదే
Hyderabad: ఇళ్లు కూల్చేస్తారని భయంతో మహిళ ఆత్మహత్య- వదంతులు నమ్మొద్దని ప్రజలకు రంగనాథ్ సూచన
ఇళ్లు కూల్చేస్తారని భయంతో మహిళ ఆత్మహత్య- వదంతులు నమ్మొద్దని ప్రజలకు రంగనాథ్ సూచన
Embed widget