అన్వేషించండి

Toronto gold heist: ఇది రియల్ థూమ్ - కెనడా విమానంలో 400 కేజీల బంగారం లూఠీ - దొంగ ఇండియనే!

Toronto gold: కెనడాలోని టొరంటోనే ఓ విమానం లగేజీలో వచ్చిన 400 కేజీల బంగారాన్ని కొంత మంది గుట్టుగా దొంగతనం చేశారు. అమ్మేసుకున్నారు. ఆ ముఠా నాయకుడు ఇప్పుడు ఇండియాలో ఉన్నాడట

Toronto gold heist Accuse in India: కెనడా చరిత్రలోనే అతిపెద్ద బంగారు దోపిడీ కేసులో కీలక నిందితుడైన అర్సలాన్ చౌదరిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. 2023లో టొరంటోలోని పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఈ భారీ చోరీకి సంబంధించి, దుబాయ్ నుండి టొరంటో చేరుకున్న అతడిని పీల్ రీజినల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన న్యాయవాదుల ద్వారా పోలీసులకు లొంగిపోయేందుకు ముందే ఒప్పందం కుదుర్చుకున్న అర్సలాన్, విమానం దిగగానే పట్టుబడ్డాడు.   

ఈ భారీ దోపిడీ ఏప్రిల్ 17, 2023న జరిగింది. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నుండి వచ్చిన విమానంలో సుమారు 400 కిలోల బంగారంస 2.5 మిలియన్ డాలర్ల నగదు ఉంది. విమానాశ్రయంలోని కార్గో హ్యాండ్లింగ్ యూనిట్ నుండి ఈ నిధిని అత్యంత చాకచక్యంగా మాయం చేశారు. ఈ కేసులో ఎయిర్ కెనడా మాజీ ఉద్యోగుల ప్రమేయం కూడా ఉందని, అంతర్గతంగా కొంత మంది వ్యక్తుల సహకారంతోనే ఈ చోరీ జరిగినట్లు దర్యాప్తులో తేలింది.                                         

అరెస్ట్ అయిన అర్సలాన్ చౌదరిపై దొంగతనం, నేరపూరిత కుట్ర ,  అక్రమంగా సంపాదించిన ఆస్తులను కలిగి ఉండటం వంటి తీవ్రమైన ఆరోపణలు నమోదయ్యాయి. దోపిడీ చేసిన బంగారాన్ని విక్రయించడంలో,  ఆ సొమ్మును కెనడా వెలుపలికి తరలించడంలో ఇతడు కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు భావిస్తున్నారు. అంతర్జాతీయ దర్యాప్తు సంస్థల సహకారంతో ఈ కేసును ఛేదించామని, నిందితులు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టబోమని  పోలీసులు అంటున్నారు.  

అయితే, ఈ కేసులో మరో ప్రధాన నిందితుడు ,  ఎయిర్ కెనడా మాజీ ఉద్యోగి అయిన సిమ్రాన్ ప్రీత్ పనేసర్ ప్రస్తుతం భారతదేశంలో తలదాచుకున్నట్లు కెనడా పోలీసులు అనుమానిస్తున్నారు. అతని కోసం కెనడా వ్యాప్తంగా వారెంట్ జారీ చేయబడింది. 'ప్రాజెక్ట్ 24K' పేరుతో కొనసాగుతున్న ఈ విచారణలో మరికొంతమంది నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు ఈ దోపిడీకి సంబంధించి పలువురిని అరెస్ట్ చేసినా, పూర్తిస్థాయిలో రికవరీ ఇంకా కాలేదు.                   

 

టాప్ హెడ్ లైన్స్

Adilabad Fake Aadhaar Certificate Gang Arreste: ఆదిలాబాద్‌లో ఘరానా నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు - ఐదుగురు కేటుగాళ్లు అరెస్ట్!
ఆదిలాబాద్‌లో ఘరానా నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు - ఐదుగురు కేటుగాళ్లు అరెస్ట్!
Adilabad Bangladesh Illegal Burglar Gang Arrest: దేశంలోకి అక్రమంగా చొరబడటమే కాకుండా దోపిడీలు కూడా చేస్తున్నారు - బంగ్లా గ్యాంగ్ ను అరెస్టు చేసిన ఆదిలాబాద్ పోలీసులు
దేశంలోకి అక్రమంగా చొరబడటమే కాకుండా దోపిడీలు కూడా చేస్తున్నారు - బంగ్లా గ్యాంగ్ ను అరెస్టు చేసిన ఆదిలాబాద్ పోలీసులు
Krishna Crime: కృష్ణాజిల్లా ఎక్సైజ్ కానిస్టేబుల్ వేధింపులు- ఉయ్యూరులో దంపతుల ఆత్మహత్యాయత్నం
కృష్ణాజిల్లా ఎక్సైజ్ కానిస్టేబుల్ వేధింపులు- ఉయ్యూరులో దంపతుల ఆత్మహత్యాయత్నం
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
New Fielding Coach: టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
Amalapuram Latest News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
Embed widget