అన్వేషించండి

IIT Bombay Incident: ఎగ్జామ్ హాల్‌లో చాట్‌ జీపీటీ వాడుతూ దొరికి.. ఐఐటీ బాంబే విద్యార్థి ఆ*త్మహత్య!

IIT Bombay Incident: ఐఐటీ బాంబే పవయీ క్యాంపస్ లో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది. ఈ ఘటనపై విద్యార్థులు నిరసనకు దిగారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ, క్యాంపస్‌లో భద్రత పెంచారు.

IIT Bombay Incident: ఐఐటీ బాంబేకు చెందిన పవయీ క్యాంపస్‌లో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది. ఇటీవల జరిగిన పరీక్షలో.. చాట్ జీపీటీ వాడుతూ మొబైల్‌‌తో దొరికిపోయాడు. ఈ పరిణామాల నేపథ్యంలో  శుక్రవారం రాత్రి తన హాస్టల్‌ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఐఐటీ బాంబే అధికారులు తెలిపిన వివరాల మేరకు ఎనర్జీ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో సెకండియర్ చదువుతోన్న సాహిల్‌ (19) అనే యువకుడు ఇటీవల పరీక్ష హాల్‌లో మొబైల్‌‌తో దొరికిపోయాడు. ప్రశ్నపత్రాన్ని చాట్‌జీపీటీలో అప్‌లోడ్‌ చేస్తూ ఇన్విజిలేటర్‌కు దొరికిపోయాడు. ఇందుకు గానూ అధికారులు అతడిపై క్రమశిక్షణా చర్యలు ఏం తీసుకోలేదు. అయితే డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ సాహిల్‌ను పిలిచి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. 

ఈ ఏడాది నాలుగో ఘటన 

అయితే సాహిల్‌ శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఈ ఏడాది ఐఐటీ బాంబేలో జరిగిన నాలుగో మరణం ఇది. దీంతో నిన్న రాత్రి క్యాంపస్‌లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. వరుస ఆత్మహత్యలపై యాజమాన్యం సమాధానం చెప్పాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో క్యాంపస్‌లో పోలీసులు భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై ఐఐటీ బాంబే తాజాగా ప్రకటన విడుదల చేసింది. విద్యార్థి మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నామని పేర్కొంది. ఈ విచారకర సమయంలో మృతుడి స్నేహితులు, కుటుంబసభ్యులకు సానుభూతి ప్రకటిస్తున్నారని, ఈ ఘటనకు గల కారణాలపై సంబంధిత అధికారులతో దర్యాప్తు చేస్తున్నామని విద్యాసంస్థ వెల్లడించింది. 
Also Read: మమతా బెనర్జీకి బిగ్ షాక్ - టిఎంసి పేరు, గుర్తు ఫ్రీజ్! బెంగాల్‌లో శివసేన, ఎన్సీపీ తరహా రాజకీయం జరుగుతుందా?

వాస్తవాలు చెప్పడంలేదు - విద్యార్థుల నిరసన

ఈ ఘటనకు సంబంధించిన పరిస్థితులపై ఐఐటీ బాంబే వాస్తవాలు చెప్పడంలేదని నిరసన చేస్తున్న విద్యార్థులు ఆరోపించారు. మోసానికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిని ఏడాది పాటు సస్పెండ్ చేస్తామని బెదిరించినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ సస్పెండ్ చేస్తే, ఆ విద్యార్థి హాస్టల్ ఖాళీ చేసి క్యాంపస్ బయట నివసించాల్సి ఉంటుందని తెలిపారు. విద్యార్థుల ప్రకారం, ఈ చర్యల వల్ల విద్యార్థి ఇంజినీరింగ్ కోర్సు నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పట్టే అవకాశం ఉండేది. క్రమశిక్షణ చర్యలకు భయపడి, ఒత్తిడి కారణంగానే విద్యార్థి ఈ తీవ్రమైన నిర్ణయం తీసుకున్నట్లు నిరసన చేస్తున్న విద్యార్థులు ఆరోపించారు. 
Also Read: ఉద్యోగం కోసం 38 ఏళ్ల పాటు పోరాడిన మహిళ.. IOC వర్సెస్ సుమిత్ర కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

పోలీసుల దర్యాప్తు

"ఇది మొదటి సంఘటన కాదు. ఈ ఒక్క సంవత్సరంలోనే నాలుగు జరిగాయి. గత రెండు నెలల్లోనే రెండు జరిగాయి. ఇది ఎందుకు జరుగుతోందో, వీటంన్నిటి వెనుక కారణాలు ఏమిటో మాకు ఏమాత్రం తెలియదు" అని నిరసన చేస్తున్న విద్యార్థి అన్నారు. విద్యార్థులకు, యాజమాన్యానికి మధ్య చర్చలు జరుగుతుండగా, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు క్యాంపస్‌లో భారీగా బలగాలను మోహరించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఐఐటీ పవాయ్‌ క్యాంపస్ లో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీని తరువాత, కొంతమంది ఐఐటీ విద్యార్థులు తమ డిమాండ్ల కోసం నిరసన చేపట్టారు. ఈ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు ఐఐటీ యాజమాన్యం వారితో చర్చలు జరుపుతోంది" అని డీసీపీ తెలిపారు. 
Also Read: తమిళనాడు ఉపఎన్నికల రగడ - విజయ్‌కి షాకిచ్చిన కమ్యూనిస్టులు! తిరుచ్చి ఎన్నికలు ఎందుకు జరగడం లేదు?

Frequently Asked Questions

ఈ ఘటనపై ఐఐటీ బాంబే యాజమాన్యం ఎలా స్పందించింది?

ఐఐటీ బాంబే విద్యార్థి మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఘటన కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని, మృతుడి కుటుంబానికి సానుభూతి తెలిపింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Advertisement

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Shikhar Dhawan Warning: పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Vijayasai Reddy New Party Postponed: అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
Embed widget