By: ABP Desam | Updated at : 30 Jun 2022 05:19 PM (IST)
సొత్తు లూటీ చేసి అమ్ముకున్న పోలీసులు
Tirupati Police Thiefs : ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారని అంటారు. అది నిజమో కానీ .. ఎప్పుడూ దొంగలను పట్టుకుంటూ.. దొంగలకు కాపలా కాస్తూ పోలీసులు దొంగ బుద్దులు నేర్చుకుంటున్నారు. అయితే అంతా చూసే కళ్లలో ఉంటుందన్నట్లుగా.. ఈ నేర్చుకోవడాలు కూడా బుద్దిలో ఉంటాయి. పోలీసు ఉద్యోగం వచ్చినా మనసులో ఎక్కడో దొంగ బుద్దులు ఉంటే... దొంగల పని భలే ఉందే.. అనుకుని చాన్స్ వచ్చినప్పుడు పోలీస్ డ్రెస్‌లో దొంగలైపోతారు. ఇలాంటి వారు తరచూ వెలుగులోకి వస్తూంటారు. తాజాగా తిరుపతి జిల్లాలో ఇలాంటి పోలీసులు పట్టుబడ్డారు. ఓ సీఐ, ముగ్గురు ఎస్ఐలు రూ. 20 లక్షల సరుకు దొంగిలించి అమ్మేసుకుని దొరికిపోయారు. సస్పెండై ఇంట్లో కూర్చున్నారు.
తోడు దొంగలకు ఆ తండ్రీకొడుకులే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్
తిరుచానూరు పరిధిలోని శ్రీనివాసపురంలో ఓ భవనాన్ని ముత్తుకుమార్ అనే వ్యక్తి అద్దెకు తీసుకున్నాడు. అందులో ఐటీసీ కంపెనీకి చెందిన సిగరెట్లను స్టాక్ పెట్టి దుకాణాలకు హోల్‌సేల్‌గా విక్రయిస్తూ ఉంటాడు. ఓ రకంగా గోడౌన్‌గా వాడుకుంటున్నాడు. అయితే ఆ భవన యజమాని ఖాళీ చేయాలని ముత్తుకుమార్‌ను చెప్పాడు. అయితే బిజినెస్ పనులకు బాగా ఉపయోగపడుతున్నందున ఖాళీ చేయడానికి ముత్తుకుమార్ ఆలస్యం చేస్తూ వచ్చాడు. ఎలాగైనా భవనాన్ని సొంతం చేసుకోవాలని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే మణికంఠ అనే వ్యక్తిని ఆశ్రయించాడు. ఇద్దరూ కలిసి ఫ్రాడ్ చేయాలని ప్రయత్నించారు. ఈ క్రమంలో వివాదం పోలీస్ స్టేషన్‌కు చేరింది.
అమ్మఒడి పడిన మరుసటి రోజే బడిలో దొంగలు- నెల్లూరులో సంచలనం
ఈ వివాదంలోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. రియల్ ఎస్టేట్ మాఫియా వెంట నిలిచిన పోలీసులు ఓ అర్థరాత్రి భవనంపై దాడి చేసి ఖాళీ చేయించారు. అంత వరకూ బాగానే ఉంది.. కానీ ఖాళీ చేయించిన సామాన్లను తమతో ఎత్తుకుపోయారు. అందులో ఉంది ఐటీసీ కంపెనీకి చెందిన సిగరెట్లు. రూ.20 లక్షలు విలువ చేసే సిగరెట్ ప్యాకెట్లు కావడంతో వాటిని తమతో పాటు తీసుకెల్లిపోయారు. తిరుచానూరులో పని చేస్తున్న ఎస్‌ఐ వీరేష్‌తో కలసి సిగరెట్ ప్యాకెట్లు విక్రయించి సొమ్ము చేసుకున్నారు.. ఈ మొత్తం నగదును సీఐ సుబ్రమణ్యంతో పాటు ఎస్‌ఐలు రామకృష్ణ, రామకృష్ణారెడ్డిలు కూడా పంచుకుని మిగిలిన మొత్తాన్ని రియల్ ఎస్టేట్ మాఫియా కూడా పంచుకున్నారు.
భవనంలో నిల్వ ఉంచిన సిగరేట్ ఫ్యాకెట్లను ఎస్సై వీరేష్ సహకరంతో అమ్మెశారని తెలుసుకున్న ఐటీసీ కంపెనీ మేనేజర్ తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో పుత్తూరు డీఎస్పీని విచారణ అధికారిగా నియమించి దర్యాప్తు చేయించారు. నిష్పక్షపాతంగా విచారించగా సీఐతో పాటు ముగ్గురు ఎస్‌ఐలు కూడా అవినీతికి పాల్పడినట్లు తేలింది.. దీనిపై తిరుపతి ఎస్పి పరమేశ్వర రెడ్డి పోలీసు ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు.. అనంతపురం రేంజ్ డీఐజీ రవిప్రకాష్ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి సీఐతో పాటుగా ముగ్గురు ఎస్సైలను సస్పెండ్ చేశారు.. అంతే కాకుండా వీరికి సహకరించిన మణికంఠ, ఇర్పాన్, శ్రీనివాస్‌లతో పాటు మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు..
Road Accident : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, తల్లీ కొడుకు మృతి!
Cairo church Fire : కైరో చర్చిలో అగ్నిప్రమాదం, 41 మంది సజీవదహనం
Naina Jaiswal : నైనా జైస్వాల్ కు ఇన్ స్టాలో వేధింపులు, యువకుడు అరెస్టు!
Lovers Suicide: వాట్సాప్‌లో చాటింగ్, ఆపై పురుగుల మందు తాగి ప్రేమజంట ఆత్మహత్య - అసలేం జరిగిందంటే !
Tirumala: టీటీడీలో టిక్కెట్ల మోసం - ఇంటి దొంగతో పాటు, మరో ఐదు మంది దళారులు అరెస్టు
Independence Day 2022: ప్రధాని మోదీ ఏ ప్రకటనలు చేస్తారో? స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంపై అంచనాలు
మొట్టమొదటిసారి అలాంటి ఫోన్ లాంచ్ చేయనున్న వన్‌ప్లస్ - ఇక శాంసంగ్‌కు కష్టమే!
Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, దర్శనానికి 40 గంటలు పైనే!
pTron Tangent Duo: రూ.500లోపే వైర్లెస్ ఇయర్‌ఫోన్స్ - రీసౌండ్ పక్కా!