By: ABP Desam | Updated at : 29 Jun 2022 07:27 PM (IST)
నెల్లూరు ప్రభుత్వ బడిలో చోరీ
చిన్నప్పుడు బడి ఎగ్గొట్టి తిరిగే వాళ్లని బడి దొంగలు అనేవాళ్లు. కానీ మారిన రోజుల్లో ఇప్పుడు బడిలో కూడా దొంగతనానికి పాల్పడుతున్నారు కొందరు. గతంలో సర్కారు బడి అంటే.. బెత్తం, డస్టర్, మహా అయితే బీరువాలో రిజిస్టర్లు.. అంతకు మించి ఇంకేమీ ఉండేవి కావు. కానీ ఇప్పుడు నాడు-నేడుతో స్కూల్ రూపు రేఖలు మారిపోయాయి. సర్కారు బడుల్లో కూడా అన్ని వస్తువులు అందుబాటులో ఉంటున్నాయి. ముఖ్యంగా పిల్లల కోసం కంప్యూటర్లు, ఇతర పరికరాలు అందుబాటులో ఉంచుతున్నారు. ఇదే అదనుగా దొంగలు చెలరేగిపోతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా అనంతసాగరం జడ్పీ హైస్కూల్‌లో దొంగలు పడ్డారు. ఉన్న వస్తువులన్నీ ఊడ్చుకెళ్లారు.
ఓ వైపు ప్రభుత్వం నాడు-నేడు, అమ్మఒడి అంటూ ప్రభుత్వ స్కూళ్ల రూపు రేఖలు మారుస్తుంటే.. మరోవైపు బడి దొంగలు తమ పని తాము చేసుకు వెళ్తున్నారు. సర్కారు బడులకు సెక్యూరిటీ ఉండదు కాబట్టి, వారి పని సులువవుతుంది. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్‌లో చోరీ జరిగింది. క్లాస్ రూమ్ తాళాలు పగల గొట్టి.. ఇన్వర్టర్, బ్యాటరీ, కంప్యూటర్, సీపీయూ, మానిటర్.. ఇలా అన్ని వస్తువులు దోచుకెళ్లారు దొంగలు. ఉదయం పోలీసులకు ఉపాధ్యాయులు ఫిర్యాదు చేయగా.. సాయంత్రం క్లూస్ టీమ్ వచ్చి వివరాలు సేకరించింది. దొంగల జాడ పసిగట్టడానికి పోలీసులు ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేశారు.
ఇటీవలే వేసవి సెలవుల అనంతరం ఉపాధ్యాయులను స్కూళ్లకు పిలిపించింది సర్కారు. విద్యార్థుల కోసం వచ్చే నెల 5న స్కూల్స్ తిరిగి మొదలవుతాయి. ఈ క్రమంలో ముందస్తుగా ఉపాధ్యాయుల కోసం స్కూల్స్ తెరిచారు. బుధవారం ఉదయాన్నే స్కూల్ కి వచ్చిన ఉపాధ్యాయులు తాళం పగల గొట్టి ఉండటం చూసి షాకయ్యారు. లోపలకి పోయి చూడగా కంప్యూటర్, సీపీయూ అన్నీ మాయమయ్యాయి. ఇన్వర్టర్, బ్యాటరీ కూడా దొంగలు ఎత్తుకుపోయినట్టు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ఫోటోలు తీసి వారికి వాట్సప్ చేశారు.
పోలీసులు క్లూస్ టీమ్ తీసుకొచ్చి ఆధారాలు సేకరించారు తెలిసినవారి పని అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. దొంగలు నేరుగా కంప్యూటర్ ఉన్న రూమ్ తాళాలు మాత్రమే పగలగొట్టడం అనుమానాలకు తావిస్తోంది. విలువైన వస్తువులను ఉంచే రూమ్ కాబట్టి, ఆ ఒక్క రూమ్ తాళాలు పగలగొట్టి వస్తవులు దోచుకెళ్లారు. తెలిసినవారయితేనే నేరుగా ఆ రూమ్ తాళాలు పగలగొడతారని అనుమానిస్తున్నారు పోలీసులు. క్లూస్ టీమ్ సేకరించిన ఫింగర్ ప్రింట్స్ ప్రకారం కేసు దర్యాప్తు ముమ్మరం చేస్తామంటున్నారు అనంతసాగరం పోలీసులు.
ప్రభుత్వ స్కూల్‌లో దొంగలు పడ్డారు కాబట్టి, పోలీసులు కూడా ఈ కేసుని ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. పిల్లలకు స్కూల్ మొదలయ్యే లోగా వస్తువులు రికవరీ చేయడానికి ప్రయత్నం చేస్తామంటున్నారు. మొత్తమ్మీద మరికొన్ని రోజుల్లో స్కూల్స్ తెరిగి ప్రారంభమవుతాయనుకుంటున్న సమయంలో.. నెల్లూరు జిల్లా స్కూల్ లో దొంగలు పడటం సంచలనంగా మారింది.
నేను పార్టీ మారడంలేదు-వైసీపీ ఎమ్మెల్యే క్లారిటీ
Petrol-Diesel Price, 11 August: నిలకడగా ఇంధన ధరలు- మీ నగరంలో ఈరోజు ఇలా
Rains in AP Telangana: తీవ్ర వాయుగుండం - నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన IMD
TDP Women Leaders : అన్ని పార్టీల మహిళా నేతలతో కలిసి ప్రభుత్వం ఉద్యమం - గోరంట్ల ఇష్యూలో టీడీపీ దూకుడు !
AP Home Minister : ఎంపీ ఇచ్చిన ఫిర్యాదుపైనే విచారణ -ఎంపీ మాధన్ వీడియోపై ఏపీ హోంమంత్రి స్పందన !
NBK108 Announcement : ఇంతకు ముందు ఎప్పుడూ చేయనటువంటి పాత్రలో నందమూరి బాలకృష్ణ
కొత్త తరహా ఆండ్రాయిడ్ వెర్షన్తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - 1000 జీబీ వరకు స్టోరేజ్ కూడా!
Kajal Aggarwal : కట్టప్పలా మారిన కాజల్ - బాహుబలి ఎవరో చూశారా రాజమౌళి గారూ?
SC On Political Parties: ఎన్నికల్లో ‘ఫ్రీ’లు చాలా సీరియస్, డిబేట్ అవసరం - నా రిటైర్మెంట్లోగా రండి: CJI