అన్వేషించండి

Love Failure Attack: పెళ్లి వద్దన్నందుకు నడిరోడ్డుపై చంపబోయాడు - రియల్ సైకోలవర్‌ వీడియో వైరల్

Trichy Crime: ప్రేమ పేరుతో రెండేళ్లు వెంట తిరిగి, పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో ఒక యువతిని అందరూ చూస్తుండగానే చంపేందుకు ప్రయత్నించాడో సైకో. రాళ్లతో కొట్టి చంపుతూంటే స్థానికులు అడ్డుకున్నారు.

Love Failure Attack on Student: తమిళనాడులోని తిరుచిరాపల్లి నగరంలో ఒక ఉన్మాది ఘాతుకం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  తిరుచిరాపల్లిలోని ఖాజామలై ప్రాంతంలో ఉన్న  డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్  మైదానం వద్ద బుధవారం సాయంత్రం ఒక యువకుడు యువతిపై దాడి చేస్తున్న దృశ్యాలు చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు.  నవీన్ అనే యువకుడు, అమల  అనే యువతిని గత రెండేళ్లుగా ప్రేమిస్తున్నారు. అమల ప్రస్తుతం ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అయితే, పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి.

 పెళ్లికి నిరాకరణ - పక్కా ప్లాన్‌తో దాడి                        

నవీన్ తనను పెళ్లి చేసుకోవాలని చాలా కాలంగా అమలపై ఒత్తిడి తెస్తున్నాడు. అయితే, కులాలు వేరు కావడం వల్ల తన ఇంట్లో వాళ్లు ఈ పెళ్లికి అంగీకరించరని, అందుకే మనం విడిపోవడమే మంచిదని అమల అతనికి తెగేసి చెప్పింది.  బ్రేకప్  చెబుదామని ఆమె అనడంతో నవీన్ కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను అంతం చేయాలని భావించిన నవీన్, మాట్లాడదామని పిలిచి స్పోర్ట్స్ కాంప్లెక్స్ సమీపానికి రప్పించాడు. అక్కడ మరోసారి పెళ్లి గురించి గొడవ జరగడంతో, ఒక్కసారిగా తన వద్ద ఉన్న రాళ్లతో ఆమె తలపై బలంగా బాదాడు.

ఉన్మాదికి దేహశుద్ధి 

అమల తీవ్ర గాయాలతో రోడ్డుపై పడిపోయి ప్రాణాల కోసం అరుస్తున్నా, నవీన్ కనికరం లేకుండా ఆమెను బూతులు తిడుతూ దాడిని కొనసాగించాడు. ఈ భయానక దృశ్యాలను అక్కడున్న కొందరు తమ ఫోన్లలో రికార్డ్ చేశారు. అయితే, పరిస్థితి విషమిస్తోందని గమనించిన స్థానికులు వెంటనే తేరుకుని నవీన్‌ను చుట్టుముట్టారు. అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి, స్థానిక పోలీసులకు అప్పగించారు. తీవ్ర రక్తస్రావంతో స్పృహ తప్పి పడిపోయిన అమలను వెంటనే తిరుచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

డెలివరీ బాయ్‌గా పని చేస్తున్న నిందితుడు                           
 
 నిందితుడు నవీన్ ఒక ప్రైవేట్ కంపెనీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. గతంలోనూ ఇతను అమలను వేధించినట్లు సమాచారం. నిందితుడిపై హత్యాయత్నం,  మహిళా వేధింపుల చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ముందు హాజరుపరిచిన అనంతరం అతడిని రిమాండ్‌కు తరలించారు. ఈ ఘాతుకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.                       


 

టాప్ హెడ్ లైన్స్

Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Adilabad Crime News: మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
Hyderabad Building Collapse: గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!
గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Gill Historic Milestone: గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
IND VS SL Padikkal Hundred: పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
Embed widget