Tirupati Crime: భార్యపై అనుమానంతో కక్ష పెంచుకున్న భర్త, ఎవరికి తెలియకుండా ఎలా హత్య చేశాడంటే ?
సంక్రాంతి పండుగ నాడు భార్య పిల్లలతో సంతోషంగా గడపాల్సింది పోయి భార్యతో గొడవకు దిగి హత మార్చిన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జరిగింది.
తిరుపతి : భార్యలపై భర్తలు, భర్తలపై భార్యలు అనుమానం పెంచుకుని పచ్చటి కాపురంలో చేతులారా చిచ్చు పెట్టుకుంటున్నారు. అనుమానం పెంచుకున్న ఓ భర్త తరచూ భార్యను చిత్రహింసలకు గురి చేసి, గొడవ పడేవాడు. సంక్రాంతి పండుగ నాడు భార్య పిల్లలతో సంతోషంగా గడపాల్సింది పోయి భార్యతో గొడవకు దిగి హత మార్చిన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం..
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ లో ఉమామహేశ్వరి(23), అతని భర్త చెంగయ్య(27) లు నివాసం ఉంటున్నారు. అయితే వీరి అన్యోన్య దాంపత్యానికి ప్రతిరూపంగా రితికా(7), జగదీష్(5)లు ఉన్నారు. చెంగయ్య బేల్ధారుగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. పెళ్లయి ఎనిమిది సంవత్సరాల వరకు దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే చెంగయ్యకు ఇటీవల భార్య ఉమామహేశ్వరిపై అనుమానం కలిగింది. అంతేకాకుండా తన భార్య మరోకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని భ్రమ పడిన చెంగయ్య తరచూ భార్యను వేధింపులకు గురి చేసేవాడు. కనీసం భార్యను పుట్టింటికి కూడా పంపేవాడు కాదు..
బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళతో సైతం భార్యను మాట్లాడనిచ్చేవాడు కాదు.
ఎవరితో మాట్లాడినా వారితో అక్రమ సంబంధం పెట్టుకున్నావని ఉమామహేశ్వరిని వేధింపులకు గురి చేసేవాడు. ఇలా ఉండగా పని పూర్తి చేసుకుని ఇంటికి వస్తే తరచూ భార్యతో గొడవకు దిగ్గేవాడు చెంగయ్య. ఆదివారం సంక్రాంతి పండుగ కావడంతో ఇద్దరూ పిల్లలను మహేశ్వరీ తన పుట్టినింటికి పంపింది. అయితే ఇంట్లో ఎవరూలేక పోవడంతో భార్యతో చెంగయ్య గొడవపడ్డాడు. అయితే ఇద్దరూ మధ్య మాటల యుద్దం జరిగింది. కోపోద్రిక్తుడైన చెంగయ్య తన ఇంటిలో ఉన్న కర్రను తెచ్చిన భార్య తలపై మోదాడు. దీంతో రక్రస్రావం కావడంతో ఉమామహేశ్వరీ సంఘటన స్ధలంలోనే మృతి చెందింది.
సోమవారం ఉదయం చిన్నారులను తీసుకుని కుమార్తె ఇంటికి వచ్చిన ఉమామహేశ్వరీ తల్లి కళ్ల ముందే విగతజీవిలా పడి ఉండడాన్ని చూసి బోరున ఏడుస్తూ స్ధానికుల సహాయంతో పోలీసులకు సమాచారం అందించింది. ఘటన స్ధలానికి చేరుకున్న పోలీసులు సంఘటన అక్కడ ఉన్న కర్రను స్వాధీనం చేసుకుని మృతదేహాన్ని పోస్టుమాస్టం నిమిత్తం శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలు తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందుతుడు చెంగయ్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
అనకాపల్లిలో దారుణం - ముక్కలు ముక్కలుగా నరికి వ్యక్తి దారుణ హత్య
అనకాపల్లి జిల్లాలోని ఎలమంచిలి మున్సిపాలిటీ కొత్తపాలెం సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికిన దుండగులు తమ, మొండం, కాళ్లను వేర్వేరుగా పడేశారు. ఎలమంచిలి కొత్తపాలెం బ్రిడ్జి కింద శరీర భాగాలు గుర్తించిన స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గురైన వ్యక్తి వివరాలు ఇంకా తెలియ రాలేదు. అది తెలుసుకునేందుకే పోలీసులు చాలా కష్టపడుతున్నారు. అలాగే ఈ హత్య ఎవరు, ఎందుకు చేశారో తెలుసుకునేందుకు కృషి చేస్తున్నారు. క్రికెట్ ఆడేందుకు వెళ్లిన స్థానిక యువకులు మృతదేహాన్ని మొదటగా చూసి పోలీసులకు సమాచారం అందించారు.