Hyderabad News: నగరంలో దారుణం - మొబైల్ కోసం మర్డర్
Telangana News: హైదరాబాద్ నగరంలో మొబైల్ కోసం ఓ వ్యక్తిని ఇద్దరు దుండగులు దారుణంగా చంపేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
Person Brutally Murdered For Mobile In Hyderabad: హైదరాబాద్ (Hyderabad) నగరంలో దారుణం జరిగింది. ఇద్దరు దుండగులు మొబైల్ కోసం ఓ వ్యక్తిని దారుణంగా చంపేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భాగ్యనగరంలోని గుడిమల్కాపూర్ (Gudimalkapur)లో పీవీ ఎక్స్ ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 65 వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రోడ్డు పక్కన వ్యాపారం చేసే సనా వుల్లా (24) వద్దకు వచ్చిన ఇద్దరు దుండగులు.. అతని మొబైల్ ఇవ్వాలని వాగ్వాదానికి దిగారు. దీంతో అతను ఇవ్వకపోవడంతో బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో సనావుల్లా ఛాతీపై ఇద్దరు నిందితులు కత్తితో పొడిచారు. అనంతరం దుండగులు అతని మొబైల్ తీసుకుని బైక్ పై పరారయ్యారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే సనావుల్లా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.